భూపాలపల్లి జిల్లాలో దుర్ఘటన

-వాహనాలు తనిఖీ చేస్తుండగా దూసుకొచ్చిన లారీ
-డిటివో వెంకన్న అరక్కడిక్కడే మృతి

జయశంకర్‌ ‌భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 22:‌ జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారులో సోమవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. రవాణా శాఖ కార్యాలయం ఎదుట జిల్లా రవాణా అధికారి డీటీఓ వెంకన్న వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా, బొగ్గు లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి ఆయనపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వెంకన్నకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  వెంకన్న మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *