సహాయక చర్యలకు నిధుల సమస్య లేదు

– ఎస్‌డీఆర్‌ఎఫ్‌, టీఆర్‌ నిధులు వాడుకోండి
– అప్రమత్తతతో ప్రమాదాన్ని నివారించగలిగాం
– వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: తుఫాను సహాయ, పునరావాస చర్యల్లో జిల్లా కలెక్టర్లు స్టేట్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌ ఫండ్‌ (ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ట్రెజరీ(టీఆర్‌) నిధులు వాడుకొని తదుపరి 30 రోజుల్లో ర్యాటిఫై చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదే శించారు. నిధులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రజాభవన్‌ నుంచి ఆయన పాల్గొన్నారు. కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, యావత్‌ కేబినెట్‌ 48 గంటలు ముందుగా అలర్టు చేయడం వల్ల, ప్రభుత్వ యంత్రాంగం అందుకనుగుణంగా స్పందించడంతో ప్రాణ, భారీ ఆస్తి నష్టం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోగలిగామన్నారు. రాబోయే 24 గంటలు కలెక్టర్లు, ఇతర అధికారులు సైక్లోన్‌ మాన్యువల్‌ దగ్గర పెట్టుకొని సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలని సూచించారు. కృష్ణాజిల్లా నుంచి నల్లగొండ, ఖమ్మం జిల్లా మీదుగా మొంథా తుఫాన్‌ వెళ్లడంతో ఉత్తర తెలంగాణలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని డిప్యూటీ సీఎం తెలిపారు. అధికారులు అప్రమత్తమై పత్తి తడవకుండా టార్పాలిన్లు కప్పడం, గోదాముల్లోకి పత్తి పంటను తరలించడంతో పత్తి పంటను కాపాడుకోగలిగామన్నారు. ఉత్తర, దక్షిణ సీఎండీలు మొదలుకొని విద్యుత్‌ శాఖ యావత్తు తుఫాను సహాయ చర్యల్లో నిమగ్నమైందన్నారు. భారీ తుఫాను వచ్చినప్పటికీ ఎక్కడా విద్యుత్‌ సమస్య తలెత్తకుండా మొబైల్‌ వ్యాన్లతో సిబ్బంది ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటూ ముందుకెళ్లారని వివరించారు. తుఫాను నేపథ్యంలో రెండు డిస్కౌంట్‌ పరిధిలో 33/11 కె.వి సబ్‌ స్టేషన్లు 11 దెబ్బతినగా ఏడు సబ్‌ స్టేషన్‌లను పునరుద్ధరించారని, కొద్దిగంటల్లో మిగిలిన వాటినీ పునరుద్ధరిస్తారని వివరించారు. 33 కెవి లైన్లు 101 దెబ్బతినగా అందులో 96 లైన్లను ఇప్పటికే పునరుద్ధరించారని, ఈరోజు మిగిలిన ఐదు లైన్లను పునరుద్ధరిస్తారని వివరించారు. 11 కెవి లైన్లు 237 డామేజ్‌ కాగా ఇప్పటికే 227 లైన్లను పునరుద్ధరించారని వివరించారు. డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌ (డీటీఆర్‌)లు 171 దెబ్బతినగా 49 ప్రాంతాల్లో పునరుద్ధరించారని, మరో 122 ట్రాన్స్‌ఫాÛర్మర్లను కొద్ది గంటల్లో పునరుద్ధరిస్తారని డిప్యూటీ సీఎం వివరించారు. 638 విద్యుత్‌ స్తంభాలు దెబ్బతినగా 304 విద్యుత్‌ స్తంభాలను పునరుద్ధరించారని, మరో 334 కొద్ది గంటల్లో పునరుద్ధరిస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page