చరిత్ర సృష్టించిన టీవీకే విజయ్‌…

“విజయ్‌కు ఎన్డీయే ఇండి కూటమికి ఎంత దూరంగా ఉంటే టీవీకేకు తమిళనాడులో అంత ఫ్యూచర్‌ ఉంటుంది..ఏ కూటమివైపు మొగ్గు చూపిన భవిష్యత్ అంధకారమే అవుతుంది. రెండు జాతీయ కూటమిలో ఉన్న ఏ ప్రాంతీయ పార్టీ కూడా బతికి బట్ట కట్టే పరిస్థితి కనిపించడం లేదు. అయితే టీవీకే చీఫ్‌ విజయ్‌ ఒంటరిగా ఉండటం కూడా ప్రమాదమే..ఇప్పుడు విజయ్‌ ముందు ఉన్న ఆప్షన్‌ ఒక్కేటే, ఇండి, ఎన్డీయే కూటములకు సమ దూరం పాటిస్తూ ఆ రెండు కూటమల్లో లేని ప్రాంతీయ పార్టీలో సంబంధాలు కొనసాగిస్తూ ప్రత్యమ్నాయ రాజకీయ ఎజండాతో కలిసి పని చేస్తే విజయ్‌ విజిల్ సౌండ్ దేశ వ్యాప్తంగా రీసౌండ్ మోగుతుంది..”

 తొలిసారి బెంగాల్‌లో వికసించిన కమలం.!!

ఏప్రిల్‌  నెలంతా బెంగాల్‌, తమిళనాడు, కేరళ, అసొం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అనేక దశలుగా ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల జరిగాయి.మే 4న ఫలితాలు వెలుబడ్డాయి..అయితే పుదుచ్చేరి మినహా నాలుగు రాష్ట్రాల్లో  వోటర్లు చాలా భిన్నమైన, సంచలనమైన తీర్పును చెప్పారు. మరీ ముఖ్యంగా తమిళనాడు, బెంగాల్‌ వోటర్లు చారిత్రాత్మక తీర్పునుచ్చారు.

తమిళనాడులో టీవీకే చీఫ్ విజయ్‌ చరిత్ర సృష్టిస్తే, బెంగాల్లో కమల వికాసం జరిగి కొత్త చరిత్రను బీజేపీ రాసింది. స్వాతంత్ర్యం భారత్ లో తొలిసారి బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దశాబ్దాలు కమ్యూనిస్టు, కాంగ్రెస్ కోటలను మమత బెనార్జీ బద్దలు కొట్టితే, 2026 అసెంబ్లీలో ఎన్నికల్లో దీదీ కంచుకోటను బీజేపీ బద్దలు కొట్టింది.ఇది బీజేపీకి చరిత్రాత్మక గెలుపు.బెంగాల్‌లో పాగా వేసేందుకు కాషాయ పార్టీ చాలా ఏళ్ల నుంచి ప్రయత్నాలు చేసింది.అయితే దశాబ్దాలుగా కమలం నేతల ప్రయత్నాలు విఫలమైతూనే ఉన్నాయి. చివరికి మే 4, 2026లో బీజేపీ తన లక్ష్యాన్ని ముద్దాడింది. బెంగాల్‌ గెలుపుతో ఈశాన్య భారత్ లోని రాష్ట్రాలను కషాయ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేసింది.తాజాగా ఫలితాల సరళిగమనిస్తే ఈ సారి దీదీ మంత్రానికి బెంగాల్ వోటర్లు ముగ్దులు కాలేకపోయారు. దశాబ్దన్నర దీదీ పాలనకు  బెంగాలీలు పుల్ స్టాప్‌ చెప్పారు.

బెంగాల్‌లో ఈసారి కూడా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడుచిపెట్టుకుపోయింది. గతంలో కంటే దారునంగా పతనమైంది. దీదీ మోదీ  పోట్లాటతో ఇండి కూటమి పూర్తిగా వైప్‌ ఔట్‌ అయిపోయింది.అంతేకాదు టీఎంసీ, మమతపై బెంగాలీల వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది.అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక వోట్‌న షేర్‌ను తమ వైపు తిప్పుకోవడంతో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలు చతికిలపడ్డాయి.

2021 అసెంబ్లీ ఎన్నికల నుంచే బెంగాల్ పాగా వేసేందుకు బీజేపీ పావులు కదుపుతుంది..దీదీ నుంచి సువెందు అధికారిని విభజించి, పార్టీని చీల్చే కుట్రలు బీజేపీ చేసిన అప్పుడు దీదీ ముందు కాషాయ పార్టీ కుట్రలు పారలేదు. అయితే పార్లమెంట్‌ ఎన్నికల్లో భారీగా వోటు షేర్‌ పెంచుకోవడమే కాదు, ఎక్కువ ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. ఆ ఆర్వాత దీదీని బీజేపీ బలంగా టార్గెట్‌ చేసింది. మమత ప్రభుత్వంపై గవర్నర్‌ వ్యవస్థను, సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను కక్ష పూరిత రాజకీయాలకు బీజేపీ ఒక ఆయుధంగా మార్చుకుంది.

దేశ భద్రతా, ప్రజల భావోద్వేగాలు, శాంతి భద్రతలు, దేశ భక్తి, బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు, ఎస్‌ఐఆర్‌ వంటి అనేక పరిణామాలు మమత ఓటమికి కారణమైతే, బీజేపీ గెలుపుకు దారులు వేశాయి. అంతేకాదు బెంగాల్‌లో దీదీ ఒంటరిని చేసిన బీజేపీ, ప్రజల కుల మత భావోద్వేగాలు, ఆర్ఎస్‌ఎస్‌ వంటి బలమైన ఆర్గనైజేషన్లు బెంగాల్‌లో కమల వికాసానికి దోహద పడ్డాయి. అంతేకాదు,కాంగ్రెస్‌ ద్వంద్వ రాజకీయాలు, కమ్యూనిస్ట్‌ల బలహీనతలే బెంగాల్‌లో కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు, దీదీ ఓటమికి మరో కారణం కూడా.

బెంగాల్‌ లో గెలుపు బీజేపీకి కొత్త ఉత్సహాన్నిస్తుంది.. ప్రతీకూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడంతో దేశంలో బీజేపీని మించిన పార్టీ దేశంలో లేదు..ఎక్కడ బలహీనంగా ఉంటుందో అక్కడే ఎక్కువ ఫోకస్‌ పెట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది..ఇప్పుడు బెంగాల్‌లో బీజేపీ అలాగే సక్సెస్‌ అయింది. 131 రాజ్యాంగ సవరణ, డీలిమిటెషన్‌, మహిళ రిజర్వేషన్ చట్టం అమలు కోసం బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వం కుట్రలను చేధిస్తూ, పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని ఓడించిన విపక్షాలు ఆ సక్సెస్‌ను ఎన్నికల్లో గెలుపు వరకూ నడిపించలేక చతికిలపడ్డాయి. పార్లమెంట్‌లో ఓటిమి తర్వాత డిఫెన్స్‌లో పడ్డ బీజేపీకి బెంగాల్ గెలుపు గొప్ప ఊరటనే కాదు, ఉత్సహాన్ని ఇస్తుంది.ఒక రకంగా పార్లమెంట్లో 131వ రాజ్యాంగ సవరణ విషయంలో బీజేపీ ఓడిపోయిన ఎన్నికల రాజకీయాల్లో గెలిచింది.సహజంగా  బిల్లు వీగిపోయిన తర్వాత ప్రధాని మోదీ  జాతినుద్దేశించి చేసిన ప్రసంగం కూడా బెంగాల్‌లో బీజేపీకి గెలుపు కారణంగా చెప్పవచ్చు.

ఇక తమిళనాడులో తమిళులు తమ ఉనికిని కాపాడుకున్నారు. తమ అస్థిత్వం, ఆత్మగౌవరాన్ని నిలబెట్టుకున్నారు. ద్రవిడ అస్థిత్వం, తమిళుల ఆత్మగౌరవానికి ప్రమాదకరంగా మారిన జాతీయ పార్టీలను తంబీలు రాజకీయ సమాధి చేశారు. తమిళనాడులోకి బీజేపీ ఎంట్రీలేదని తంబీలు స్పష్టంగా వోట్ల రూపంలో తీర్పునిచ్చారు. అయితే డీఎంకే , ఏఐడీఎంకే పార్టీలకు తమిళ వోటర్లు కర్రుకాచి వాతపెట్టారు. డీఎంకేపై వ్యతిరేకత, ఏఐడీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, కాంగ్రెస్‌ దేశంలో ప్రాంతీయ పార్టీలను, ప్రజల అస్థిత్వాన్ని నిర్వీర్యం చేసే ఎజెండాతో ఉండటంతో కాంగ్రెస్‌ను మట్టి కరిపించారు. ఇండి కూటమిలో ఉన్న కమ్యూనిస్టుల పరిస్థితి గతమెంతో ఘనకీర్తి అన్నట్లు ఉంది.

