తెలంగాణ ఎట్లుండాల్నో చెప్పడానికి అమిత్ షా ఎవరు?!

telanganardhamడి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికీ, పసుపు బోర్డ్ ప్రకటించడానికీ ఆదివారం నాడు నిజామాబాద్ వచ్చిన   కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా బహిరంగ సభలో నక్సలైట్ల గురించీ, తెలంగాణ గురించీ అనుచిత ప్రస్తావనలు చేశాడు. తెలంగాణ ప్రభుత్వానికీ, ప్రత్యేకించి రేవంత్ రెడ్డి పేరు చెప్పి మరీ ముఖ్యమంత్రికీ, హెచ్చరికలు చేశాడు. అటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడవచ్చునా,  చౌకబారు రాజకీయ హెచ్చరికలు చేయవచ్చునా అనే మామూలు ప్రశ్నల కాలం ఎప్పుడో పోయింది. ప్రభుత్వం అనేది దాన్ని నడిపే రాజకీయపార్టీకి అతీతంగా, అందరి పట్లా సమదృష్టితో, తటస్థంగా ఉండాలనే పాతకాలపు విలువలు ఇప్పుడు చాదస్తంగా కనబడే పరిస్థితి దాపురించింది. కనుక అమిత్ షా అనే వ్యక్తి కేంద్ర ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన హోమ్ మంత్రిత్వ శాఖ అధిపతిగా, కేంద్ర-రాష్ట్ర సంబంధాల గురించి రాజ్యాంగ బద్ధమైన అవగాహన ఉన్న వ్యక్తిగా కాక, సహజంగా ఒక ఫక్తు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తగా మాట్లాడాడని అనుకోవాలి. సంఘీగా మాట్లాడడమంటే అబద్ధాలు, ఆరోపణలు, హెచ్చరికలు, దౌర్జన్య చిహ్నాలు ఉండడం సహజమే.

“నరేంద్ర మోదీ  నాలుగు దశాబ్దాలుగా ఈ దేశంలో అభివృద్ధికి ఆటంకంగా ఉన్న నక్సలైట్లను తుదముట్టించే కార్యక్రమం తీసుకున్నారు. నక్సలైట్లు నలబై వేల మంది ఆదివాసుల ప్రాణాలు తీశారు. నా ఆదివాసీ సోదరులెందరో కాళ్లు విరగగొట్టబడి, వేళ్లు నరకబడి ఉన్నారు. నిజామాబాద్ ప్రజలారా చెప్పండి, నక్సలిజాన్ని అంతం చేయాలా లేదా? అంతం చేయాలా లేదా? తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు వాళ్లతో చర్చలు జరపమని అంటున్నాడు. ఎవరితో చర్చలు జరపాలి? ఎవరు సరెండర్ అవుతారో కానివ్వండి. నేనీ వేదిక మీది నుంచి చెపుతున్నాను. అందరికందరూ ఆయుధాలు వదిలేయండి. సరెండర్ కండి. ఎవరు సరెండర్ కారో వాళ్లను, మేం నిర్ణయం చేసుకున్నాం, 2026 మార్చ్ 31 లోపల ఈ దేశం నుంచి నక్సలిజాన్ని సమాప్తం చేస్తాం. నిజామాబాద్ ప్రజలారా చెప్పండి, ఎవరైతే ఆదివాసులను చంపారో, ఎవరైతే పోలీసు, భద్రతా అధికారులను చంపారో ఆ నక్సలిజాన్ని అంతం చేయాలా వద్దా? కాంగ్రెస్ పార్టీ వాళ్లతో చర్చలు జరపమని అంటున్నది. కాని మా ప్రభుత్వ విధానం ఎవరి చేతుల్లో ఆయుధాలున్నాయో, వారితో ఎటువంటి చర్చలూ జరపబోం. ఆయుధాలు కింద పడేయండి, సరెండర్ కండి. ప్రధాన స్రవంతిలో కలిసిపోండి. ఈశాన్య భారతంలో పదివేల మంది ఆయుధాలు వదిలి ప్రధాన స్రవంతిలోకి వచ్చారు.

తెలంగాణ జనజీవనంలో ఆధిపత్యాన్ని ధిక్కరించే స్వభావం వెయ్యి సంవత్సరాలకు పైగా ఉన్నది. అది అప్పుడప్పుడు నివురు గప్పవచ్చు గాని, ఆ నిరంతర జ్వాల రగులుతూనే ఉన్నదని తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలో వందలాది కవులు,  కళాకారులు, మేధావులు ఆ ఉజ్వల చరిత్రను సగర్వంగా తలచుకున్నారు. ఆ ధిక్కార స్వభావపు ఒక వ్యక్తీకరణగా తెలంగాణలోకి తొంబై సంవత్సరాల కింద కమ్యూనిస్టులు ప్రవేశించారు. అప్పటికే భూస్వామ్య దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా వ్యక్తిగతంగా,  చిన్నస్థాయిలో సామూహికంగా పోరాడుతున్న రైతాంగానికి ఆ కమ్యూనిస్టులు నాయకత్వం వహించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం (1946-51) నడిపారు. ఆ పోరాటం విరమణకు గురైనప్పటికీ, తెలంగాణ ప్రజలు ఆ నిప్పురవ్వలను తమ హృదయంలో దాచుకున్నారు. రెండు దశాబ్దాలు తిరగకుండానే ఆ నిప్పురవ్వలకు మళ్లీ తెలంగాణ ప్రజలే తమ పోరాటాలతో ఊపిరులూదారు.

తాలూకా ఎన్నికల్లో పాల్గొన్నారు, జిల్లా ఎన్నికల్లో పాల్గొన్నారు. శాసన సభ్యులయ్యారు. ఏడాదిన్నరలో రెండు వేల కన్నా ఎక్కువ మంది నక్సలైట్లు కూడా సరెండర్ అయ్యారు. కాని ఆయుధాలు పట్టుకున్నవారితో ఎటువంటి చర్చలు జరపబోం. నేనివాళ తెలంగాణ గడ్డ మీది నుంచి ఈ మాట చెప్పదలచుకున్నాను. నక్సలిజాన్ని రక్షించడానికి మాట్లాడుతున్నవాళ్లు తెలంగాణలో ఏ ఆదివాసుల ప్రాణాలు పోయాయో, ఏ పోలీసుల ప్రాణాలు పోయాయో, ఏ భద్రతా సిబ్బంది ప్రాణాలు పోయాయో వారికి ఏం జవాబు చెపుతారు? ఇన్ని సంవత్సరాలుగా ఆదివాసీ ప్రాంతాల్లో మీరు అభివృద్ధికి ఆటంకంగా నిలిచారు. దీనికి ఏం జవాబు చెపుతారు? ఈ కాంగ్రెస్ పార్టీ, నాకు అనుమానంగా ఉంది, దేశం అంతటి నుంచీ పారిపోయి వచ్చే నక్సలైట్లకు తెలంగాణలో ఆశ్రయం ఇచ్చేట్టుంది. అయితే మీరేమీ చింతించకండి, కేంద్రంలో నరేంద్ర మోదీ  ప్రభుత్వం ఉంది. నరేంద్ర మోదీ. మేం 2026 మార్చ్ 31 వరకు దేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తాం…. తెలంగాణలో ఇవాళ కూడా నక్సలైట్లను రక్షించే మాటలు వినబడుతున్నాయి…. రేవంత్ రెడ్డీ, ఒక మాట చెప్పి పోతున్నాను. మన తెలంగాణాను నక్సలైట్ల అడ్డాగా మార్చవద్దు.”

ఇదీ అమిత్ షా ఉపన్యాసంలో నక్సలైట్ల గురించిన భాగం. దీనితో పాటు తెలంగాణలో అవినీతి గురించి కూడా ఆయన ప్రస్తావించాడు. టిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి చూసి ప్రజలు గద్దె దించితే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరింతగా, టి ఆర్ ఎస్ కే బాప్ లాగా ప్రవర్తిస్తున్నదన్నాడు. తెలంగాణ కు టిఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు. నరేంద్ర మోదీ  భాజపా ప్రభుత్వం మాత్రమే, మోదీ  డబుల్ ఇంజన్ సర్కార్ మాత్రమే మేలు చేయగలదన్నాడు. ఆదివాసులు, దళితులు, వెనుకబడిన కులాలు, మహిళలు వంటి మసాలా కూడా కలిపాడు.

అమిత్ షా బెదిరింపు ముఖ కవళికలు, దౌర్జన్యపూరిత హావభావాలు అందరికీ తెలిసినవే. అమిత్ షా నుంచి అంతకన్నా ఎక్కువ అవగాహనను, మర్యాదను, రాజ్యాంగ విలువలను ఆశించడం కూడా అసాధ్యమే గాని, ఆ మాటలలో ప్రతి వాక్యమూ పచ్చి అబద్ధం, రాజ్యాంగబద్ధంగా నిర్వహించవలసిన కేంద్ర రాష్ట్ర సంబంధాలకు అవమానం, ఒక రాష్ట్ర ప్రభుత్వంలో, పాలనలో, విధివిధానాలలో కేంద్ర ప్రభుత్వం చేసుకుంటున్న అనవసర, అర్ధరహిత, దౌర్జన్యపూరిత జోక్యం. తెలంగాణ పాలన ఎలా ఉండాలో తేల్చుకోవలసింది తెలంగాణ ప్రజలు. అది ఎలా ఉందో, ఎలా ఉండాలో చెప్పే అధికారం, అర్హత అమిత్ షా కు లేవు. మిగిలిన విషయాలు అలా ఉంచి, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు చర్చల గురించి చేసిన డిమాండ్ ను విమర్శించడం, తెలంగాణ ముఖ్యమంత్రిని సంబోధించి ‘నక్సలైట్ల అడ్డాగా మార్చకు’ అని హెచ్చరించడం అత్యంత ప్రమాదకరమైన దుందుడుకు వైఖరి. అది తెలంగాణ పాలకుల ఆత్మగౌరవానికి అవమానం. అది తెలంగాణ ప్రజల చరిత్రకు, ధిక్కార స్వభావానికి, మనోభావాలకు అవమానం.

ఇప్పుడు అమిత్ షా చర్చలు లేవు అని కుండబద్దలు కొట్టడం మాత్రమే కాదు, రేవంత్ రెడ్డిని, తెలంగాణాను పేరు పెట్టి అవమానకరంగా,  రాజ్యాంగ వ్యతిరేకంగా, అమర్యాదగా బెదిరించాడు గనుక ఇప్పుడు బంతి రాష్ట్ర ప్రభుత్వం చేతిలోకి వచ్చింది. తాను కేంద్ర ప్రభుత్వంలా రాజ్యాంగాన్ని, అధికరణం 21ని తుంగలో తొక్కుతూ విప్లవకారులను చంపబోనని ప్రకటించవలసినా బాధ్యత రాష్ట్రప్రభుత్వం మీద ఉంది. వారిని శాంతి భద్రతల సమస్యగా గుర్తించడం లేదనే ఆలోచనను ఆచరణలో పెట్టవలసి ఉంది. తమ అధినాయకుడు రాహుల్ గాంధీ పదే పదే చెపుతున్నట్టు తాము భాజపా లాగా నఫ్రత్ (ద్వేషం) వైపు లేమని, తాము ప్రజల వైపు, మొహబ్బత్ (ప్రేమ) వైపు ఉన్నామని ఆచరణలో చూపుకునే అవకాశం ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ‘నక్సలైట్ల అడ్డాగా మార్చకు’ అని బట్ట కాల్చి మీద వేస్తున్న కేంద్ర హోమ్ మంత్రికి దీటుగా జవాబు చెప్పవలసినా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది.

తెలంగాణ జనజీవనంలో ఆధిపత్యాన్ని ధిక్కరించే స్వభావం వెయ్యి సంవత్సరాలకు పైగా ఉన్నది. అది అప్పుడప్పుడు నివురు గప్పవచ్చు గాని, ఆ నిరంతర జ్వాల రగులుతూనే ఉన్నదని తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలో వందలాది కవులు, కళాకారులు, మేధావులు ఆ ఉజ్వల చరిత్రను సగర్వంగా తలచుకున్నారు. ఆ ధిక్కార స్వభావపు ఒక వ్యక్తీకరణగా తెలంగాణలోకి తొంబై సంవత్సరాల కింద కమ్యూనిస్టులు ప్రవేశించారు. అప్పటికే భూస్వామ్య దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా వ్యక్తిగతంగా, చిన్నస్థాయిలో సామూహికంగా పోరాడుతున్న రైతాంగానికి ఆ కమ్యూనిస్టులు నాయకత్వం వహించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం (1946-51) నడిపారు. ఆ పోరాటం విరమణకు గురైనప్పటికీ, తెలంగాణ ప్రజలు ఆ నిప్పురవ్వలను తమ హృదయంలో దాచుకున్నారు. రెండు దశాబ్దాలు తిరగకుండానే ఆ నిప్పురవ్వలకు మళ్లీ తెలంగాణ ప్రజలే తమ పోరాటాలతో ఊపిరులూదారు. గడిచిన ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలే ఆ పోరాటాన్ని సజీవంగా కొనసాగిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ ప్రజా హృదయంలో విప్లవ భావజాలానిదీ, విప్లవ ఆచరణదీ సుస్థిరమైన స్థానం. దాన్ని అంతం చేయగలనని, చేశానని అనుకున్న, ప్రగల్భాలు పలికిన అమిత్ షా వంటి వాళ్లు ఎందరో ఉన్నారు గాని వారందరూ చరిత్ర కాలగర్భంలో కలిసిపోయారు.

నిజంగానే 1975-77 ఎమర్జెన్సీ కాలంలో, 1985-89 ఆట మాట పాట బంద్ కాలంలో, 1992 నిషేధం అనంతరం, 2005 నిషేధం అనంతరం విప్లవోద్యమం అంతమైపోయినట్టు, ఆ జ్వాల కొడిగట్టినట్టు చాలామంది రాజకీయ నాయకులు, పత్రికల మేధావులు భావించారు, డెత్ సర్టిఫికెట్లు రాసేశారు. కాని అంతమైందన్న ప్రతిసారీ తెలంగాణలో విప్లవోద్యమం మళ్లీ చిగురించి లేచి నిలిచింది. తెలంగాణ ప్రజా జీవితం నుంచి విప్లవ భావజాలాన్ని చెరిపివేయగల శక్తి భూమి మీద లేదని అనేకసార్లు రుజువయింది. విప్లవోద్యమం మీద పెద్ద ఎత్తున అణచివేతను అమలు చేసిన పాలకవర్గ ముఠాలే మళ్లీ మళ్లీ విప్లవోద్యమ ప్రభావం గురించి, అవసరం గురించి మాట్లాడడమే ఆ సత్యానికి ఒక నిదర్శనం.

ఇవాళ్టి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి మూడు వేరు వేరు సందర్భాలలో అన్న మాటలే చూద్దాం: ఆయన రాష్ట్రంలో ప్రతిపక్ష తెలుగుదేశం శాసనసభాపక్ష నాయకుడిగా ఉన్నరోజులలో 2016 ఫిబ్రవరి 15న ఇదే నిజామాబాద్ లో ఒక బహిరంగసభలో మాట్లాడుతూ, “నక్సలిజం, తీవ్రవాదం వల్ల అభివృద్ధి కుంటుపడ్తదేమో అనుకున్నాం అయాల. కాని ఇయాల వాళ్లు ఉంటే బాగుండనుకునే పరిస్థితి వచ్చింది రాష్ట్రంల. ఆవేదన తోటి నేనీ మాట చెప్తున్నా” అన్నారు.

ఆయనే కాంగ్రెస్ నాయకుడుగా మారిన తర్వాత, 2021 అక్టోబర్ 24న, కరీంనగర్ లో ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, “తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే నక్సలిజంను నిర్మూలించాలని ఒకప్పుడు అనుకునేవాళ్లం. కాని ఇప్పుడు ఏమనిపిస్తున్నదంటే, రాష్ట్రంలో ఇప్పుడు వాళ్లు ఉనికిలో ఉంటే, రాష్ట్రాన్ని విఫలం చేసిన రాజకీయ వ్యవస్థలో కనీసం పాలకులలో బెదురు, భయం అయినా ఉండేవేమో. ప్రభుత్వ అత్యాచారాలు తగ్గి ఉండేవేమో” అన్నారు.

ఆయనే ముఖ్యమంత్రిగా మారిన తర్వాత 2025 ఏప్రిల్ 27న తనను కలిసిన ప్రతినిధివర్గంతో “నక్సలైట్లను మేము ఎప్పుడూ శాంతి భద్రతల సమస్య అనుకోవడం లేదు. అది సామాజికార్థిక సమస్య” అన్నారు. ఆపరేషన్ కగార్ పేరిట జరుగుతున్న మారణకాండను ఖండించారు. సమస్య పరిష్కారం చర్చలతోనే ఉందని సూత్రబద్ధంగా అంగీకరించారు.

ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆపరేషన్ కగార్ ను వ్యతిరేకించడం కూడా ఈ వైఖరిలో భాగమే. అలా అధికార పార్టీ మాత్రమే కాదు, వరంగల్ బహిరంగ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు కె. చంద్రశేఖర రావు ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా, చర్చలను కోరుతూ చేసిన ప్రసంగం కూడా ఆ వైఖరిలో భాగమే. ఇవాళ రాష్ట్రంలో సిపిఐ, సిపిఐ-ఎంతో సహా పది వామపక్ష పార్టీలు, అనేక ప్రజా సంఘాలు ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా, చర్చలకు సానుకూలంగా ఆందోళ జరుపుతుండడం ఆ వైఖరిలో భాగమే.

ఆ వైఖరి ఏదో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ప్రత్యర్థులైనందువల్ల ఆ రాజకీయ పక్షాలు ప్రకటిస్తున్న వైఖరి కాదు. అది రాజకీయ వైఖరి కన్నా ఎక్కువగా మానవీయమైన వైఖరి. రాజ్యాంగబద్ధమైన వైఖరి. రాజ్యాంగం హామీ ఇచ్చిన జీవించే స్వేచ్ఛకు వ్యతిరేకంగా, తేదీలు నిర్ణయించి మరీ చంపుతాం, ఏరివేస్తాం, నిర్మూలిస్తాం అని వీథి రౌడీల భాషలో వెలువడుతున్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనలు అమానుషమైనవనీ, అటువంటి మారణకాండ ఈ దేశంలో, ఈ రాజ్యాంగం కింద, నాగరికతా ప్రమాణాల ప్రకారం చెల్లదనీ అన్ని ప్రతిపక్షాలూ ప్రకటిస్తున్నాయి.

“ఇప్పుడు అన్నలు ఉంటే బాగుండు” అని ఈ రాష్ట్రంలో ప్రతి చిన్నా పెద్దా సమస్యల సందర్భంలో ప్రజలు అనుకుంటున్నారు గనుకనే, అటువంటి ప్రజా ఆకాంక్షను ప్రచార సాధనాలు కూడా ప్రకటిస్తున్నాయి గనుకనే, వారికి ప్రజా హృదయంలో అటువంటి చెరపరాని స్థానం ఉన్నది గనుకనే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా విప్లవకారులతో ఎన్ని సైద్ధాంతిక, రాజకీయ, ఆచరణాత్మక విభేదాలు ఉన్నప్పటికీ, వారిని చంపగూడదనీ, వారితో చర్చలు జరపాలనీ కోరుతున్నాయి.

ఇప్పుడు అమిత్ షా చర్చలు లేవు అని కుండబద్దలు కొట్టడం మాత్రమే కాదు, రేవంత్ రెడ్డిని, తెలంగాణాను పేరు పెట్టి అవమానకరంగా,  రాజ్యాంగ వ్యతిరేకంగా, అమర్యాదగా బెదిరించాడు గనుక ఇప్పుడు బంతి రాష్ట్ర ప్రభుత్వం చేతిలోకి వచ్చింది. తాను కేంద్ర ప్రభుత్వంలా రాజ్యాంగాన్ని, అధికరణం 21ని తుంగలో తొక్కుతూ విప్లవకారులను చంపబోనని ప్రకటించవలసినా బాధ్యత రాష్ట్రప్రభుత్వం మీద ఉంది. వారిని శాంతి భద్రతల సమస్యగా గుర్తించడం లేదనే ఆలోచనను ఆచరణలో పెట్టవలసి ఉంది. తమ అధినాయకుడు రాహుల్ గాంధీ పదే పదే చెపుతున్నట్టు తాము భాజపా లాగా నఫ్రత్ (ద్వేషం) వైపు లేమని, తాము ప్రజల వైపు, మొహబ్బత్ (ప్రేమ) వైపు ఉన్నామని ఆచరణలో చూపుకునే అవకాశం ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది.

‘నక్సలైట్ల అడ్డాగా మార్చకు’ అని బట్ట కాల్చి మీద వేస్తున్న కేంద్ర హోమ్ మంత్రికి దీటుగా జవాబు చెప్పవలసినా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. “మీ వైపు నుంచి హింస లేకపోతే, మా వైపు నుంచి హింస ఉండదు” అనే సాధారణ సామరస్య పూర్వక ప్రకటన చేయడం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. దాన్ని కాల్పుల విరమణ ప్రకటన అంటారు. ఇప్పటికే మావోయిస్టులు అటువంటి ప్రకటన, కాల్పుల విరమణ ప్రకటన ఒకటికి రెండు సార్లు చేశారు గనుక, రాష్ట్ర ప్రభుత్వం కూడా తనవైపు నుంచి అటువంటి ప్రకటన చేయడం, నిజామాబాద్ లో అమిత్ షా చేసిన అవమానానికి, బెదిరింపుకు, హెచ్చరికకు నిజమైన జవాబు అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఏమి చేయాలో, ఎట్లా ఉండాలో చెప్పే అర్హత అమిత్ షా కు లేదని తెలంగాణ నిర్ద్వంద్వంగా ప్రకటించవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page