మిలియన్ ఫాలోవర్స్

స్నేహారెడ్డి కొనకటి

సాహిత్యంతో మీ అనుబంధం ఎలా మొదలైంది?

చిన్నప్పటి నుంచే కథలు, పుస్తకాలు అంటే చాలా ఇష్టం. కొన్ని కథలు చదివితే మనల్ని మనం చూసుకున్నట్టు అనిపించేది. అలా చదువుతూ ఉండగా ఒకరోజు నేనుకూడా ఒకకథ చెప్పాలి” అనిపించింది. ఆ ఆలోచనే నన్ను రచన వైపు తీసుకొచ్చింది.

తొలి నవలకి ప్రేరణ ఏమిటి?

లండన్ కి వచ్చిన తర్వాత ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన డిఫరెంట్ బ్యాక్-గ్రౌండ్స్ ఉన్న చాలా మందిని కలిశాను. వాళ్ల కథలు , కష్టాలు , కలలు విన్నప్పుడు- ప్రతి ఒక్కరి జీవితంలో నేను చేయగలనా అనే ప్రశ్న ఉంటుందని అర్థమైంది. అలా ఒక మనిషి తన అభద్రతాభావాలని దాటి, తన కల కోసం కొత్త దేశానికి వెళ్లి తనని తాను వెతుక్కునే కథ రాయాలనిపించింది. అదే ఈ నవలకు ప్రేరణ.

ఈ నవల గురించి మీరు చెప్పదల్చుకున్నది?

ఈ నవల కలలు, భయాలు, కొత్త ప్రారంభాల గురించి. జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం సులభం కాదు. కొత్తచోటుకి వెళ్లడం, మన కంఫర్ట్ జోన్ వదిలేయడం, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడం ఇవన్నీ ఈ కథలో ఉంటాయి. కానీ చివరికి ఈ కథ చెప్పేది ఒకటే- భయం ఉన్నా కూడా మన కలల కోసం ముందుకు వెళ్లాలి.

ఏం చదువుతున్నారు? ఇంకా ఏం రాస్తున్నారు?

ప్రస్తుతం సెల్ఫ్ గ్రోత్ , ఎమోషనల్ జర్నీస్ ఉన్న నవలలు ఎక్కువగా చదువుతున్నాను. అలాగే కొత్త కథల మీద కూడా పని చేస్తున్నాను. ఇంకా డ్రీమ్స్, రిలేషన్షిప్స్ , హ్యూమన్ ఎమోషన్స్ , గురించి మరిన్ని కథలు రాయాలని ఉంది.

(స్నేహారెడ్డి కొనకటి రాసిన తొలి నవల ‘1 మిలియన్ ఫాలోవర్స్’ 24/ 05/ 2026 తేదీన రామానాయుడు ప్రివ్యూ థియేటర్, హైదరాబాద్ లో ఆవిష్కరణ జరుగుతుంది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *