వైన్‌ ‌షాపుల డ్రాకు హైకోర్టు గ్రీన్‌ ‌సిగ్నల్‌

‌- మద్యం షాపుల డ్రాకు తొలగిన అడ్డంకులు
– 27న యధావిధిగా కలెక్టర్ల సమక్షంలో డ్రాలు
– ఏర్పాట్లు చేసుకోవాలని ఎక్సైజ్‌ ‌శాఖ ఆదేశాలు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25:  ‌తెలంగాణలో మద్యం షాపుల డ్రాకు అడ్డంకులు తొలగిపోయాయి. వైన్‌ ‌షాపుల డ్రాకు హైకోర్టు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో అక్టోబర్‌ 27‌న యధావిధిగా మద్యం షాపుల డ్రా పక్రియను ఎక్సైజ్‌ ‌శాఖ నిర్వహించనుంది. కాగా, వైన్‌ ‌షాపుల కేటాయింపు కోసం గడువు ముగిసిన తర్వాత కూడా దరఖాస్తులు తీసుకున్నారని పేర్కొంటూ ఐదుగురు మద్యం వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై శనివారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నెల 18వ తేదీ వరకు ఉన్న మద్యం టెండర్ల గడువును 23వ తేదీ వరకు పెంచారని పిటిషనర్‌ ‌తరఫు న్యాయవాదాలు హైకోర్టుకు తెలిపారు. 23వ తేదీకి పెంచడం వల్ల ఐదువేలకు పైగా దరఖాస్తులు అదనంగా వొచ్చాయని వివరించారు. ఇది తెలంగాణ ప్రోహిబిషన్‌ ఎక్స్సైజ్‌ ‌యాక్ట్ ‌నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఆర్టికల్‌ 12 (5) ‌ప్రకారం గడువు పెంచడానికి అవకాశం లేదని పిటిషనర్‌ ‌తరఫు న్యాయవాది వివరించారు. ఈ నెల 23న జరగాల్సిన లక్కీ డ్రాను కూడా 27వ తేదీకి పొడిగించారని తెలిపారు. ప్రభుత్వం తరుఫున అడిషనల్‌ అడ్వొకేట్‌ ‌జనరల్‌ ‌వాదనలు వినిపిస్తూ.. గడువు పెంచడం అనేది తెలంగాణ ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయమని తెలిపారు. గడువు పెంచే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ప్రభుత్వ వాదనలతో ఏకీభవించింది. ఈ మేరకు మద్యం దుకాణాల డ్రా పక్రియ నిర్వహించేందుకు ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. హైకోర్టు నుంచి మద్యం షాపుల డ్రాకు అనుమతి రావడంతో డ్రా పక్రియ ఏర్పాట్లను చేసుకోవాల్సిందిగా ఎక్సైజ్‌ ‌కమిషనర్‌ ‌హరికిరణ్‌ అధికారులను ఆదేశించారు. కమిషనర్‌ ఆదేశాల మేరకు  27న మద్యం షాపుల డ్రాకు ఎక్సైజ్‌ ‌శాఖ అధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. జిల్లా కలెక్టర్ల చేతుల దుగా సోమవారం ఉదయం 11 గంటలకు మద్యం షాపుల డ్రా ప్రకియ నిర్వహించ నున్నారు. కాగా, తెలంగాణలోని 2620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. మద్యం షాపులకు వొచ్చిన దరఖాస్తులను డ్రా పద్దతిలో ఎంపిక చేసి లైసెన్స్‌లు జారీ చేయనున్నారు. డ్రా ఏర్పాట్లను పూర్తి చేయాల్సిందిగా ప్రొహిబిషన్‌ అం‌డ్‌ ఎక్సైజ్‌ ‌కమిషనర్‌ ‌సి. హరికిరణ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 2,620 మద్యం షాపుల కోసం భారీ స్థాయిలో 95,137 దరఖాస్తులు వొచ్చాయి. జిల్లాల వారీగా ఈ నెల 27న ఉదయం 11 గంటలకు దరఖాస్తుదారులు, ప్రజల సమక్షంలో జిల్లా కలెక్టర్ల చేతుల దుగా మద్యం షాపుల డ్రా పక్రియ కొనసాగనుంది. ఈ డ్రా ద్వారా కొత్త లైసెన్స్‌దారుల ఎంపిక జరగనుంది. అదిలాబాద్‌లో 40 మద్యం షాపులకు 771 దరఖాస్తులు, కోమురం భీం అసిఫాబాద్‌లో 32 షాపులకు 680, మంచిర్యాలలో 73 షాపులకు 1712, నిర్మల్‌లో 47 షాపులకు 3002, జగిత్యాలలో 71 షాపులకు 1966, కరీంనగర్‌లో 94 షాపులకు 2730, పెద్దపల్లి 77 షాపులకు 1507, రాజన్న సిరిసిల్లలో 48 షాపులకు 1381, ఖమ్మంలో 122 షాపులకు 4430, కొత్తగూడెం 88 షాపులకు 3922, జోగులాంబ గద్వాలలో 36 షాపులకు 774, మహబూబ్‌నగర్‌లో 90 షాపులకు 2487, నాగర్‌కర్నూల్‌లో 67 షాపులకు 1518, వనపర్తిలో 37 షాపులకు 757, మెదక్‌లో 49 షాపులకు 1920, సంగారెడ్డి 101 షాపులకు 4432, సిద్దిపేటలో 93 షాపులకు 2782, నల్లగొండ 155 షాపులకు 4906, సూర్యపేట్‌లో 99 షాపులకు 2771, యాదాద్రి భువనగరిలో 82 షాపులకు 2776, కామారెడ్డి 49 షాపులకు 1502, నిజామాబాద్‌ 102 ‌షాపులకు 2786, మల్కాజిగిరిలో 88 షాపులకు 5168, మేడ్చల్‌లో 114 షాపులకు 6063, సరూర్‌నగర్‌లో 134 షాపులకు 7845, శంషాబాద్‌లో 100 షాపులకు 8536 వికారాబాద్‌ 59 ‌షాపులకు 1808, జనగామాలో 47 షాపులకు 1697, భూపాలపల్లి 60 షాపులకు 1863, మహాబూబబాద్‌లో 59 షాపులకు 1800, వరంగల్‌ ‌రూరల్‌లో 63షాపులకు 1958, వరంగల్‌ అర్బన్‌లో 65 షాపులకు 3175 దరఖాస్తులు వొచ్చాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page