తమిళనాడులో ఎప్పుడు ఉత్తరాది పార్టీలకు తలొగ్గమని మరోసారి నిరూపించారు..ఇండి కూటమి, ఎన్డీయే కూటమిని కాకుండా ఒంటరిగా పోటీ చేసిన టీవీకేకు పట్టం కట్టారు..తమిళ అస్థిత్వం, ఆత్మగౌరవాన్ని కాపాడటం విజయ్‌తోనే సాధ్యమని విశ్వసించారు. అందుకే విజయ్‌ పార్టీ పెట్టిన కొద్దీ రోజుల్లోనే అధికారాన్ని కట్టబెట్టారు. వాస్తవానికి విజయ్‌ను, టీవీకే పార్టీని జాతీయ పార్టీలే కాదు, తమిళన పార్టీలుగా చెప్పుకునే డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలు కూడా వ్యక్తిగతంగా రాజకీయంగా టార్గెట్ చేశారు. హిందీ భాషా విషయంలో, నీట్‌ విషయంలో విజయ్‌ ఎత్తుకున్న ఎజెండా సక్సెక్‌ అయింది. అంతేకాదు, అధికారాన్ని అడ్డుపెట్టుకుని విజయ్‌ను బీజేపీ అనేక ఇబ్బుందులు పెట్టింది.విజయ్‌ సినిమా విడుదల కాకుండా కుట్రలు చేసింది. సీబీఐ, ఈడీ, ఐటీ విచారణ పేరుతో ఎన్నికల ముందు వరకూ, పోలింగ్‌ కు రెండు రోజుల వరకూ బీజేపీ విజయ్‌ను హింసించింది ..చివరికి విజయ్‌ కుటుంబాన్ని కూడా బీజేపీ రోడ్డుకు లాగింది.తమ భార్యను ఎన్నికల అస్త్రంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. చివరికి విజయ్‌ త్రిష మధ్య ఉన్న స్నేహాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేసి ఇప్పుడు రెండు కూటములు చేతులు కాల్చుకున్నాయి.

ఎన్నికల నోటిషికేషన్‌ వచ్చిన క్షేణం నుంచి విజయ్‌ను ఎన్డీయే, ఇండి కూటములు టార్గెట్ చేశాయి..తమతో పొత్తు పెట్టుకోవాలని ఒత్తిడి చేశాయి. ఆర్థికంగా రాజకీయంగా కుటుంబ పరంగా వేధించే ప్రయత్నం చేశాయి.కానీ ఏనాడు విజయ్‌ వెనక్కి తగ్గలేదు.ఒకానోక సమయంలో విజయ్‌ ఎన్డీయేతో పరోక్షంగా జతకట్టుతున్నారన్న ప్రచారంలో కొంత వాస్తవం ఉన్న దాన్ని విజయ్‌ వ్యూహాత్మకంగా అధిగమించారు. ఏ పార్టీతో ఏ కూటమితో పొత్తులేదని, సింహం సింగిల్‌గానే వస్తుందని ప్రకటించారు.

మరోవైపు తమిళనాడు రాజకీయాలు అంటేనే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారి డామినేషన్‌ ఉంటుంది. డీఎంకే నుంచి ఇవాళ్టి టీవీకే వరకూ మొత్తం సినిమా గ్లామర్‌తోనే ఎదిగిన పార్టీలు.మెజార్టీ సీఎంలు కూడా సినిమా ఫీల్డ్‌ నుంచి వచ్చిన వారే. తాజాగా విజయ్‌ కూడా సీనిమా రంగం నుంచి వచ్చిన సీఎమ్మే!. తమిళనాడులో టీవీకే తుఫాన్ సృష్టించింది. కనీసం ఆశలు లేని విజయ్‌ ఏకంగా తమిళంలో భూకంపం సృష్టించారు.గెలుస్తామన్న హోప్‌ లేని పరిస్థితి నుంచి ఇప్పుడు ఏకంగా అధికారాన్నే చేపట్టే స్థాయికి విజయ్‌ సునామీ సృష్టించారు.

వాస్తవానికి టీవీకే గెలుపు విజయ్‌ ఒంటరి పోరాటానికి ప్రతి ఫలమైతే, ఈ విజయం విజయ్‌ ఫ్యాన్స్‌ గెలుపు.విజయ్‌పై బీజేపీ, డీఎంకే, ఏఐడీఎంకే వేధింపు రాజకీయాలు కూడా టీవీకే గెలుపులో ఉంది. ఒక రకంగా తమిళనాడులో విజయ్‌ సైలెంట్‌ వేవ్‌తో వోట్ల సునామీ సృష్టించారు. మరోసారి తమిళనాడుకు మరో సినీ హీరోని తంబీలు సీఎంను చేశారు. ముఖ్యంగా విజయ్‌ టీవీకే పార్టీకి యువతను ఆకర్షించింది.మొదటి నుంచి విజయ్‌ జెన్‌ జీ వోట్లపై ఫోకస్‌ పెట్టారు.వారిని ఆకట్టుకునే ప్రచార ఎజెండాను సెట్‌ చేశారు.అనుకున్న దాని కంటే యువ వోటర్లను విజయ్‌ తన వైపు తిప్పుకున్నారు. సిని గ్లామర్‌తో పాటు యూత్‌లో విజయ్‌పై ఉన్న నమ్మకమే టీవీకే గెలుపులో కీలకమైంది.

సహజంగా దేశంలో యువ వోటర్లను ఆకర్షించడంతో మోదీ  ఒక మాస్టర్ మైండ్..యువతను కాషాయ పార్టీకి దగ్గర చేయడంతో కీలకపాత్ర పోషిస్తారు.కానీ తమిళనాడు మోదీ  చరిష్మా పని చేయలేదు.అసలే తమిళ ప్రజలు ఉత్తరాది పార్టీలపై తీవ్ర వ్యతిరేకతతో ఉంటారు.దీంతో తమిళనాడు విజయ్‌ వెంట కన్సాలిడేట్‌ అయ్యారు. అదే విజయ్‌ని విజయం వైపు నడిపించాయి. విజయ్‌ స్థాయిలో యువ వోటర్లను డీఎంకే, ఏఐడీఎంకే ఆకర్షించ లేకపోయింది.

అయితే ఇప్పుడు తమిళనాడులో టీవీకే పార్టీ, విజయ్‌ ముందు అనేక సవాళ్లున్నాయి..ప్రభుత్వం ఏర్పాటుకు మేజార్టీ ఉన్నప్పటీకి ఒకటి రెండు ఎమ్మెల్యేల మద్దుతు అవసరం..అంతేకాదు ప్రభుత్వ నడిపించాలంటే డీఎంకే,ఏఐడీఎంకే రెండింటిలో ఏదో ఒక పార్టీ సపోర్ట్ అసవరం..దాన్ని ఎలా అధికమిస్తారో అన్న దానిపై విజయ్‌ టీవీకే ప్రభుత్వం భవిష్యత్‌ ఆధారపడి ఉంటుంది.

మరోవైపు డీఎంకే, ఏఐడీఎంకే ఎప్పుడూ పక్కలో బల్లెంలా విజయ్‌ను వెంటాడుతాయి..అవసరమైతే విజయ్‌ ని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కుట్రలు చేసిన చేస్తాయి.ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు డీఎంకే, ఏఐడీఎంకే పోస్ట్ రిజల్డ్ తర్వాత పోత్తు పెట్టుకున్న ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.ఎందుకంటే గతంలో బీజేపీతో, కాంగ్రెస్‌తో పోత్తులు పెట్టుకున్న చరిత్ర డీఎంకే, ఏఐడీఎంకేలకు ఉన్నాయి. ఇప్పడు విజయ్‌ను నిలవరించేందుకు డీఎంకే ఎన్డీయే కూటమిలో చేరిన చేరవచ్చు. ఏదీ ఏమైనా తమిళనాడుతో టీవీకే విజయ్‌ గెలుపు ఒక చరిత్రాత్మక గెలుపు.దశాబ్దాల తర్వాత తమిళ పాలిటిక్స్‌లో విజయ్‌ రూపంలో కొత్త సునామీ వచ్చింది.ఒక అసోంలో మొదటి నుంచి అందరూ ఊహించినట్లు బీజేపీ కూటమి గెలిచింది.హేమంత బిశ్వ శర్మ నేతృత్వంలో బీజేపీ గెలుపు నల్లేరే మీద నడకే అయ్యింది. అసోంలో కాంగ్రెస్ బీజేపీకి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది.

అయితే కాంగ్రెస్‌ ఆశ ఒక్క కేరళ మాత్రమే.అక్కడ కూడా ఒంటిరిగా పోటీ చేయకుండా యూడీఎఫ్‌ కూటమిగా పోటీ చేసి గెలిచింది..సీఎం విజయ్‌ నాయకత్వం వహించిన ఎల్డీఎఫ్‌కు ఓటమి తప్పలేదు..అయితే కేరళలో ప్రతి ఎన్నికల్లో  అక్కడి వోటర్లు వినూత్న తీర్పు ఇస్తారు.ఒకసారి యూడీఎఫ్‌కు అధికారాన్ని ఇస్తే మరోసారి ఎల్‌డీఎఫ్‌కు పట్టం కడుతారు..గత ఎన్నికల్లో రెండు పర్యాయాలు కేరళం ప్రజలు విజయన్‌కు పట్టం కట్టారు.

తమిళనాడులో కూడా వరుసగా రెండు పర్యాయాలు ఒకే పార్టీని తమిళిలు పట్టం కట్టరు.ఒక సారి డీఎంకేను గెలిపిస్తే, మరోసారి ఏఐడీఎంకేకు పట్టం కట్టుతారు. అయితే కేళరంలోగానే తమిళనాడులో కూడా ప్రజలు డీఎంకేను వరుసగా రెండు సార్లు గెలించారు.అయితే ఈసారి అనుహ్యంగా టీవీకే విజయ్‌కు తంబీలు పట్టం కట్టి చరిత్ర సృష్టించారు.

మరోవైపు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశంలో కొత్త రాజకీయ సమీకరణలకు దారి తీయవచ్చు.ఒకటి బెంగాల్‌ గెలుపుతో బీజేపీ దేశ రాజకీయాలపై ఆధిపత్యం ప్రదర్శిస్తే, తమిళనాడులో టీవీకే విజయ్‌ గెలుపు బీజేపీకి ఆధిపత్యానికి సవాల్ విసురవచ్చు.తమిళ అస్థిత్వం, ఆత్మగౌరవం విషయంలో గోడమీద పిల్లిలా వ్యవహరిస్తే డీఎంకే, ఏఐడీఎంకే, విజయ్‌ రూపంలో కొత్త ఆశాకిరణం తమిళలకు లభించింది.

అంతేకాదు విజయ్‌ నాయకత్వంలో తమిళనాడులో కొత్త చరిత్ర నిర్మించవచ్చు.అయితే తమిళ ప్రజల విశ్వాసాన్ని ఎంత మేరకు నిలబెట్టుకుంటారన్నదానిపై  విజయ్‌ భవిష్యత్‌ ఉంటుంది.పాలనలో విజయ్‌ ఆలోచన విధానాలే ఎంజీఆర్‌, కరుణానిధి, జయ లలిత సరసన నిలబెట్టుతాయి. ఏ మాత్రం తప్పటడుగు వేసిన తమిళనాడులో రాజకీయ చరిత్ర హీనుడిగా మిలిగిపోతారు.

తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్‌కు, ఇండి కూటమికి ఇక భవిష్యత్‌ ముసుకుపోయినట్లే..విజయ్‌కు ఎన్డీయే ఇండి కూటమికి ఎంత దూరంగా ఉంటే టీవీకేకు తమిళనాడులో అంత ఫ్యూచర్‌ ఉంటుంది..ఏ కూటమివైపు మొగ్గు చూపిన భవిష్యత్ అంధకారమే అవుతుంది. రెండు జాతీయ కూటమిలో ఉన్న ఏ ప్రాంతీయ పార్టీ కూడా బతికి బట్ట కట్టే పరిస్థితి కనిపించడం లేదు. అయితే టీవీకే చీఫ్‌ విజయ్‌ ఒంటరిగా ఉండటం కూడా ప్రమాదమే..ఇప్పుడు విజయ్‌ ముందు ఉన్న ఆప్షన్‌ ఒక్కేటే, ఇండి, ఎన్డీయే కూటములకు సమ దూరం పాటిస్తూ ఆ రెండు కూటమల్లో లేని ప్రాంతీయ పార్టీలో సంబంధాలు కొనసాగిస్తూ ప్రత్యమ్నాయ రాజకీయ ఎజండాతో కలిసి పని చేస్తే విజయ్‌ విజిల్ సౌండ్ దేశ వ్యాప్తంగా రీసౌండ్ మోగుతుంది.

-తోటకూర రమేష్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *