అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు

– అదే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ లక్ష్యం
– మహమ్మద్‌ అలీ షబ్బీర్‌, ఎం‌పీ సురేష్‌ ‌కుమార్‌ ‌షెట్కార్‌
– రామేశ్వ‌రంప‌ల్లిలో స్మార్ట్ ‌రేషన్‌ ‌కార్డుల పంపిణీ 

‌కామారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 29: అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ అలీ షబ్బీర్‌. ‌స్మార్ట్ ‌రేషన్‌ ‌కార్డుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఎంపీ సురేష్‌ ‌కుమార్‌ ‌షట్కర్‌తో కలసి పాల్గొన్నారు. కామారెడ్డి నియోజకవర్గం బిక్నూర్‌ ‌మండలం రామేశ్వరం పల్లి గ్రామంలో స్మార్ట్ ‌రేషన్‌ ‌కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ ‌మాట్లాడుతూ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పేదలు, బలహీన వర్గాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఈ రేషన్‌ ‌కార్డుల ద్వారా ప్రజలకు నిత్యావసర సరకులు సులభంగా అందడంతోపాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు అర్హత పొందే అవకాశం కలుగుతుంద‌న్నారు. ప్రజల అవసరాలను గుర్తించి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు సంక్షేమ కార్యక్రమాలు, మహిళా సాధికారత పథకాలు, యువతకు ఉపాధి అవకాశాలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. పేదల ముఖంలో చిరునవ్వు చూడడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. మరో ముఖ్య అతిథి, జహీరాబాద్‌ ఎం‌పీ సురేష్‌ ‌కుమార్‌ ‌షెట్కార్‌ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరేలా ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోంది.. స్మార్ట్ ‌రేషన్‌ ‌కార్డుల ద్వారా పేద కుటుంబాలకు మరింత మెరుగైన సేవలు అందనున్నాయ‌న్నారు.కేంద్రం, రాష్ట్రస్థాయిలో ప్రజలకు పథకాలను సమన్వయంతో అమలు చేయడానికి కృషి చేస్తున్నామ‌ని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువత భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని ఎంపీ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్‌ ‌మద్ది చంద్రకాంత్‌ ‌రెడ్డి, గ్రామ సర్పంచ్‌ ‌రాణి రాజు, మాజీ డీసీసీ అధ్యక్షులుడు కైలాస్‌ శ్రీ‌నివాస్‌, ‌మాజీ డీసీసీబీ అధ్యక్షుడు ఎడ్ల రాజిరెడ్డి, మార్కెట్‌ ‌కమిటీ చైర్మన్‌ ‌రాజు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నరేందర్‌, ‌వీడీసీ అధ్యక్షుడు  సూర్యకాంత్‌, ‌సొసైటీ చైర్మన్లు భీంరెడ్డి, గూడెం శ్రీనివాస్‌ ‌రెడ్డి, సుధాకర్‌ ‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్‌ ‌లింబాద్రి, సర్పంచులు రేఖ, కృష్ణ రావు, లింగ రెడ్డి, సంతోష్‌, ‌సీనియర్‌ ‌నాయకులు విజయ్‌ ‌గౌడ్‌, ‌మహిపాల్‌, ‌మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *