– ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులతో బట్టబయలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : కూకట్‌పల్లిలోని లులు హైపర్ మార్కెట్‌లో ఫుడ్ సేప్టీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజారోగ్యానికి హాని కలిగించే విధంగా ఉన్న దాదాపు 150 కిలోల ఆహార పదార్థాలను వారు సీజ్ చేశారు. మంగళవారం ఈ హైపర్ మార్కెట్‌లో తనిఖీలు చేపట్టిన అధికారులకు పలు ఆహార పదార్థాల్లో పురుగులు ఉండటాన్ని గుర్తించారు. అలాగే నాసిరకం ఆహార పదార్థాలు నిల్వ చేసినట్లు కనుగొన్నారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉండడాన్ని అధికారులు గుర్తించారు. పాడైపోయిన కూరగాయలతోపాటు పరిసర ప్రాంతాలలో పురుగులు సంచరిస్తున్నట్లు ఈ తనిఖీల్లో అధికారులు గమనించారు. గడువు సవిÖపించిన ఆహార పదార్థాలపై తప్ప్పుదారి పట్టించే విధంగా లేబుళ్లు అతికించినట్లు గుర్తించారు. గడువు ముగిసిన ఎఫఎసఎసఏఐ లైసెన్స్‌తో ప్యాక్‌డ్ ఫుడ్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ మార్కెట్ నుంచి బయటకు వెళ్లే డైనేజీ కూడా మాంసాహార వ్యర్థాలతో మÖసుకుపోయినట్లు తనిఖీల్లో తేలింది. కల్తీ, అధిక కృత్రిమ రంగుల అనుమానంతో పలు ఆహార పదార్థాల నమÖనాలను అధికారులు సేకరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





