సీఎం రేవంత్ మెగా టూర్

– పాలమూరు ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్
– నారాయణపేట, గద్వాల సాగునీటి ప్రాజెక్టుల తనిఖీ..
– స్పాట్ లోనే కీలక ఆదేశాలు
– బెంగళూరు నుంచి నేరుగా మక్తల్ కు చేరుకున్న ముఖ్యమంత్రి
– నెట్టెంపాడు, గూడెందొడ్డి రిజర్వాయర్ ను పరిశీలించిన సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్

మహబూబ్ నగర్, ప్రజాతంత్ర, జూన్ 4: జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టుల పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగురువారం పరిశీలించారు. గురువారం బెంగుళూరు నుంచి నేరుగా నారాయణపేట జిల్లా మక్తల్ చేరుకున్న సీఎం మొదటగా మక్తల్-నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల ప థకంలో జరుగుతున్న పనులను వివరించే ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించారు. మక్తల్ మండలం కాట్రేవుపల్లి గ్రామ సమీపంలో కొనసాగుతున్న ఎత్తిపోతల ప్రాజెక్టు ప్యాకేజీ -1 సైట్ వద్దకు చేరుకుని అక్కడ పనులను పరిశీలించారు. ప్యాకేజీ-1లో భాగంగా జరుగుతున్న పంప్ హౌస్ పనులు ఎంతమేరకు పూర్తయ్యాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాంక్రీటు పనులను ప్రారంభించి వేగంగా పూర్తి చే యాలని ఆదేశించారు. జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ‌రూర్ మండలంలోని నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పేస్ 1 లోని ని గుడ్డేమ్. గుడ్డేమ్ దొడ్డి రిజర్వాయర్ ను గురువారం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, యువజనుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, కర్ణాటక ఇరిగేషన్ మంత్రి బోస్ రాజ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఫేజ్-1లో ఉన్న గుడ్డేమ్ దొడ్డి మోటార్ల పని తీరును ముఖ్య మంత్రి పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి రూపొందించిన జోగు లాం బ గద్వాల జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక ఆడియో-విజువల్ ప్రదర్శనను సీఎం తిలకించారు. గుడ్డేమ్ దొడ్డి రిజర్వాయర్ అభి వృద్ధి, నీటి నిల్వ సామర్థ్యం, ఆయకట్టు విస్తీర్ణం తదితర అంశాలపై అధికారులు చిత్ర ప్రదర్శన ద్వారా ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి,ఇరిగేషన్ శా ఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి గుడ్డేమ్ దొడ్డి, ర్యాలం పా డు. ఘట్టు రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా జిల్లాలో సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ మూడు రిజర్వాయర్ల కెపాసిటీ పెంపు కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. అంతేకాక గుడ్డెం దొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 15 టీఎంసీ లకు పెంచాలని, ర్యాలంపాడు రిజర్వాయర్ యొక్క నీటి సమకూర్చే ధారణిని అంతర్గతంగా అభి వృద్ధి చేయాలనీ, ఇరిగేషన్ రోడ్లను అన్ని మండ లాలకు అనుసంధానం చేయుటకు నిధులు ఇవ్వాలని, కాల్వ లైనింగ్కు నిధులు మంజూ రు. గుడ్డెం దొడ్డి రిజర్వాయర్ ఫేజ్-1 మరియు ఫేజ్-II ద్వారా నీటిని సరఫరా చేసే స్కీమన్ను మెరుగుపరచడం.. అలాగే గుడ్డెం దొడ్డి రిజర్వాయర్ ద్వారా ఇరిగేషన్ భూములకు 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసి, రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కార్య క్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా, గొర్రెల, మేక ల అభివృద్ధి సహకార కార్పొరేషన్ ఛైర్మన్ సరి తా తిరుపతయ్య, వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ గ ట్టు తిమ్మప్ప, మాజీ ఎమ్మెల్యే సంపత్ ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామో దర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో పాటు కర్నాటక మాజీ మంత్రి ఎన్ఎస్ బోసెరాజు, ప్రజాప్రతినిధులు, నీటి పారు దల శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *