దాక్షిణాత్య ఉద్యమం అనివార్యం

మధ్య , దక్షిణ ద్రావిడ భాషాకుటుంబానికి చెందిన తెలుగు, తమిళ, కన్నడ మలయాళ భాషలు స్థూలంగా మాట్లాడే నైసర్గికప్రాంతమంతా అనేక మౌలిక సంక్షోభాలను ప్రస్తుతం ఎదుర్కొంటున్నాయి. భారత రాజ్యాంగంలోని ఫెడరల్ కూర్పును పూర్తిగా మాయం చేస్తూ ‘కేంద్రస్వామ్యం’ ఏర్పాటు యత్నాలతో ద్రావిడ రాష్ట్రాల రాజకీయ ఉనికిని ప్రశ్నార్థకం అవుతోంది. దక్షిణాది కుత్తుకపై వేలాడుతున్న నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ మరో ప్రమాదం. దేశ సమైక్యత పేరిట ఒకే భాష, తిండి, వేషధారణపై ఒత్తిడి వల్ల, మధ్య, దక్షిణ ద్రావిడభాషలు మాట్లాడే విభిన్న సంస్కృతులు ఉన్న ప్రాంతాల వైవిధ్య జీవనంపై పెనుసవాళ్లు ఎదురు అవుతున్నాయి.

ద్రావిడరాష్ట్రాల పర్వతప్రాంతాలన్నీ నూతన అభివృద్ధి నమూనాతో ప్రాజెక్టులు, గనుల తవ్వక కేంద్రాలుగా రూపొందితే నిర్జీవంగా మారే ప్రమాదం ఉంది. గిరిజన వలసలు రానున్నకాలంలో అడ్డు అదుపు లేకుండా పెరిగి,  ద్రవిడ  కుటుంబంలోని అనేక భాషామాండలికాల, సాంస్కృతిక, సామాజిక జీవనం అంతరించే ప్రమాదం ఉంది. దక్షిణాది వైవిద్య జీవన సంస్కృత్రి శైలిపై ఏకశిల సంస్కృతిక దాడి జరుగుతుంది. దక్షిణ భారత రాష్ట్రాలలో చలనశీల సాహితీ సాంస్కృతిక అస్తిత్వ ఉద్యమాలు ఇప్పటికే కొనసాగుతున్నప్పటికీ, మొత్తం ద్రవిడనేలపై గుత్తాధిపత్యం కోసం ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు, ఈ రాష్ట్రాల సాంస్కృతిక, సాహిత్య సమూహాల మధ్య ఓ అనివార్య మైత్రి తక్షణావసరం. కచ్చితమైన తాత్విక పునాదిపై దక్షిణత్యా సాంస్కృతిక, సాహిత్య ఉద్యమం రూపొందితేనే, నిర్దిష్ట అస్తిత్వ  లక్ష్యాల సాధన సమకూరుతుంది. అందుకు ‘మీ పాటనై వస్తున్నానమ్మో’ అంటూ అగ్రేసర గళాన్ని వినిపించాలి.

జహాఆరా          

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *