– కేసీఆర్ సర్కారు ఉంటే రెండేళ్ల కిందటే పూర్తయ్యేది
– సనత్‌నగర్ టిమ్స్ పరిశీలించిన బీఆర్ఎస్ నేత కేటీఆర్
– సనత్‌నగర్ టిమ్స్ పరిశీలించిన బీఆర్ఎస్ నేత కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15 : నగర ప్రజలకు ప్రపంచస్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో ‘టిమ్స’ హాస్పిటల్స్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. గతంలో గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ హాస్పిటల్స్ మాత్రమే ప్రధాన ఆధారమైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యాధునిక టిమ్స్ హాస్పిటల్స్ అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. సనత్‌నగర్ టిమ్స్‌ను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సనత్‌నగర్ టిమ్స్ కోసం 22 ఎకరాల విస్తీర్ణాన్ని వినియోగించామని, అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ ప్రమాణాలతో ‘ఎయిమ్స్’ స్థాయి వైద్యం అందించేలా హాస్పిటల్ నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. కార్పొరేట్ హాస్పిటల్స్‌కు పోటీగా పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం టిమ్స్‌ను తీసుకు వచ్చిందన్నారు. హైదరాబాద్‌లో సనత్‌నగర్, ఎల్బీనగర్, ఆల్వాల్ ప్రాంతాల్లో టిమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. వరంగల్‌లో 2000 పడకలతో ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణంలో ఉందన్నారు. నిమ్స్ హాస్పిటల్‌ను కూడా భారీ స్థాయిలో విస్తరిస్తున్నామని చెప్పారు. సనత్‌నగర్ టిమ్స్‌లో మొత్తం మూడు బ్లాకులు నిర్మించామని తెలిపారు. 300 ఐసీయూ బెడ్స్‌తో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. రోగుల సహాయకుల కోసం ప్రత్యేక ధర్మశాల ఏర్పాటు చేశామని తెలిపారు. రూ.1200 కోట్లతో టిమ్స్ నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ హాస్పిటల్ రెండేళ్ల క్రితమే పూర్తయ్యేది అని వ్యాఖ్యానించారు. 16 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎంఆర్ఐ, సీటీ స్కాన్ సహా అన్ని డయాగ్నస్టిక్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రత్యేక వీఐపీ సూట్స్ కూడా ఏర్పాటు చేశామన్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధులపై ప్రత్యేక పరిశోధనలు జరిగేలా సదుపాయాలు కల్పిస్తున్నట్లు, దేశంలోనే అత్యధిక వైద్య సిబ్బందితో కూడిన ప్రభుత్వ వైద్య వ్యవస్థగా టిమ్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక రీసెర్చ్ బ్లాక్స్, అకడమిక్ సదుపాయాలు కూడా ఉన్నాయన్నారు. భారీ ఆడిటోరియం నిర్మాణం కూడా చేపట్టినట్లు తెలిపారు. ఒకేసారి వెయ్యి కార్లు పార్క్ చేసేలా ఆధునిక పార్కింగ్ వ్యవస్థ ఉందని చెప్పారు. టిమ్స్ హాస్పిటల్ డిజైన్ దేశంలోనే అత్యుత్తమ ప్రభుత్వ వైద్య నిర్మాణాల్లో ఒకటి అని కేటీఆర్ పేర్కొన్నారు. అత్యవసర సేవల కోసం ప్రత్యేక ఎమర్జెన్సీ ర్యాంప్ నిర్మించినట్లు తెలిపారు. లిఫ్టుల పనితీరును వెంటనే మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి ప్రజలకు చేరువలో వైద్యం అందించామని గుర్తుచేశారు. సనత్‌నగర్ టిమ్స్‌లో మిగిలిన నిర్మాణ పనులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
——————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



