కుల రహిత సమాజ నిర్మాణమే అంబేడ్కర్‌ కు నిజమైన నివాళి…!!

భారత రాజ్యాంగ చట్టంలోని పీఠిక, ప్రాథమిక హక్కులను, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సిన  ఆదేశిక సూత్రాలను తుంగలో తొక్కి రాజ్యాంగ సమీక్ష పేరుతో నేటి పాలకులు మనుధర్మ శాస్త్రాన్ని అమలుపరుస్తున్నారు. ఏప్రిల్‌ 14 ‌న భీంరావ్‌ ‌రాంజీ అంబేడ్కర్‌ 135వ జయంతి
మహారాష్ట్రలో ఏప్రిల్‌ 14 , 1891 ‌లో మహర్‌ ‌కులంలో జన్మించి ఉన్నత విద్యావంతుడై సామాజిక, ఆర్థిక, రాజకీయ, తత్త్వశాస్త్రాలలో విశేష ప్రతిభ కలిగిన డాక్టర్  అంబేడ్కర్‌. ‌ఫూలే సిద్దాంతాల పోరాటాన్ని ముందుకుతీసుకొచ్చారు.  డాక్టర్ అంబేడ్కర్‌ తన సమకాలీన దశలో ‘‘ రామరాజ్యం ‘‘ హరిజనోద్దరణ పేరిట దళిత ప్రజలకు జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టి గాంధీతో ఢీకొన్నాడు. షెడ్యూల్‌ ‌కులాలు తెగలకు రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని నిర్మించాడు. దళితుల మంచినీటి హక్కు కోసం 1927 మార్చి 20 న మహాత్తరమైత సత్యాగ్రహ పోరాటాన్ని నడిపాడు. మునుపు తన కాలంలో ఏర్పడిన కులాలను వ్యవస్తీకృతం చేసి అందుకు నియమాలు రూపొందించాడని మనుధర్మం దళిత పీడిత ప్రజా వ్యతిరేకమైనదని హెచ్చరించి మనుస్మృతిని దహనం చేసి కులవ్యవస్థ మీద అన్ని రంగాల్లోనూ దాడి చేయాలని ప్రబ్రోధించాడు ‘‘సాంఘికార్థిక స్వేచ్చలేని రాజకీయ స్వాతంత్య్రం అర్ధరహితమైనదని ఆర్థిక స్యాతంత్య్రం లేని రాజకీయ స్వాతంత్య్రం వైరుధ్యాలను మౌలికంగా పరిష్కరించలేదని’’ భారతీయ సమాజంలో అసమానతల వ్యవస్థ కోనసాగింపు ద్వారా దళితులు పీడనకు గురవుతారని స్పష్టం చేశాడు.

రాజకీయ విప్లవం విజయవంతమైనా సామాజిక రంగాలలో కుల సమస్యను పరిష్కరించకుంటే అదే సమానత్వ సమాజానికి అడ్డంకిగా మారుతుందని సామ్యవాద విప్లవకారులను హెచ్చరించాడు. బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదంతో అంబేడ్కర్‌ దళితులకు విద్యా, ఉద్యోగ ఇతర ప్రజాతంత్ర హక్కుల కోసం కృషి చేశాడు. రాజ్యాంగ సభ ముసాయిదా కమిటీ కి అధ్యక్షుడిగా కీలక పాత్ర వహించాడు
కొలంబియా విశ్వవిద్యాలయంలో ఇంగ్లాండ్ లో జీవించిన కాలంలో ప్రాశ్చాత్య దేశాల బూర్జువా ప్రజాస్వామ్య సిద్ధాంత వేత్తలచే పేరణ పొందిన అంబేడ్కర్‌ స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం సౌభ్రాతృత్వం సిద్ధాంతాల వెలుగులో తన రచనలను కొనసాగించారు. రాజ్యాంగం ద్వారా ప్రజాతంత్ర హక్కులు పొందడం ద్వారా దళితులు విద్య ఉపాధి సమాజం కోసం పాటుపడగలరని ఆశించాడు. మహిళల ఆస్తి హక్కు కోసం ఆనాటి ప్రభుత్వంతో రాజీ పడకుండా న్యాయ శాఖ  మంత్రి పదవికి కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశాడు. ప్రజాస్వామ్యం అంటే సమతా సౌభ్రాతృత్వం వుండే సామాజిక జీవన విధానంగా భావించిన డాక్టర్ అంబేడ్కర్‌ కేవలం రాజ్యాంగం దళితులకు న్యాయం కల్పించదు.. వారి సంఘటిత పోరాట శక్తి మాత్రమే వారి హక్కుల్ని కాపాడుతుందని చెప్పాడు.

