యూనివర్సిటీ భూముల జోలికొస్తే ఊరుకోం..

•రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు పిలుపునిస్తాం..
•బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్‌
•బిజెవైఎం ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 18: సెంట్రల్‌ ‌యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి రేవంత్‌ ‌రెడ్డికి వ్యతిరేకంగా మంగళవారం బిజెవైఎం నాయకులు అసెంబ్లీ ముట్టడికి  యత్నించారు.  యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్‌  ‌పిలుపు మేరకు భారీగా బీజేవైఎం నాయకులు కార్యకర్తలతో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్‌ ‌మాట్లాడుతూ తెలంగాణలో మార్పు రావాలంటే  కాంగ్రెస్‌ ‌రావాలని మాయమాటలు చెప్పి అధికారంలోకి వొచ్చిన రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ కమిషన్లు తింటున్నాడని ఆరోపించారు. గచ్చిబౌలిలోని సెంట్రల్‌ ‌యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టడాన్ని వెంటనే నిలిపివేయాలన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, సంక్షేమ భవనాలకు సొంతంగా కట్టించే దమ్ము లేదని, కానీ  ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ దిల్లీకి సూట్‌ ‌కేసులు మోయడానికి మాత్రం రేవంత్‌ ‌రెడ్డి ముందుంటారని ధ్వజమెత్తారు. ముల్కీ రూల్స్ ‌లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆనాడు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్‌ ‌యూనివర్సిటీని కేటాయించారని, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 2300 ఎకరాల స్థలాన్ని యూనివర్సిటీకి కేటాయిస్తే ఆనాడు రాళ్లు గుట్టలు చెట్లు జంతువులతో ఉన్న స్థలాన్ని దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు హైదరాబాద్‌ ‌విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే ప్రఖ్యాతి కలిగిన యూనివర్సిటీగా ఈ దేశంలో టాప్‌ ‌ఫోర్త్ ‌ర్యాంక్‌ ‌యూనివర్సిటీగా పేరు పొందిందని తెలిపారు.  అలాంటి యూనివర్సిటీ స్థలాన్ని వేలం వేసి రియల్‌ ఎస్టేట్‌ ‌మాఫియాకు కట్టబెట్టాలని రేవంత్‌ ‌రెడ్డి చేస్తున్న కుట్రలను  బీజేవైఎం ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు నిర్వహించామన్నారు.

అరెస్టు చేసి స్టేషన్లు తిప్పడం సిగ్గుచేటు..
బిజెపి యువమోర్చా నాయకులను పిడుగులు బుద్ధి అనేక పోలీస్‌ ‌స్టేషన్లో తిప్పుతూ అరెస్టు చేయడం సిగ్గుచేటని మహేందర్‌ అన్నారు.  గతంలో బిఆర్‌ఎస్‌ ‌సర్కార్‌ ‌యూనివర్సిటీ స్థలాన్ని కట్టబెట్టడం రోడ్డు వేయడం లాంటి కార్యక్రమాలు చేసింది నేడు. రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం యూనివర్సిటీకి వొచ్చి ఫుట్బాల్‌ ఆడి ఆ చుట్టుపక్కల ఉన్న స్థలాన్ని చూసి కబ్జా చేయడానికి పన్నాగం పండుతున్నారు. దీన్ని ముమ్మాటికి బిజెపి వ్యతిరేకిస్తుంది. హెచ్‌ ‌సీయూ లోపల 220 రకాల పక్షులు 400కు పైన జింకలు 300 కు పైన నెమళ్లు కుందేళ్లు ఇతర వనమూలికలు ఉన్నాయి వాటి అన్నింటితో పాటు న్యాచురల్‌ ‌గా ఏర్పడిన మష్రూమ్‌ ‌రాక్‌ ‌పీకాక్‌ ‌లేక్‌ ‌బఫెలో లేక్‌ ‌వంటి చెరువులు పొల్యూట్‌ ‌చేసి లంగ్స్ ఆఫ్‌ ‌హైదరాబాద్‌ ‌గా పిలవబడుతున్న నేచర్‌ ‌ను దెబ్బతీసే కుట్ర రేవంత్‌ ‌సర్కార్‌ ‌చేస్తుందని అన్నారు.

అన్ని తక్షణమే తన నిర్ణయానికి వీనికి తీసుకోవాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళలను చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేష్‌, ‌చిత్తరంజన్‌, ‌కుమార్‌ ‌యాదవ్‌, ‌తరుణ్‌ ‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గణేష్‌, ‌సామల పవన్‌, ‌రాష్ట్ర కార్యదర్శులు ప్రవీణ్‌, అశోక్‌, ‌రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి అరవింద్‌, అనిత రెడ్డి, అధికార ప్రతినిధులు శివచంద్రగిరి, కుశాల్‌ ‌గౌడ్‌, ‌కోమలి నాయక్‌, ఇం‌ద్రాప్రియాంక,గోవర్ధన్‌, ‌రాఘవేందర్‌, ‌జిల్లా అధ్యక్షులు భరత్‌, ‌ప్రధాన కార్యదర్శులు అవినాష్‌, ఆయుష్‌, ‌శ్రవణ్‌ ‌రాఘవేందర్‌ ‌సునీల్‌ ‌కుమార్‌, ‌గణేష్‌, ‌బిట్టు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page