ఒలింపిక్స్‌కు వేదికగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం

– స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9 : రాబోయే రోజుల్లో ఒలింపిక్స్‌కు వేదికగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒలింపిక్స్‌లో ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్ అత్యంత వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలకు ఒక విధానం లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. అప్పుడప్పుడు పీటీ ఉష లాంటి క్రీడాకారులు క్రీడల్లో దేశానికి పేరు తెచ్చారని కొనియాడారు. ప్రపంచ దేశాల్లో భారత్‌ను క్రీడల్లో రాణించిన దేశంగా గుర్తించడం లేదని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక పాలసీని తీసుకొచ్చిందని తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్ విధానంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నామని ఆయన చెప్పారు. క్రీడల్లో రాణించిన పీటీ ఉష రాజ్యసభ సభ్యురాలి స్థాయికి చేరారని గుర్తు చేశారు. లక్ష్యాన్ని చేరాలంటే వంద శాతం కష్టపడాల్సిందేనన్నారు. యువకులు ఈ దేశ సంపద అని, క్రీడల్లో రాణిస్తే మీ భవిష్యత్తు బాగుంటుందని, క్రీడల్లో రాణించిన వారికి ఉద్యోగాలతోపాటు నగదు పారితోషికం ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 2028 నాటికి తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించుకుంటామని, క్రీడల్లో రాణించి దేశానికి పేరు తెస్తే మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష, క్రీడలు, యువజనుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, శాసమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, పుల్లెల గోపీచంద్, స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ జి.కిషోర్, శాట్-జి చైర్మన్ శివసేనా రెడ్డి, ప్రముఖ క్రీడాకారులు, ద్రోణాచార్య, అర్జున అవార్డు గ్రహీతలు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎ న్యూ ఎరా ఫర్ తెలంగాణ స్పోర్ట్సు ఎక్సలెన్స్‌ను సీఎం ప్రారంభించి యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ లోగో, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫిజికల్ లిటరసీ మిషన్‌ను, యంగ్ ఇండియా స్పోర్ట్స్ ఫెలోషిప్, అకడమిక్ కోర్సులను ప్రారంభించారు. ఆదిత్య మెహతా ఫౌండేషన్‌తో నేషనల్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రాం ఫర్ పారా అథ్లెట్స్‌కు పభుత్వం అవగాహన ఒప్పందం (ఎంవోయÖ) కుదుర్చుకున్నది. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన మై భారత్‌తోనూ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్న టోర్నమెంట్స్, లీగ్స్ వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. 8వ ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యÖత్ గేమ్స్-2026, నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెట్స్ మీట్(ఎనఐడీజేఏఎం) టోర్నమెంట్స్ తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్నది. హాకీ ఇండియా లీగ్, ప్రపంచ పికిల్ బాల్ లీగ్, ఆర్చరీ ప్రీమియర్ లీగ్, టెన్నిస్ ప్రీమియర్ లీగ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నది. తెలంగాణ స్పోర్ట్సు నాలెడ్జి ఆన్ వీల్స్ స్పోర్ట్స్ నాలెడ్జ్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *