ఒక సమాజం నిరుపేద కార్మికుల భద్రతపై శ్రద్ధ పెట్టనంతవరకు దాన్ని మూడో స్థాయికి చెందినదిగా పరిగణించాలి.
తోడికోడళ్లు సినిమాలో ఒక పాటను మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం.
“కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడి దానా
బుగ్గమీద గులాబిరంగు ఎలా వచ్చెనో చెప్పగలవా?
నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే
వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో…”
దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తున్న అసంఘటిత రంగానికి చెందిన ఈ కార్మికులకు చెందిన ఈ పాటను దేశాభివృద్ధికి తామే కారణమని చెప్పుకునే హీరోలు ఎవరూ పాడరు. చాలీచాలని వేతనాలు, ఉద్యోగ మరియు సామాజిక భద్రత లేకపోవడం, సురక్షితం కాని పని ప్రదేశాల్లో ఈ అసంఘటిత కార్మికులు పనిచేస్తూ బతుకులు వెళ్లదీస్తుంటారు. ఈ పాటను వింటున్నప్పుడు ఇది వామపక్షభావజాలంతో కూడినదని అర్థం చేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ పెట్టుబడిదారీ ప్రపంచంలో పరిశ్రమల్లో పనిచేసే శ్రామికులు ఎంతగా దోపిడీకి గురవుతున్నదీ ఈ పాట స్పష్టంగా తెలియచెబుతోంది. అంతేకాదు ఒకరి దోపిడీ మరొకరి లాభానికి కారణమవుతోందని ఈ పాట స్పష్టంగా వివరిస్తుంది. ఈరకమైన దోపిడీ కారణంగా అధికార సమతుల్యత దెబ్బతింటోంది. ముఖ్యంగా నిరుపేద కార్మికులను పీడిస్తూ తద్వారా ధనికులు ప్రయోజనం పొందుతున్నారు. ఈవిధంగా శ్రామికవర్గ దోపిడీని కళ్లకుకట్టినట్టు తెలియజెప్పడం ద్వారా కార్మిక వర్గానికి సంఘీభావ నిర్మాణానికి ఈ పాట దోహదం చేసింది.
ఇటువంటి శ్రామికవర్గ దోపిడీకి పాశమైలారంలోని సిగాచి రసాయన కర్మాగారంలో జరిగిన పేలుడు ఒక విస్పష్ట ఉదాహరణ. ఈ దుర్ఘటనలో 60 మందికి పైగా మరణించగా చాలా మంది గాయాలపాలయ్యారు. ఇప్పటికే కార్పొరేట్ సంస్థలు సుదీర్ఘ పనిగంటలు కావాలంటూ అమల్లో ఉన్న శ్రామిక చట్టాల్లో మార్పులు తీసుకురావాలని కోరుతున్న తరుణంలో, ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత దురదృష్టకర సంఘటన ఇది. కార్పొరేట్ సంస్థల్లోని పనిప్రదేశాల్లో ఏవిధమైన భద్రతా ప్రమాణాలు లేవనడానికి ఇదొక దృష్టాంతం. ముఖ్యంగా రసాయన, ఔషధ పరిశ్రమల్లో ఇటువంటి భయంకరమైన ప్రమాదాలు జరుగుతుండటం గమనార్హం. ఈ సంఘటనలు కేవలం యాదృచ్ఛికంగా జరిగినవి కావు. పనిప్రదేశాల్లో పని నిబంధనల పాటింపులో క్రమంగా చోటుచేసుకుంటున్న నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం.
పాశమైలారం దుర్ఘటనను పరిశీలిస్తే అక్కడ పని ప్రదేశంలో చేపట్టాల్సిన రక్షణ చర్యలపట్ల పూర్తి నిర్లక్ష్యం కనిపిస్తుంది. కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికులకు భద్రత విషయంలో అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి ఈ సంఘటన నిదర్శనం. ఇప్పటికీ పారిశ్రామికరంగంలో కార్మికులకు మరింత భద్రత, గౌరవం, జవాబుదారీతనం కోసం నిరంతరం పోరాటాలు ఇంకా కొనసాగుతున్నా పెద్దగా ఫలితముండటంలేదు.పనిప్రదేశాల్లో అసంఘటితరంగ కార్మికులు ఎదుర్కొంటున్న నిర్లక్ష్యానికి ఈ సంఘటన ఒక దృష్టాంతంగా మిగిలిపోతుంది. ముఖ్యంగా సంఘటనలో గాయపడిన కార్మికులు, మరణించిన వారి కుటుంబాలు, ఈ దుర్ఘటనల ఫలితాలను తామే మౌనంగా , భారంగా అనుభవించాల్సి వస్తున్నది. నిజం చెప్పాలంటే భారత్ లోని వివిధ కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు ఎదుర్కొంటున్న వేర్వేరు రకాల సమస్యలకు పాశమైలారం ఒక ఉదాహరణ.
ఇటువంటి శ్రామికవర్గ దోపిడీకి పాశమైలారంలోని సిగాచి రసాయన కర్మాగారంలో జరిగిన పేలుడు ఒక విస్పష్ట ఉదాహరణ. ఈ దుర్ఘటనలో 60 మందికి పైగా మరణించగా చాలా మంది గాయాలపాలయ్యారు. ఇప్పటికే కార్పొరేట్ సంస్థలు సుదీర్ఘ పనిగంటలు కావాలంటూ అమల్లో ఉన్న శ్రామిక చట్టాల్లో మార్పులు తీసుకురావాలని కోరుతున్న తరుణంలో, ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత దురదృష్టకర సంఘటన ఇది. కార్పొరేట్ సంస్థల్లోని పనిప్రదేశాల్లో ఏవిధమైన భద్రతా ప్రమాణాలు లేవనడానికి ఇదొక దృష్టాంతం. ముఖ్యంగా రసాయన, ఔషధ పరిశ్రమల్లో ఇటువంటి భయంకరమైన ప్రమాదాలు జరుగుతుండటం గమనార్హం. ఈ సంఘటనలు కేవలం యాదృచ్ఛికంగా జరిగినవి కావు. పనిప్రదేశాల్లో పని నిబంధనల పాటింపులో క్రమంగా చోటుచేసుకుంటున్న నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం.
నేడు సాంకేతికంగా ప్రతిరంగం ఎంతో పురోభివృద్ధి సాధించింది. ముఖ్యంగా ఉత్పత్తులను ఇబ్బడిముబ్బడిగా పెంచడంలో ఈ సాంకేతిక పరిజ్ఞానం అద్భుతమైన పాత్రను పోషిస్తోంది. మరి సాధించిన ఈ సాంకేతిక ప్రగతిపై ప్రైవేటు పరిశ్రమలు చాలా తక్కువ పెట్టుబడులు పెట్టడం లాభాపేక్ష పట్ల వాటికున్న మక్కువను తెలియజేస్తోంది. పర్యవేక్షణ కొరవడటం, భద్రతా ప్రమాణాలను తీవ్రంగా నిర్లక్ష్యం చేయడం, కర్మాగారాల తనిఖీలు సక్రమంగా జరపకపోవడం, పేదరికం నేపథ్యం నుంచి వచ్చిన వారిని ఎటువంటి శిక్షణ లేకుండా పనుల్లో పెట్టుకోవడం వంటివి పారిశ్రామిక ప్రమాదాలకు ప్రధాన కారణాలు. ముఖ్యంగా ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ఈజ్ డూయింగ్ బిజినెస్‌పట్ల వైముఖ్యత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపద సృష్టి పేరుతో చేస్తున్న ఆకర్షణీయమైన ప్రచారం, లైసెన్స్‌ల జారీ, పనిప్రదేశాల్లో తనిఖీలపై పెద్దగా దృష్టిపెట్టకపోవడం, పనిగంటల పెంపు వంటివాటి ద్వారా వ్యాపారాభివృద్ధికి కృషిచేస్తూ క్రమంగా శ్రామిక చట్టాలను బలహీనపరుస్తూ రావడం వర్తమాన చరిత్ర. ఈజ్ డూయింగ్ బిజినెస్ పేరుతో తీసుకుంటున్న వివిధ చర్యల నేపథ్యంలో కార్మికుల హక్కులు, భద్రత అంశాలు క్రమంగా పక్కకు పోతున్నాయి. పర్యవేక్షక వ్యవస్థ క్రమంగా బలహీనపడింది.
కొత్తగా అమల్లోకి వచ్చిన వృత్తిపరమైన భద్రతకు సంబంధించిన చట్టాల నేపథ్యంలో సూపర్‌వైజర్లు ఎంతోకాలం ఆకస్మిక తనిఖీలు జరిపే అవకాశం లేకుండా పోతున్నది. అంతేకాదు తక్షణం చట్టపరమైన చర్యలు కూడా తీసుకోలేని పరిస్థితి. కంపెనీలు స్వీయ ధ్రువీకరణ పత్రాల సమర్పణ, ప్రైవేటు ఆడిట్‌లకు అవకాశం కల్పించడం కూడా తక్షణ చర్యలకు ఉపక్రమించడానికి అడ్డుగా ఉన్నాయి. ప్రస్తుత పాశమైలారం కేసులో ప్రభుత్వం ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి జవాబుదారీతనాన్ని, బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతుండవచ్చు. కానీ ఇటువంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రభుత్వం మౌనం వహించడం, శిక్షలు విధించకుండా ఉండటం ద్వారా తన బాధ్యత అయిపోయిందని భావించవచ్చు.
కానీ ఇక్కడ శాసన ప్రక్రియ, అమలు, మధ్య నెలకొన్న వ్యత్యాసం వల్ల కార్మికులు దోపిడీకి గురయ్యే అవకాశాలే ఎక్కువ. ఫలితంగా భవిష్యత్తులో కూడా కర్మాగారాల్లో ఇదేవిధమైన నిర్లక్ష్య వైఖరి కొనసాగే ప్రమాదం వుంది. విచారణలు, నష్టపరిహారం వంటి అంశాలకే ప్రభుత్వం పరిమితమై, శ్రామికుల భద్రతను గాలికొదిలేస్తోంది. ఇటువంటి నిర్లక్ష్యంతో కూడిన ప్రతి సంఘటన ఫలితం కార్మికుడి సంక్షేమాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నది. అంతేకాదు అధికారంలో ఉన్న ప్రభుత్వ ప్రతిష్టను ఈ సంఘటనలు మసకబారుస్తాయి. పాశమైలారం సంఘటనపై పైన పేర్కొన్న తెలుగు పాటనే మరోవిధంగా పాడుకోవచ్చు. “కాన్వాయ్‌లో ఇన్ స్పెక్షన్‌కు వెళ్లిన సి.ఎం.గారూ, ఆ ఘోర ప్రమాదం ఎందుకు జరిగిందో చెప్పగలరా/ ఎవరి బాధ్యతో చెప్పగలరా? “
-శామ్ సుందర్