మొయినాబాద్‌ చెర్రీవోక్స్‌ ఫాంహౌస్‌ కేసు

– ట్రాప్‌హౌజ్‌ పార్టీపై పోలీసుల ముమ్మర దర్యాప్తు

వికారాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబర్ 6 :  మొయినాబాద్‌ చెర్రీవోక్స్‌ ఫాంహౌస్‌ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ట్రాప్‌ హౌస్‌ పార్టీలో ఆర్గనైజర్లు, డీజే ప్లేయర్లు సహా 65 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సమాచారంతో 59 మంది యువతి, యువకులు పార్టీకి వచ్చారు. 22 మంది మైనర్లు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. ఇషాన్‌ అనే యువకుడు పార్టీ నిర్వహించినట్లుగా గుర్తించారు. ఇషాన్‌ ఇటీవలే కెనడా నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రాప్‌హౌస్‌ పేరిట పేజీ క్రియేట్‌ చేశాడు. అక్టోబర్‌ 4న చెర్రీవోక్స్‌ ఫాంహౌస్‌లో పార్టీ నిర్వహించాడు. ఒక్కరికైతే రూ.1,600, జంటగా వస్తే రూ.2,800గా ధర నిర్ణయించాడు. ఇన్‌స్టాలో ఇది చూసిన మైనర్లు పార్టీకి సిద్ధమయ్యారు. మత్తులో జోగుతున్న సమయంలో రాజేంద్రనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. పార్టీలో పాల్గొన్న వారికి నిర్వహించిన డ్రగ్‌ పరీక్షలో ఇద్దరు మైనర్లు గంజాయి తీసుకున్నట్టు నిర్ధరణ అయింది. ఆరుగురు నిర్వాహకులను, 6 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని మొయినాబాద్‌ ఠాణాలో అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page