“2023లో రేవంత్ రెడ్డి సీఎం కాగానే రెండు సంవత్సరాల క్రితం చంద్రబాబు తెలంగాణకు అధికారికంగా పిలిచారు. జూలై 6, 2024న హైదరాబాద్‌లోని ప్రజా భవన్ వేదికగా చారిత్రాత్మక కుట్ర పూరిత సమావేశాన్ని నిర్వహించారు. ఆ భేటీ విభజన చట్టంలోని హామీలపై చర్చ అని చెప్పినప్పటికీ తెలంగాణపై మళ్లీ పట్టు సాధించి తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలను కొళ్లగొట్టే కుట్రకు వేదికైంది..”
2023 డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యాలు, ప్రజల ప్రయోజనాలే మారిపోయాయి. పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలోకి ఉన్నన్నీ రోజులు గొతికాడి నక్కలాగా కూచుకుకూర్చున్న దోపిడిదారులు 2023 తర్వాత తెలంగాణపై రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక దండయాత్రకు దిగారు.
2014 నుంచి 2023 వరకూ దాదాపు దశాబ్దకాలం తెలంగాణ వాళ్లలో కలిసి ప్రాంతేతరులు తెలంగాణాభివృద్దిలో భాగస్వామ్యమయ్యారు.తెలంగాణపై ఆధిపత్యం, ప్రజలపై పెత్తానం చెలయించకుండా ఇక్కడి ప్రజలతో కలిసి రాష్ట్రాభివృద్దిలో భాగస్వామ్యమయ్యారు. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారో అప్పటి నుంచి మళ్లీ ప్రాంతేతరులు తెలంగాణను దోచుకునేందుకు పంజా విసురుతున్నారు. సరే దోపిడీదారులు, తెలంగాణ సంపదను వాళ్లు దోచుకోవడం పక్కనబెట్టితే. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత మళ్లీ తెలంగాణపై ప్రాంతేతరులు దోపిడీకి దిగారు. ఆరు దశాబ్దాలు తెలంగాణను దోచుకుని పీల్చి పిప్పి చేసి, తెలంగాణ సహజ వనరులను దోచుకుని బొందలగడ్డగా మార్చిన సమైక్యవాదులు రేవంత్ సీఎం అయ్యాకా మళ్లీ కోరలు చాస్తున్నారు.ఏ నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మ గౌవరం, ఆస్తిత్వం కోసం తెలంగాణ ప్రజలు పోరాటం చేసి, విద్యార్థి యువత ఆత్మ బలిదానాలకు చేసుకున్నారో ఇప్పుడు సమైక్యవాదులు నీళ్లు తరలించుకుపోతున్నారు. నిధులు దోచుకుంటున్నారు. సచివాలయంలో నియామకాలు కొల్లగొట్టుతున్నారు.
విభజన హామీల ముసుగులో తెలంగాణ రాజకీయాల్లో ప్రభుత్వంలో సీమాంధ్ర పార్టీలు జోక్యం చేసుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ అస్థిత్వం, ఆత్మ గౌరవాన్ని కించపర్చేవారి పంచన చేరింది.తెలంగాణ ప్రజలను వంచిస్తూ ప్రాంతేతరులతో కలిసి రెండున్నరేళ్లుగా ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక విధ్వంసం చేస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో సీమాంధ్ర పార్టీలు తెలంగాణ ప్రభుత్వంలో జోక్యం చేసుకోలేదు.తెలంగాణ అస్థిత్వం, ఆత్మగౌరవం, నీళ్లు నిధులు నియామకాల్లో జోక్యం చేసుకోలేదు. అప్పుడు కూడా సీమాంధ్ర పార్టీలు తెలంగాణలో రాజకీయాలు చేశాయి. ఎన్నికల్లో పోటీ చేశాయి. కానీ తెలంగాణ సెంటిమెంట్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాయి. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారో అప్పటి నుంచి తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవంపై దాడి చేయడం మొదలు పెట్టాయి. తెలంగాణ ప్రజలను, అమరుల త్యాగాలను కించపర్చుతూ ,తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేయడం దగ్గరి నుంచి ఏకంగా తెలంగాణ ఏర్పాటునే వ్యతిరేకంచే స్థాయికి చేశారు.