‘‘ ఈ రాజకీయ వ్యవస్థలో అసమానతలు కొనసాగితే రాజ్యాంగాన్ని కూలదోల ప్రజలు విముక్తి కోసం పోరాడే హక్కుంటుందని  దళితులకు చెప్పాడు చివరికు హిందూ మత వ్యవస్థలో దళితులకు న్యాయ జరగదని భావించిన అంబేడ్కర్‌ లక్షలాది మంది దళితులతో కలిసి అక్టోబర్‌ 14 1956 ‌నాగపూర్‌ ‌లో బౌద్ధమతం స్వీకరించాడు అంబేద్కర్‌ ‌మార్కిజాన్ని విశ్వసించలేదు. ఉదార ప్రజాస్వామిక రాజకీయ తాత్విక విశ్వాసాలు గలవారు అయితే సామాజిక రంగంలో సకల పీడనలకు వ్యతిరేకంగా పోరాటం నిర్మించి దళితులను సంఘటితం చేసిన ప్రజానాయకుడు హీందూ ఉదార ప్రజాస్వామిక తాత్వికులచే ప్రభావితుడయ్యాడు శ్రేయోరాజ్యం రాజ్యస్వామ్య వాదం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై విశ్వాసం ప్రకటించిన డాక్టర్ అంబేడ్కర్‌ సామాజిక ఆర్థిక న్యాయం కోసం భూములు భారీ ఫ్యాక్టరీలు జాతీయం కావాలని ప్రతిపాదించాడు.
అధికార మార్పడి తర్వాత దేశంలో జరిగిన కొన్ని పరిణామాలు ఆయనకు తీవ్ర అసంతృప్తికి గురి చేశాయి అ క్రమంలోనే  హైందవ బ్రాహ్మణీయ భావజాల ఆధిపత్య ధోరణికి నిరసనగా దళితులతో కలిసి బౌద్ధంలో చేరాడు. దళిత ఉద్యమాలను వర్గ పోరాట ఉద్యమాలుగా మలుచుకోటానికి తాత్విక  సామాజిక రాజకీయ రంగాలలో కృషి సాగించడంపై శ్రద్ధ వహించాల్సి ఉంది. భారతదేశంలో నేడు కొనసాగుతున్న ఫాసిస్టు మతోన్మాద శక్తులపై ప్రజాపోరాటాల దిశగా రూపొందించుకోవాలి. దేశం రాజ్యాంగం అమలులోకి వచ్చి ఏడున్నర దశాబ్దాలు అయిన  దేశంలో ప్రాథమికంగా దళితులకు ఎలాంటి మార్పు జరగలేదు.

సస్య విప్లవం పేరిట జరిగిన మార్పు గ్రామీణ ప్రాంతాలలోని కుల వైషమ్యాలతో సహా అన్ని వైరుధ్యాలను మరింత తీవ్రం చేసింది. దేశంలో మతశక్తులను ఫాసిజం బ్రాహ్మణిజం సామ్రాజ్యవాదాన్ని బద్దలు చేయకుండా ఈ దేశ పీడిత ప్రజలకు ప్రజాతంత్ర సమాజం ఆవిష్కరణ జరగదు గ్రామీణ ప్రాంతాల్లో జరిగే భూ పోరాటాలలో రాజకీయ ఆర్థిక సామాజిక తాత్విక రంగాల్లో జరిగే పోరాటాలలో కుల నిర్మూలన పోరాటం హైందవ  బ్రాహ్మణియ భావజాలానికి సామ్రాజ్యవాద సంస్కృతికి వ్యతిరేకంగా పోరాటం ప్రధానమైనవి కుల పోరాటాలు కుల నిర్మూలన ఆగ్ర కులాల్లోని పేద మధ్యతరగతి ప్రజలను విశ్వసింపజేయాలి కులనిర్మూలన కోసం సామాజిక సమానత కోసం జీవితాలను అంకితం జేసిన సామాజిక దార్శకులు పూలే అంబేడ్కర్‌ ‌ల కృషిని శాస్త్రీయంగా విశ్లేషంచుకోవాలి  సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు నిర్మిస్తూ కుల నిర్మూలన పోరాటాన్ని వాటితో సంఘటిత పరచడం  ద్వారా వర్గ వ్యవస్థను బద్దలు కొట్టగల్గుతాం. అందులో భాగంగానే కుల రహిత సమాజాన్ని నిర్మించగలుగుతాం వీటి కోసం సాగే పోరాటామే  డాక్టర్  అంబేడ్కర్‌ కు  నిజమైన నివాళిగా ఉండగలదని భావించాలి.

స్టాలిన్‌,
‌న్యాయ శాస్త్ర విద్యార్థి
కాకతీయ విశ్వవిద్యాలయం
ఎస్‌ఎఫ్‌ఐ ‌హనుమకొండ జిల్లా అధ్యక్షులు
7416420830
Contactstalinn@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page