– అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో
న్యూదిల్లీ, మే 25 : అమెరికా`ఇరాన్ శాంతి చర్చల్లో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించడంపై భారత్‌కు ఎలాంటి అభ్యంతరమÖ లేదని అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మార్కో రుబియో పేర్కొన్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌లో ఉన్న రుబియో మంగళవారం జరగబోయే క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన భారత్, పాక్ సంబంధాల గురించి స్పందించారు. ’భారత్‌కు పాకిస్థాన్ విషయంలో ఉన్న ప్రధాన ఆందోళనలు ఉగ్రవాద సంస్థల గురించే. వాటికి ఇరాన్ చర్చల్లో పాకిస్థాన్ పాత్రతో సంబంధం లేదు. పాక్ భూభాగం నుంచి పనిచేస్తూ భారత దేశాన్ని లక్ష్యంగా చేసుకుంటున్న సాయుధ ఉగ్రవాద బృందాల గురించే ఇండియన్లు ఎక్కువగా మాట్లాడతారు.. వారు దాని గురించే ఎప్పుడూ ఆందోళన చెందుతూ ఉంటారు.. కానీ ఇరాన్ విషయంలో మధ్యవర్తిత్వం గురించి ప్రస్తావన రాలేదు.. దాని గురించి వారు ఫిర్యాదు చేస్తారని నేను అనుకోను’ అని రుబియో పేర్కొన్నారు. భారతదేశం అమెరికాకు అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి అని, ప్రముఖ వాణిజ్య భాగస్వామి అని అభివర్ణించారు. ‘ఈ బంధం బలంగా కొనసాగుతుందని నేను భావిస్తున్నాను. ప్రస్తుత అమెరికా పరిపాలన ముగిసేనాటికి రెండు దేశాల మధ్య బంధం మునుపెన్నడూ లేనంత బలంగా ఉంటుందని నమ్ముతున్నాను’ అని రుబియో అన్నారు.
తాజ్‌మహల్.. ఫిదా అయిన రుబియో జంట
మార్కో రుబియో తాజ్‌మహల్ అందానికి ఫిదా అయ్యారు. భారత్ పర్యటనలో భాగంగా ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఆయనతోపాటు భార్య జెనెట్ రుబియో, భారత్‌లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ కూడా తాజ్‌మహల్‌ను సందర్శించారు. తాజ్ మహల్ వద్ద దాదాపు గంటన్నరపాటు గడిపిన రుబియో దంపతులు సందర్శకుల పుస్తకంలో ప్రత్యేక సందేశం రాశారు. ’ప్రపంచంలోనే గొప్ప సంపదను సందర్శించేందుకు మాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు’ అంటూ పేర్కొన్నారు. మార్కో రుబియో నాలుగు రోజులపాటు భారత్‌లో పర్యటించేందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన కోల్‌కతా, న్యూదిల్లీ పర్యటనలు పూర్తి చేసి ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌తో కీలక చర్చలు జరిపారు. మంగళవారం జరగబోయే క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొంటారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



