– గత ప్రభుత్వం పక్కాగా అమలు చేయలేదు
– అందుకే కోర్టుల్లో కేసులు వచ్చాయి
– దీనిపై డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేస్తున్నాం
– ధర్నాలు చేసే వారు పథకాలలో తప్పిదాలపై మాట్లాడాలి
– మీడియా సమావేశంలో మంత్రులు పొన్నం, శ్రీహరి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 17 : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ గ్రీన్ చానెల్ ద్వారా నిధులు విడుదల చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి డియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కళ్యాణ లక్ష్మి పథకంపై వివరించారు. కళ్యాణ్ లక్ష్మీ పథకం పై ఇప్పటివరకు జారీ చేసిన 8 జీవోలను ఒక పిటిషన్ హైకోర్టులో వేసిందన్నారు. అందులో భాగంగా ఈ పథకాన్ని ఆపాలని హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది. దీనిపై డివిజనల్ బెంచ్ కు అప్పీల్ కై వెళుతున్నాము. సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం అని మంత్రి తెలిపారు. ఈ పథంలోని లొసుగులు ఏదైనా ఉంటే అది గత ప్రభుత్వం 2014లో చేసిన పొరపాటు వల్ల తలెత్తినది. అప్పుడు సరైన రీతులో ఉత్తర్వులు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. తమ ప్రభుత్వం త్వరలో గత ప్రభుత్వం చేసిన అన్ని తప్పిదాలను సరిచేసి ఈ పథకం కొనసాగేలా చేస్తామన్నారు. గత ప్రభుత్వం పథకం లోప భూయిష్టమైన జీవోలు ఇవ్వడం వల్లే ఈ పథకం ఇలా అయిందన్నారు. కౌంటర్ ఫైల్ చేయడానికి అధికారుల లోపమా లేదా ప్రభుత్వంలో న్యాయపరమైన అంశాలు చూసే వారి లోపమా అని విచారణ చేస్తున్నాం.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ ప్రజలకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లు పేద కుటుంబాలకు అండగా నిలిచిన సంక్షేమ పథకాలని అన్నారు. పేదింటి ఆడబిడ్డ వివాహ సమయంలో కుటుంబంపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ పథకాల ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. ఈ పథకాలను గత ప్రభుత్వం ప్రారంభించింది. రాజకీయాలకు అతీతంగా పేదల ప్రయోజనం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోంది. పేదలకు నష్టం కలగకుండా న్యాయపరంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ప్రభుత్వం వినియోగిస్తుంది. రాజకీయ పిటిషన్లు పై ఈ పథకం ఎందుకు కొనసాగిస్తున్నారు అని స్టే ఇచ్చింది.. పథకాన్ని ఎత్తివేయలేదు..ఇది గత ప్రభుత్వ పథకం దీనిని ఎత్తివేయాలని మేము ఆలోచన చేయలేదు. గతంలో నిధులు కేటాయింపులకు సంబంధించిన ఇబ్బంది ఉన్న మేము వచ్చిన తర్వాత గ్రీన్ చానెల్ ద్వారా నిధులు విడుదల చేసాం. వాళ్లు చేసిన అప్పులు.. దానిని తొలగించడానికి నిధుల సకాలంలో విడుదల చేయడానికి వ్యవస్థ ఏర్పాటు చేయలేదు.. పేద ల పిల్లల వివాహాలకు సామాజికంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ప్రభుత్వం బాసటగా ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది. 12 తారీకు స్టే విధించింది.. వచ్చే నెల 9 వరకు అవకాశం ఉన్నప్పటికీ అప్పటి వరకు వెయిట్ చేయకుండా కోర్టులో స్టే తొలగించడానికి ముందుకు పోయాం.. రోడ్ల మీద నిరసనలు చేస్తున్న నాయకులకు చెప్తున్న మీరు చేసిన జీవోల వల్లే పథకానికి ఈ పరిస్థితి వచ్చింది. అయినా మేము కొనసాగిస్తున్నాం అన్నారు. బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తారన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, పీసీసీ,మంత్రులు ,ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు , ఎంపీలు, ప్రజా ప్రతినిధులు ,బలహీన వర్గాల నాయకులు ,కుల సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. మొన్ననే ట్యాంక్ బండ్ పక్కన సామాజిక ఉద్యమ నాయకుడు మహాత్మా జ్యోతిబాపూలే సావిత్రి బాయ్ పూలే విగ్రహావిష్కరణ చేసుకున్నామని మంత్రి వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు