వన్యప్రాణుల రక్షణ.. ఎవరి బాధ్యత…?

వన్యప్రాణుల సంరక్షణ అనేది వృక్ష మరియు జంతు జాతులను మరియు వాటి ఆవాసాలను రక్షించే పద్ధతి. వన్యప్రాణులు ప్రపంచ పర్యా వరణ వ్యవస్థలకు అంత ర్భాగం, ప్రకృతి ప్రక్రియలకు సమతుల్యత మరియు స్థిర త్వాన్ని అంది స్తాయి. వన్య ప్రాణుల సంరక్షణ లక్ష్యం ఈ జాతుల మనుగడను నిర్ధారించడం మరియు ఇతర జాతులతో స్థిరంగా జీవించడంపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా సాధ్యమవుతుంది. వన్యప్రాణులకు రక్షణ కరువైంది. ఫలితంగా రోజురోజుకూ అవి కనుమరుగవుతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా ఏజెన్సీ గ్రామాల్లో వేటగాళ్లు ఉచ్చులు, విద్యుత్‌ ‌తీగలు అమర్చి అడవి జంతువులను వధిస్తున్నారు. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా వాటి చర్మం, మాంసాన్ని పట్టణ ప్రాంతాలు, శివారుల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

ఇంత జరుగుతున్నా అటవీశాఖ అధికారులు పట్టిం చుకోవడం లేదు. ఎవరైనా సమాచారం ఇస్తేనే పట్టుకు ంటున్నారని, మరికొందరు నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వన్యప్రాణుల సంరక్షణకు కఠిన చట్టాలున్నా అవి అమలుకు నోచుకోవడం లేదనే విమర్శలున్నాయి. వేటగాళ్ల ఉచ్చులో పడి వన్యప్రాణులు విలవిల్లాడు తున్నాయి.పంటల కోసం అవి వస్తుండడంతో వేటగాళ్లు ఉచ్చులు, విద్యుత్‌ ‌తీగలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో కొండగొర్రె, అడవి పందులు, దుప్పులు, కుందేళ్లు, కొండముచ్చులు వంటి అడవి జంతువులు మృత్యువాత పడడంతో గుట్టుచప్పుడు కాకుండా మాంసాన్ని మైదాన ప్రాంతాల్లోని రహస్య ప్రదేశాలకు తీసుకొచ్చి కిలో రూ. 500 నుంచి రూ. వేయి వరకు విక్రయిస్తున్నారు.వన్యప్రాణుల వేట యథేచ్ఛగా కొనసాగుతోంది.

బయటి ప్రాంతాల నుంచి కొందరు వేటగాళ్లు తుపాకులు వేసుకుని అడవిలో సంచిరిస్తూ,వన్యప్రాణుల పాలిట యమకి ంకరులు అవుతున్నారు.వన్యప్రాణులను సంరక్షిం చడానికి అనేక చట్టాలు ఉన్నాయి. వన్యప్రాణులను రక్షించడానికి భారత పార్లమెంటు 1972 లో వన్యప్రాణుల (రక్షణ) చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం వన్యప్రాణుల రక్షణ, సంరక్షణ, నిర్వహణకు సంబంధించిన నిబంధనలను కలిగి ఉంది.అందులో ముఖ్యంగా అడవి జంతువులు,పక్షులు మరియు మొక్కలకు రక్షణ కల్పించడం ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం.ఈ చట్టం కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది.కొన్ని ప్రాంతాలను అభయా రణ్యాలు లేదా జాతీయ ఉద్యానవనాలుగా ప్రకటించాలి. అడవి జంతువుల వేటను చట్టం నిషేధిస్తుంది.

పక్షులు మొదలైనవి మరియు అదే ఉల్లంఘించినందుకు శిక్షను విధించడం జరుగుతు ంది. కొన్ని చట్టాలను చూసినట్లయితే భారతదేశ వన్యప్రాణి సంరక్షణ చట్టం -1972,అటవీ, పక్షుల, జంతువుల భద్రతా చట్టం – 1912,భారతీయ ఏనుగుల భద్రత చట్టం – 1879,బెంగాల్‌ ‌ఖడ్గమృగ చట్టం -1932,మద్రాసు అటవీ ఏనుగుల చట్టం -1873,అసోం ఖడ్గమృగ భద్రత చట్టం -1954,ఇవే కాక ఆదేశిక సూత్రాల్లోని 48వ ప్రకరణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వన్య ప్రాణులను సంరక్షించాలని పేర్కొంది.అదేవిధంగా 51ఏ ప్రకారం వన్యప్రాణుల సంరక్షణ పౌరుల ప్రాథమిక విధిగా పేర్కొంది.42వ సవరణ ద్వారా వన్యప్రాణుల సంరక్షణ రాష్ట్రజాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి మార్చారు. వన్య పొలాలలో సంరక్షించడం అంటే జంతువుల, పశువుల ఆవాసాలను సంరక్షించడం. అంతరిం చిపోతున్న జాతులను సంరక్షించడం.

అక్రమ వేటను నివారించడం. జంతువులే మన దేశ భవిష్యత్తు అని భావించడం.జంతువులు మన జీవితంలో ఒక భాగం.ప్రజలు వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాటికి హాని కల్పిస్తున్నారు. దీని నివారించడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి.కానీ ప్రతి పౌరుడిగా మనము ముందడుగు వేసి మన కర్తవ్యాన్ని నెరవేర్చినప్పుడే వన్య ప్రాణుల సంరక్షణ సాధ్యమవుతుంది. వన్యప్రాణుల సంరక్షణ ప్రభుత్వానిది,ప్రజలది కాదు, మన అందరిదీ. అందుకే వన్య ప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత గా భావించినప్పుడే వాటిని సంరక్షించగలం.

డా. మోటె చిరంజీవి

సామాజిక వేత్త, విశ్లేషకులు

9949194327

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page