తెలంగాణ విధ్వంసానికి రెండేళ్ల క్రితమే ప్రజా భవన్ కేంద్రంగా పునాదులు పడ్డాయి.విభజన హామీల పేరుతో రేవంత్ రెడ్డి చంద్రబాబు కలిసి తెలంగాణ విధ్వంసకర రచనకు వేదికైంది.తెలంగాణ నుంచి తట్టబుట్ట సర్ధుకుని చంద్రబాబు తన రాష్ట్రానికి వెళ్లిపోయారు..ఏపీ అభివృద్ది అక్కడుండే చేయాలని అనుకున్నారు. కానీ తెలంగాణకు నష్టం చేయకుండా ఏపీ అభివృద్ది సాధ్యం కాదని చంద్రబాబు ఆలోచన .. అందుకే తెలంగాణలో ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు అప్పట్లో కుట్రలు చేశారు.ఏకంగా ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు.ఆ కుట్రలో భాగంగానే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వోటుకు నోటు కేసులో అడ్డంగా దొరికారు.వోటుకు నోటు కేసులో బ్రీఫ్ డీ మీ అన్న చంద్రబాబు తెలంగాణ నుంచి ఏపీకి పారిపోయారు.అప్పటి నుంచి మళ్లీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యే వరకూ తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టలేదు..ప్రభుత్వంలో జోక్యం చేసుకోలేదు.
2023లో రేవంత్ రెడ్డి సీఎం కాగానే రెండు సంవత్సరాల క్రితం చంద్రబాబు తెలంగాణకు అధికారికంగా పిలిచారు. జూలై 6, 2024న హైదరాబాద్‌లోని ప్రజా భవన్ వేదికగా చారిత్రాత్మక కుట్ర పూరిత సమావేశాన్ని నిర్వహించారు. ఆ భేటీ విభజన చట్టంలోని హామీలపై చర్చ అని చెప్పినప్పటికీ తెలంగాణపై మళ్లీ పట్టు సాధించి తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలను కొళ్లగొట్టే కుట్రకు వేదికైంది. రేవంత్ రెడ్డి అసమర్థత, కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని తనంతో బాబు కేంద్రంలో తన పలుకు బడిని ఉపయోగించుకుని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కృష్టా గోదావరి నదుల్లో తెలంగాణ నీటికి దోచుకుపోతున్నాడు. ప్రత్యేక్షంగా తెలంగాణ నిధులు దోచుకోకపోకున్న రేవంత్ రెడ్డిని ముందు పెట్టి రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తూ కంపెనీలు పెట్టుబడులు తరలించుకుపోతున్నారు..ఇక ఉద్యోగాలై తే ఏకంగా తెలంగాణ సచివాలయంలో ఏపీ ఉద్యోగులతో నింపేస్తూ తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారు.
మళ్లీ ప్రగతి భవన్ కాన్స్పిరసీ దగ్గరకు వద్దాం..దేశ రాజకీయ చరిత్రలో ‘హోటల్ కుట్ర’ (వైస్రాయ్ హోటల్) ఎలా అయితే నిలిచిపోయిందో. ప్రజాభవన్ కుట్ర కూడా చరిత్రలో నిలిచిపోతుంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత అపరిష్కృతంగా మిగిలిన సమస్యలను పరిష్కరించుకోడానికి, ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు పెంపొందించుకోవడానికి ఈ భేటీ జరిగిందనని రెండు ప్రభుత్వాలు ప్రకటన ఇచ్చాయి. కానీ అంతకు మించి తెలంగాణ విధ్వంసానికి, జల దోపిడికీ కుట్ర జరిగిందని సగటు తెలంగాణవాది అభిప్రాయపడుతున్నాడు.
ప్రజా భవన్ భేటీని ఏపీ సీఎం ఒక అవకాశంగా మార్చుకున్నారు..ఎప్పటి నుంచో తెలంగాణపై అక్కసుతో ఉన్న ముఖ్యమంత్రి తెలంగాణను ఎలాగైన దివాలా తీయాలన్న లక్ష్యంతో ప్రజాభవన్‌లో అడుగుపెట్టారు. ఎప్పుడైతే ప్రగతి భవన్‌లో ఏపీ సీఎం కాలుపెట్టారో తెలంగాణ పాలన అంతా తన కంట్రోల్‌లోకి వెళ్లింది.తెలంగాణలో రాజకీయంగా, ప్రభుత్వం పరంగా ఏ నిర్ణయం జరగాలన్న అమరావతి నుంచి ఆదేశాలను రావాల్సిందే.అంతేకాదు ఏసీ సీఎం తన వేగులను తెలంగాణ సచివాలయం నిండా మోహరించారు.కీలక పదవుల్లో వారితోనే భర్తీ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం పతి కదలికపై నిఘా పెట్టారు.
2024 జూలై 6న ప్రజా భవన్‌లో చంద్రబాబు రేవంత్ రెడ్డి భేటీ జరిగింది. ఈ సమావేశమే తెలంగాణాభివృద్దికి మరణశాసనం రాసింది. తెలంగాణ నీళ్లపై కుట్రలు జరిగాయి, ఏపీ జల దోపిడీకి అడుగులు పడ్డాయి. తెలంగాణ ప్రాజెక్ట్‌ను పడ్డ బెట్టి సీమాంధ్రలో కొత్త ప్రాజెక్ట్‌లకు పునాదులు పడ్డాయి. విభజన చట్టంలోని 9, 10 వ షెడ్యూల్‌లోని ఆస్తుల పంపకాలు, విభజన సమస్యలపై చర్చించారని చెప్పిన తెలంగాణలో జల దోపిడీపైనే ప్రధానంగా చర్చ జరిగింది.
ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం అవతల వరకూ తరిమికొట్టుతామని ప్రకటించిన కాళోజీ నా గొడవ బుక్‌ను రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఇచ్చి తెలంగాణ అస్థిత్వాన్ని ఆత్మగౌరవాన్ని ప్రగతి భవన్ సాక్షిగా ఏపీకి తాకట్టు పెట్టారు.అది ఇప్పటికీ కొనసాగుతోంది.తెలంగాణలో మళ్లీ ప్రాంతేతరుల ఆధిపత్యం చాపకింద నీరులా నిర్మాణమౌతోంది.
సీఎం భేటీలో కృష్టా గోదావరి బేసిన్‌లోని తెలంగాణ ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసే కుట్రలకు నాడే పునాది రాయి పడింది..చంద్రబాబు ఆదేశాలతో రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పడావు పెట్టారు. నీళ్లు స్వేచ్చగా ఏపీలోకి తరలించేలా పక్క స్కెచ్ వేశారు.గోదావరిలో నీటిని ఏపీకి ధారాదత్తం చేశారు.తెలంగాణను ఎండబెట్టి జల ద్రోహానికి పాల్పడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతుంది.రాష్ట్రంలో ఒక్క సాగు తాగు నీటి ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ సర్కార్ కట్టలేదు.కనీసం ఎన్నికల హామీల్లో ఇచ్చినట్లు ఒక్క ప్రాజెక్ట్‌కు పునాది రాయి వేయలేదు..ఏ ఒక్క ప్రాజెక్ట్‌లో తట్టెడు మట్టి కూడా తీయలేదు.వెరసి బీఆర్ఎస్ హాయాంలో కట్టిన ప్రాజెక్ట్‌లను పడావ్ పెట్టారు. ఏపీకి నీరు స్వేచ్చగా పారేందుకు డ్యామ్‌లు చెక్ డ్యామ్‌లను బాంబులు పెట్టి పేల్చిన చరిత్ర ఒక్క కాంగ్రెస్‌కు దక్కుతుంది. తెలంగాణలో ప్రాజెక్ట్‌లు పడావు పెట్టాలని, కాళేశ్వరం పని రాదని, మేడిగడ్డ కూలిపోయిందని ప్రచారం చేయడం, గోదావరిలోని హక్కులను మేడిగడ్డ నుంచి రేవంత్ రెడ్డి సర్కార్ ఎత్తి పోయకుండా నిర్లక్ష్యం చేస్తూ, బనకచర్ల వరద నీటిపై మాత్రమే కట్టుతున్నాన్న రహస్య ఎజెండాకు నాటి ముఖ్యమంత్రుల సమావేశం నాంది పడింది. బనకచర్లతో తెలంగాణ నీటి హక్కులకు చంద్రబాబు నాడే మరణశాసనం రాసే ప్రయత్నం చేశారు.
