నిజామాబాద్ లో కేంద్ర పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా
నిజామాబాద్ లో ఆదివారం కేంద్ర పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా..ఇందూరు రైతు మహా సమ్మేళన సభలో మాట్లాడుతూ పసుపు బోర్డు ప్రారంభించడం నా అదృష్టం పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరింది ప్రపంచంలోని పలు దేశాలకు నిజామాబాద్ పసుపు వెళ్తుంది.. ఇందూర్ రైతుల పోరాటాన్ని గుర్తించిన మోదీ సర్కారు పసుపు బోర్డును ఏర్పాటు చేసిందన్నారు . ఇప్పుడు పసుపు పంటకు నిజామాబాద్ క్యాపిటల్ సిటీ.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.. అని పేర్కొంటూ అనాదిగా నిజామాబాద్ రైతులు పసుపు సాగు చేస్తున్న బయట మార్కెట్లో గుర్తింపు అనుకున్న స్థాయిలో దక్కలేదు..పసుపు బోర్డు ఏర్పాటుతో ఇందూర్ పసుపు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందనుంది…ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్, ఎక్స్ పోర్ట్ పసుపు బోర్డు చేస్తోంది… పసుపు యాంటిబయోటిక్. పసుపు మన దైనందిన జీవితంలో భాగం.. ఇక్కడి పసుపుకి జియో ట్యాగింగ్ చేస్తున్నాం… 2030 లోపు 1 మిలియన్ డాలర్ పసుపు ఎగుమతి ప్రణాళిక చేశాం… పసుపు రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటు చేస్తాం… 2025 లో పసుపుకి రూ.19 వేల ధర వొచ్చింది. రానున్న మూడేళ్లలో పసుపు ధర రూ.6వేల నుంచి రూ.7వేల అధికం కానుంది..బోర్డు ద్వారా పసుపు ఉత్పత్తి కూడా పెరగనుంది.. భారత కో ఆపరేటివ్ బ్రాంచ్, భారత్ కో ఆపరేటివ్ ఎక్స్ పోర్ట్ బ్రాంచీలు ప్రారంభిస్తాం…దేశంలోని పసుపు రైతులకు అభినందనలు తెలియజేసారు.