– చంపాపేటలో దారుణ ఘటన
హైదరాబాద్, ప్రజాతంత్ర ,ఆగస్ట్ 15 : నగరంలోని చంపాపేట కుమ్మరి బస్తీలో శనివారం దారుణం చోటుచేసుకుంది. కుటుంబ తగాదాల కారణంగా సొంత తమ్ముడే కసాయిగా మారి అన్నను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. చంపాపేట కుమ్మరి బస్తీలో నివాసముంటూ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న ముదావత్ వెంకటేష్ (28)కు, పక్క వీధిలోనే నివసిస్తున్న అతడి తమ్ముడు శివ(26)తో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. వీరి తండ్రి మరణించిన నాటినుంచి అన్నదమ్ముల మధ్య కుటుంబ విషయాల్లో వివాదాలు మరింత తీవ్రస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే శనివారం అన్నదమ్ముల మధ్య మరోసారి తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఆవేశానికి గురైన తమ్ముడు శివ కత్తెర తీసుకుని అన్నపై విచక్షణారహితంగా దాడి చేసి పొడిచాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేష్‌ను స్థానికులు వెంటనే హాస్పిటల్‌కి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే మార్గమధ్యలోనే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అన్నను పొడిచిన అనంతరం నిందితుడు శివ పరారయ్యాడు. సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కి తరలించారు. నిందితుడు శివ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు