వైట్ హౌస్ ‘రెడ్ షిఫ్ట్’ ..?

“‘ఇస్లామిస్ట్’ భౌగోళిక రాజకీయాలను గుర్తించిన త‌ర్వాత కొంద‌రు దాన్ని పెద్ద ముప్పుగా భావించ‌డం మొద‌లుపెట్టారు. కానీ ఇప్పుడు వైట్ హౌస్‌లోని మితవాదులు, అంతర్గత రాజకీయాల్లో ఆరోపిస్తున్న ‘రెడ్ షిఫ్ట్’ (కమ్యూనిస్టుల వైపు మొగ్గు) పైనే దృష్టి కేంద్రీక‌రించారు. అస‌లు ఈ వైఖ‌రికి కారణమేంటి?”

అమెరికా అధ్యక్షుడి ప్రకటనలను సీరియస్‌గా తీసుకున్న‌ట్ల‌యితే, డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అమెరికా ఒక ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపు తిరుగుతోంద‌న్న సంగ‌తి పెద్ద‌గా చ‌ర్చ‌కు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అమెరికా 250వ ఆవిర్భావ‌ వేడుకల్లో భాగంగా చేసిన ప్రసంగంలో, ట్రంప్ దేశంలోని “కమ్యూనిస్టుల”పై విమర్శలు చేశారు. మెక్‌కార్తీయిస్ట్ యుగంలో’మన ప‌క్క‌లో కమ్యూనిస్టులు ఉన్నారు ‘ అంటూ నిరంత‌రం వ్య‌క్త‌మ‌య్యే ఆందోళ‌న లీల‌గాత‌న మాటల్లో వ్య‌క్త‌మైన‌ప్ప‌టికీ ఆయన విదేశాల్లో ఆ భావజాలం గల ఏ ‘దుష్ట సామ్రాజ్యం’పైనా విరుచుకుపడలేదు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుండి 35 ఏళ్ల క్రితం ప్రచ్ఛన్న యుద్ధం ముగిసే వరకు, ప్రపంచ కమ్యూనిజంతో పోరాడటం అమెరికాకు ఒక ప్ర‌ధాన‌ లక్ష్యంగా ఉండేది.
‘ఇస్లామిస్ట్’ భౌగోళిక రాజకీయాలను గుర్తించిన త‌ర్వాత కొంద‌రు దాన్ని పెద్ద ముప్పుగా భావించ‌డం మొద‌లుపెట్టారు. కానీ ఇప్పుడు వైట్ హౌస్‌లోని మితవాదులు, అంతర్గత రాజకీయాల్లో ఆరోపిస్తున్న ‘రెడ్ షిఫ్ట్’ (కమ్యూనిస్టుల వైపు మొగ్గు) పైనే దృష్టి కేంద్రీక‌రించారు. అస‌లు ఈ వైఖ‌రికి కారణమేంటి? ఆరోగ్య బీమా కవరేజీ మరియు గృహోపకరణాలపై సబ్సిడీల వంటి డెమోక్రాట్ల సాధారణ సంక్షేమ చర్యలను రిపబ్లికన్ పార్టీ నాయకులు ‘కమ్యూనిస్ట్’ అని ముద్ర వేశారు.
అయితే, ఒక సరైన రెడ్ టెస్ట్, ఒక కొత్త విధానం ఆస్తులను ప్రైవేటుగా కలిగి ఉండే హక్కును ఉల్లంఘిస్తుందా అని ప్రశ్నిస్తుంది. ‘ప్రతి ఒక్కరి సామర్థ్యం మేరకు, ప్రతి ఒక్కరి అవసరాల మేరకు’ అనే స్ఫూర్తితో అస్పష్టంగా ప్రేరణ పొందినట్లు కనిపించే విధానం పెట్టుబడిదారీ విధానానికి హాని కలిగించదు. దానికి విరుద్ధంగా, మంచి సంక్షేమ నిబంధనలు దాన్ని బలోపేతం చేయగలవు.
-ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *