“తుమ్మిడిహెట్టి ఎత్తుపెంపు అధ్యాయానికి అధికారుల కమిటీ వేయలేదు. కేంద్ర సంస్థల నివేదిక కోరలేదు.కానీ అనూహ్యంగా రేవంత్ రెడ్డి, ఫడ్నవీస్‌తో భేటీ తర్వాత మహారాష్ట్ర సీఎస్ మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించారు. ఎందుకు.?.నిజానికి మేడిగడ్డ ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్ కాదు.పక్క తెలంగాణ ప్రాజెక్ట్,తెలంగాణ నిర్మించిన ప్రాజెక్ట్..తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ప్రాజెక్ట్.మరీ ఉన్నఫళంగా అందులోనూ రేవంత్ ఫడ్నవీస్‌ను కలిసిన తర్వాత ఎందుకు మేడిగడ్డను సందర్శించారు.గతంతో మహారాష్ట్ర అధికారులు మేడిగడ్డను సందర్శించలేదు. ప్రారంభించినప్పుడు ఆ రాష్ట్ర సీఎం వచ్చినా.. ఏనాడు మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మరాఠ సర్కార్ వేలు పెట్టలేదు. మరీ ఇప్పుడే ఎందుకు..?”
తెలంగాణను విధ్వంసం చేయడం, కేసీఆర్ ను బద్నాం చేయడం, బీఆర్ఎస్ లేకుండా చేయడం గురు శిష్యుల ఎజెండా, వాళ్ళకు రాజకీయ అవసరం కూడా, అందుకే తెలంగాణ ప్రాజెక్టులు, ఆర్థిక కేంద్రమైన హైదరాబాద్ ను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మన ప్రాజెక్టులు పడావ్ పెట్టి ఏపీ నీళ్ళు దోచుకుంది, వ్యవసాయం, విద్యుత్ రంగాన్ని, హైడ్రాతో ఆర్థిక రంగాన్ని విధ్వంసం చేశారు. ఆ కుట్రల పరంపర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల సీఎంలు పక్కా తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ విధ్వంస కర్తలు. ఒకరు రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు కుట్రలు చేసిన ప్రాంతేతర ద్రోహి, ఇంకొకరు తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన ప్రాంతపు ద్రోహి.
కాళేశ్వరం ప్రాజెక్టు సహా ఇతర ప్రాజెక్టులపై గురు శిష్యులు కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ ప్రాజెక్టులను పడావ్ పెట్టే సంకల్పాన్ని సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, సీఎం అసమర్థతతో రాష్ట్రంలోని ప్రాజెక్టులపై రెండు కళ్ళ సిద్దాంతకర్త చంద్రబాబు, బడే భాయ్ చోటే భాయ్ కుట్రలతో తెలంగాణను ఎడారిగా మార్చుతున్నారు.
ప్రజలకు వాస్తవాలు తెలియడంతో జనాగ్రహా తుపాన్ నుంచి ఇంకా ప్రజలు దృష్టిని మార్చే అవకాశం కాంగ్రెస్ కు లేదు. మేడిగడ్డతో పాటు కేసీఆర్, బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేసే చాన్స్ రేవంత్ కు లేదు. దీంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు రేవంత్ తుమ్మిడిహెట్టి తెరపైకి తెచ్చి డైవర్షన్ మొదలు పెట్టారు. తుమ్మిడిహెట్టిపై చర్చలంటూ రెండు రోజులు రేవంత్ అండ్ భజన మీడియా హాడావుడి చేసింది. తీర సీఎం మహారాష్ట్ర టూర్ తో తెలంగాణకు జరిగిన ప్రయోజనం ఏమీ లేదు. చర్చలు సానుకూలమంటూ ప్రచారం చేసుకున్నా , కనీసం సీఎమ్మే, నీటిపారుదల శాఖ మంత్రో ప్రెస్‌మీట్ పెట్ట లేదంటేనే చర్చలు ఎంత సఫలమో అర్థం చేసుకోవచ్చు.సీఎం రేవంత్ మహారాష్ట్రకు వెళ్లింది తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ కోసం కాదు, కాళేశ్వరం ప్రాజెక్ట్, మేడిగడ్డపై కొత్త కుట్రలు చేసేందుకన్న చర్చ తెలంగాణలో జరుగుతుంది. కేసీఆర్‌పై, కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై తెలంగాణ కేంద్రంగా చేసిన కుట్రలన్నీ భగ్నం కావడం, ప్రజలు కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు మహారాష్ట్ర కేంద్రంగా మేడిగడ్డపై కుట్రలు చేసేందుకు వెళ్లారన్న చర్చ మొదలైంది.
కాళేశ్వరం ప్రాజెక్టు సహా గోదావరి మీ, కృష్ణా నదుల్లో తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వొద్దని , కేసీఆర్ సాధించిన అనుమతులు రద్దు చేయాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ఏకంగా కేంద్రానికి, కృష్ణా గోదావరి బోర్డ్‌లకు లేఖలు రాశారు. అయితే ఆ కుట్రలన్నీ ప్రతిపక్షం నిలదీసింది కుట్రలను భగ్నం చేస్తోంది. తాజాగా తెలంగాణలో గానీ, ఏపీ కేంద్రంగా మేడిగడ్డపై, కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై రేవంత్ కుట్రలు చేసే అవకాశం లేకపోవడంతో ఉన్న ఫలంగా తుమ్మిడిహెట్టి డ్రామాలు రక్తి కట్టించినా, రేవంత్ మహా టూర్ వెనుక మేడి గడ్డపై ‘మహా’ కుట్ర ఉందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
రేవంత్ మహారాష్ట్ర టూర్ తర్వాత తెలంగాణలో మహా సీఎస్ మేడిగడ్డ సందర్శన వంటి పరిణామాలు చూస్తుంటే తుమ్మిహెట్టి పేరుతో ముంబై వెళ్లిన రేవంత్.. మేడిగడ్డపై కొత్త కుట్రలు చేశారన్న వాదన బలపడుతోంది. మహారాష్ట్రలో రేవంత్ , ఫడ్నవీస్ భేటీ తర్వాత మరఠా ప్రభుత్వం మేడిగడ్డపై ఫోకస్ పెట్టింది. నిజానికి రేవంత్ రెడ్డి తుమ్మిడిహెట్టిపై మరఠాతో చర్చలకే వెళితే ఫడ్నవీస్ సర్కార్ తుమ్మిడిహెట్టిపై దృష్టిపెట్టాలి. రేవంత్ ప్రచారం చేసుకుంటున్నట్లు చర్చలు సానుకూలంగా జరిగితే తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై మహా సీఎస్ తుమ్మిడిహెట్టి కట్టే సైట్ ను సందర్శించాలి. సాధ్యాసాధ్యాలను అంచన వేయాలి. ఇరు రాష్ట్రాల అధికారుల కమిటీ వేయాలి. కానీ అందుకు భిన్నంగా జరుగుతుంది.
.తుమ్మిడిహెట్టి ఎత్తుపెంపు అధ్యాయానికి అధికారుల కమిటీ వేయలేదు. కేంద్ర సంస్థల నివేదిక కోరలేదు.కానీ అనూహ్యంగా రేవంత్ రెడ్డి, ఫడ్నవీస్‌తో భేటీ తర్వాత మహారాష్ట్ర సీఎస్ మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించారు. ఎందుకు.?.నిజానికి మేడిగడ్డ ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్ కాదు.పక్క తెలంగాణ ప్రాజెక్ట్,తెలంగాణ నిర్మించిన ప్రాజెక్ట్..తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ప్రాజెక్ట్.మరీ ఉన్నఫళంగా అందులోనూ రేవంత్ ఫడ్నవీస్‌ను కలిసిన తర్వాత ఎందుకు మేడిగడ్డను సందర్శించారు.గతంతో మహారాష్ట్ర అధికారులు మేడిగడ్డను సందర్శించలేదు.ప్రారంభించినప్పుడు ఆ రాష్ట్ర సీఎం వచ్చినా.. ఏనాడు మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మరాఠ సర్కార్ వేలు పెట్టలేదు. మరీ ఇప్పుడే ఎందుకు..?
అందులోనూ మేడిగడ్డపై కాంగ్రెస్ కుట్రలన్నీ విఫలమైనప్పుడే, మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి పోయాలని ప్రజల నుంచి డిమాండ్ పెరగడం, కేంద్ర సంస్థలు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ బాగుంది అని చెప్పిన తర్వాత కూడా రేవంత్ నీళ్లు ఎత్తకుండా, రాత్రికి రాత్రే మహారాష్ట్రకు వెళ్లి, ఫడ్నవీస్‌తో ఆ రాష్ట్ర సీఎస్ మేడిగడ్డను సందర్శించారు. ఈ అనుమానాలన్నటినీ విడివిడిగా కాకుండా డాట్ లను కలిపి చూస్తే మహారాష్ట్ర పర్యటనలో మేడిగడ్డపై మహా కుట్ర జరిగిందని స్పష్టం అవుతోంది.
మేడిగడ్డ పై సీఎం రేవంత్ నిర్లక్ష్యం, కుట్రలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఫడ్నవీస్‌తో భేటీ లో మేడి గడ్డపై కుట్రలకు పునాదులు పడ్డాయన్న డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. లేకపోతే మహారాష్ట్ర సీఎం అనుమతి లేకుండానే సీఎస్ మేడిగడ్డ సందర్శనకు వస్తారా..?. తెలంగాణ ఇరిగేషన్ , ఉన్నతాధికారులకు తెలియకుండా ఇతర రాష్ట్రాల సీఎస్ తెలంగాణ ప్రాజెక్ట్‌లను సందర్శిస్తారా..? అందుకు ప్రభుత్వాలు, చట్టాలు ఒప్పుకుంటాయా.?. అసలు సీఎం సమావేశంలో మేడిగడ్డ ప్రస్తావనే ఉన్నట్లు తెలంగాణ సీఎంవో ప్రకటించలేదు. అలాంటప్పుడు తుమ్మిడిహెట్టి వెళ్ళాల్సిన మహారాష్ట్ర సీఎస్ మేడిగడ్డకు ఎలా వచ్చారు.?.
సీఎంలభేటీలో తుమ్మిహెట్టి ముసుగులో మేడిగడ్డపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ కుట్రలు ప్రజలకు తెలియకుండా, ప్రజల దృష్టిని మరల్చేందుకే తుమ్మిడిహెట్టి ఎత్తుపెంపు సానుకూలమ్మ డ్రామాకు చేశారు. మూడేళ్లుగా మేడిగడ్డపై కుట్రలు చేసిన బాబు, రేవంత్ లు తాజాగా మహారాష్ట్రను ఇందులోకిలాగి, ముంబై కేంద్రంగా కుట్రలకు ప్రయత్నాలు చేస్తున్నారా..?.అనే సందేహాలు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర నుంచి మేడిగడ్డకు వచ్చే నీళ్లను మహారాష్ట్ర ఆపుకునేందుకు అనాధికార అనుమతులు ఇచ్చారా అనే ఆందోళన కలిగిస్తోంది. అందుకు సహకారంగా మేడిగడ్డపై కుట్రలు చేయడంతో సహకారం కోరారా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
తెలంగాణ,ఏపీ సమస్యను మహారాష్ట్రకు విస్తరించే కుట్రలతో మేడిగడ్డను మరికొన్నేళ్లు రిపేర్ చేయకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. మహారాష్ట్రను మేడిగడ్డ ఇష్యూలోకి లాగి జఠిలం చేయడమే కాదు, మొత్తం కాళేశ్వరంను ఎన్నేళ్లు పడావ్ పెట్టితే అన్నేళ్లు గోదావరి జలాలు దోపిడీ చేయోచ్చన్న వక్రబుద్దితో ప్రాజెక్ట్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రలు బాబు చేస్తున్నారు.
మరోవైపు చంద్రబాబు నదుల అనుసంధంపై యాక్టివ్ అయ్యారు..కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ నీటి హక్కులను హరించేలా, తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా కుట్రలు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే ఫడ్నవీస్ తో రేవంత్ భేటీలో చంద్రబాబు చేస్తున్న నదుల అనుసంధాన కుట్రలను ఎగ్జిక్యూట్ చేసేందుకే అన్న చర్చ కూడా జరుగుతుంది. కుట్రలను బహిర్గతం చేస్తున్న ప్రతిపక్షం గొంతును ఫార్ములా కేసులు, ఫోన్ ట్యాపింగ్ కేసులంటూ నొక్కే కుట్రలే, కాదు తెలంగాణను నిర్వీర్వం చేసే కుట్రలు గురు శిష్యులు చేస్తున్నారు.
-తోటకూర రమేష్





