రేవంత్‌ ‌రెడ్డికి బండి శుభాకాంక్షలు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 4: ప్రజా జీవితంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌, ‌రేవంత్‌రెడ్డి ఇద్దరూ కూడా కష్టపడి పైకొచ్చినవారే అని అన్నారు. సీఎం రేవంత్‌ 6 ‌గ్యారంటీలు అమలు చేయాలని కోరారు. ‘సర్‌’ ‌పేరుతో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. మజ్లిస్‌తో కుమ్మక్కై హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని కేంద్ర మంత్రి విమర్శించారు. ఇదే జరిగితే తెలంగాణలో హిందువులే మైనారిటీలయ్యే ప్రమాదం ఉందన్నారు. అధికారులకు ప్రభుత్వం సహకరించడం లేదని సంజయ్‌ ‌పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *