– వారి వివరాలు సేకరిస్తాం
– అఖిలపక్ష భేటీలో కమిటీ ఛైర్మన్ కేశవరావు
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్4: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ప్రత్యక్షంగా.. పరోక్షంగా పాల్గొన్న ఉద్యమకారులందరికి న్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని కె. కేశవరావు స్పష్టం చేశారు. ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం కె.కేశవరావు అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ గురువారం హైదరాబాద్ సచివాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. అనంతరం కేకే మాట్లాడుతూ విద్యార్థులు, ఉద్యమకారుల సంఘాలను మళ్లీ కలుస్తామని అన్నారు. అందుకోసం ఉద్యమకారులందరినీ పిలిచి మాట్లాడతామని పేర్కొన్నారు. ఉద్యమకారులకు న్యాయం చేయాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం కమిటీ సమావేశం ఈరోజు జరిగిందని వివరించారు. ఈ అఖిల పక్షం సమావేశంలో అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారని చెప్పారు. విద్యార్థులతో, ఉద్యమకారుల సంఘాలతో అనుబంధం ఉన్న వారిని మళ్లీ కలుస్తామని కె.కేశవరావు తెలిపారు. ఉద్యమకారులందరిని పిలిచి మాట్లాడుతామన్నారు. తెలంగాణ తొలి దశతోపాటు మలి దశ ఉద్యమకారులందరికీ న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని పేర్కొన్నారు. ఉద్యమకారులకు న్యాయం చేసేందుకు రాజకీయాలకు అతీతంగా సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలంగాణ రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అందుకోసం ఉద్యమకారులందరితోనూ మాట్లాడతామన్నారు. నష్టపోయిన అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. ఈ ప్రజా పాలన ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించడానికి ఏర్పాటు చేసిన కమిటీ.. అఖిలపక్ష పార్టీల నుంచి ఇద్దరి చొప్పున పిలిచామని పేర్కొన్నారు. పార్టీలు మాత్రమే కాకుండా ఉద్యోగ, విద్యార్థి, జర్నలిస్ట్, న్యాయవాదులు అందరినీ పిలిచి మాట్లాడతామని వివరించారు. కవులు, కళాకారులు తెలంగాణ సాధన కోసం పని చేసిన అందరిని గుర్తిస్తామన్నారు. ఈ పక్రియ అమరవీరుల ద్వీపంలో ప్రారంభమవుతుందని తెలిపారు. ఉద్యమకారులకు గౌరవం ఇవ్వాలని, వారిని గుర్తించాలని, అలాగే అందరి నుంచి సూచనలు స్వీకరించాలని నిర్ణయించామన్నారు. రాజకీయాలకతీతంగా సలహాలు, సూచనలు స్వీకరిస్తామని, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో విజ్ఞప్తులు స్వీకరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. ఉద్యమ సమయంలో తమ జీవితంలో యవ్వనం పోయిందని, తమని ఆదుకోవాలని ఉద్యమకారులు కోరుతున్నారని ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు. అందుకోసం ఉద్యమకారుల జేఏసీలు ఉన్నాయని, వారదరినీ కలుస్తామన్నారు. అలాగే అన్ని యూనివర్సిటీల జేఏసీలు ఉన్నాయని.. వారితో కూడా సమావేశమవుతామని ఎమ్మెల్సీ కోదండరాం స్పష్టం చేశారు. ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి జేఏసీ, యూనివర్సిటీ జేఏసీలను సంప్రదిస్తామని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ వెల్లడించారు. అందరి సలహాలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన అని చెప్పారు. స్టేక్ హోల్డర్స్‌ను పిలిచి మాట్లాడతామన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకొని ఉద్యమకారులను గుర్తిస్తామని పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





