హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : రాష్ట్రంలో క్యూర్ పరిధి వెలుపల ఉన్న తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లలో కో ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్‌జెండర్లను నియమించనున్నట్టు శాసనసభలో మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. ప్రతి కార్పొరేషన్‌లో ఒకరిని ఎంపిక చేస్తామని తెలిపారు. ఈమేరకు తెలంగాణ మున్సిపల్ చట్టం-2019కి సవరణ కోరుతూ ఆయన బిల్లు ప్రవేశపెట్టారు. సామాజికంగా వివక్ష ఎదుర్కొంటున్న ట్రాన్స్‌జెండర్లను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాలు చేపట్టారని వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