.బనకచర్లపై ఏపీ ప్రభుత్వం కుట్రలు, తెలంగాణ ప్రభుత్వం అసమర్థతను బీఆర్ఎస్ నిలదీసింది .దీంతో తెర పైకి నల్లమల సాగర్‌ను చంద్రబాబు తీసుకువచ్చారు. కృష్టా గోదావరిలో తెలంగాణ నీటి హక్కులను హరిస్తు తెలంగాణను ఏడారి మార్చేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చే అన్నీ అక్రమ ప్రాజెక్ట్‌లకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక్షంగా సహరిస్తున్నారు. తెలంగాణ హక్కులను ఏపీకి ధారదత్తం చేస్తున్నారు. కృష్టా నదిపై కర్ణాటక ఏపీ ప్రభుత్వాలు పరస్పం సహకరించుకుంటూ తెలంగాణను అన్యాయం చేస్తుంటే రేవంత్ రెడ్డి వాటి కుట్రలను తిప్పికోట్టకుండా డూ డూ బసవన్నలా వ్యవహిస్తున్నారు.
సీఎంల భేటీ జరిగి రెండేళ్లైంది. మరీ విభజన అంశాల్లో ఒక్క అంశం కూడా పరిష్కారం లేదంటే రహస్యం ఏమిటి.?. సీఎం స్థాయిలో అంశాలు ,మంత్రుల స్థాయిలో పరిష్కారం అయ్యే అంశాలు కూడా పరిష్కారం కూడా కాలేదు. రెండు సంవత్సరాలు గడిచిన ఫలితం శూన్యం. కాగా మంత్రులు, అధికారుల కమిటీకి ప్రకటనలకే పరిమితమైంది. మంత్రుల కమిటీ అన్నారు..అధికారుల కమిటీ అన్నారు అవన్నీ చెత్త బుట్టలోకి వెళ్లాయి.కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ తెలంగాణ ప్రజలను ఏమార్చుతూ, తెలంగాణకు వ్యతిరేకంగా చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పుతూ జల దోపిడికి పాల్పడుతున్నారు. తెలంగాణ నీటిని దోచుకునేందుకు కొత్త ప్రాజెక్ట్ లు కట్టుతున్నారు. కాబట్టి 2024 జూలై 6న ప్రజా భవన్‌లో జరిగింది విభజన హామీల ముసుగులో తెలంగాణ విధ్వంస రచనే. అది తెలంగాణ చరిత్రలో చీకటి రోజు..నాటి కుట్రలనే రెండుళ్లుగా రేవంత్ తుచా తప్పకుండా అమలు చేస్తున్నారు.
2024 జూలై6న ప్రజా భవన్ వేదికగా జరిగిన కుట్రలపై తెలంగాణ ప్రజలు అప్రమత్తం కాకపోతే రాష్ట్రం మళ్లీ సీమాంధ్రుల పెత్తనం లోకి వెళ్లే ప్రమాదం ఉంది. కృష్ణా గోదావరిలో నీటి హక్కులు కోల్పోవల్సి వస్తుంది.మళ్లీ తెలంగాణ ఏడారిగా మారే ప్రమాదముంది.
!!జాగో తెలంగాణ జాగో.!!
-తోటకూర రమేష్





