వియత్నాంలో ఘోర విషాదం

– పర్యాటక బోటు బోల్తా
– 19 మంది తెలుగు పర్యాటకుల మృతి
– ఫు క్వాక్ ద్వీపం సమీపంలో విహారయాత్ర విషాదాంతం

హనోయ్, ప్రజాతంత్ర, జూలై 11: వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం సమీపం లో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న స్పీడ్ బోటు బోల్తాపడటంతో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 19 మంది తెలుగు పర్యాటకులు మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెం టనే వియత్నాం నేవీ, స్థానిక రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని స హాయక చర్యలు చేపట్టాయి. భారీ అలలు, ప్రతికూల వాతావరణం కారణంగా నే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతుల్లో కడప జిల్లా కు చెందిన శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన జయశ్రీ ఉన్నట్లు సమాచారం. కృష్ణా జిల్లాకు చెందిన వ్యాపారవేత్త కిషోర్ కుటుంబం కూడా ఈ ప్రమాదానికి గురికాగా, ఆయన భార్య మృతి చెందినట్లు తెలుస్తోంది. భారత రాయబార కార్యాలయం ప్రత్యేక హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు సహాయ చర్యలు చేపట్టింది. మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు చర్యలు కొనసాగుతుండగా ప్రమాదానికి గల కారణాలపై వియత్నాం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *