స్వాతంత్య్రం పోరాటంలో ముస్లింల త్యాగాలు మరువలేం..

ఇంక్విలాబ్‌ ‌జిందాబాద్‌, ‌క్విట్‌ ఇం‌డియా,
డూ ఆర్‌ ‌డై నినాదాలు ముస్లిం నాయకులవే..
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
రవీంద్ర భారతిలో ‘బ్లడ్‌ ‌స్పీక్స్ ‌టూ’ పుస్తక ఆవిష్కరణ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5 : ‌స్వాంతంత్య్ర  ఉద్యమంలో ముస్లింల పోరాటాలు త్యాగాలను ఎన్నటికీ మరువలేనివని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దేశ  స్వాతంత్య్రం సంగ్రామంలో ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన ముస్లింల చరిత్రను మరుగునపడేయాలని కొంతమంది కుట్ర చేస్తున్నారని అయన విమర్శించారు.
హైదరాబాద్‌ ‌రవీంద్రభారతిలో జరిగిన  ‘బ్లడ్‌ ‌స్పీక్స్ ‌టూ’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ, రాచరిక పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాట ంలో ముస్లింలు పాల్గొన్నారని తెలిపారు. కుల, మత, వర్గ రహితంగా పోరాడితేనే దేశానికి స్వతంత్రం వొచ్చిందని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందన్నారు. ప్రేమను పంచుతూ లౌకికవాదంతో అందరం జీవి ద్దామని కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ ‌వరకు రాహుల్‌ ‌పాదయాత్ర చేశారనితెలిపారు. వనరులు, రాజకీయ, ఆర్థిక అవకాశాలు జనాభా దామాషా ప్రకారం అందరికీ సమానంగా పంచాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో కులగణన చేస్తున్నామని తెలిపారు.

దేశంలో లౌకికవాదాన్ని నిలబెడుతూ పోరాటం చేస్తున్న కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌కు అండగా ఉందామని పిలుపు నిచ్చారు.
అనేక కులాలు, మతాలు, వర్గాల ప్రజలు సమిష్టిగా పోరాడి తెచ్చుకున్నదే స్వతంత్ర భారతదేశమని, స్వతంత్ర సంగ్రామంలో ముస్లిం నాయకులు చేసిన పోరాటాలు, త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. రాజకీయ అధికారం కోసం, పాలన తమ చేతుల్లో ఉండాలని, చరిత్రలో భాగస్వామ్యం కాని వారు నేడు ఈ దేశాన్ని చేతుల్లోకి తీసుకొని భారత రాజకీయ ముఖచిత్రాన్ని కలుషితం చేస్తున్నారని విమర్శించారు.  నేటి ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు ప్రముఖ రచయిత, రాజకీయ విశ్లేషకుడు సయ్యద్‌ ‌షానవాజ్‌ ‌ఖాద్రి బ్లడ్‌ ‌స్పీక్స్ ‌టూ పుస్తకం తీసుకురావడం అభినం దనీయమన్నారు. స్వతంత్ర పోరాటంలో కుంచిత బుద్ధితో ఆలోచించి ఉంటే, సర్వసత్తాక, లౌకిక, స్వతం త్ర భారతదేశం ఏర్పడి ఉండేది కాదని, సమష్టి పోరాటంతోనే దేశానికి స్వేచ్ఛ లభించిందన్నారు. నాటి పోరాట చరిత్రను కొంతమంది వక్రీకరిస్తూ చేస్తున్న ప్రచారం బాధిస్తోందని, మనసులను గాయపరు స్తుందన్నారు.

భారతరత్న అవార్డు గ్రహీత ఖాన్‌ అబ్దుల్‌ ‌గఫార్‌ ‌ఖాన్‌ 1910‌లో ఆజాద్‌ ‌నేషనల్‌ ‌స్కూల్‌ ‌స్థాపించి వేలాది మందిని  స్వతంత్ర ఉద్యమం వైపు నడిపించారన్నారు. భారత రాష్ట్రపతిగా పనిచేసిన ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ ‌లండన్‌ ‌లో చదువుకొని న్యాయవాదిగా స్థిరపడిన ఆయన ఈ దేశానికి వొచ్చి 1940 నుంచి 42 వరకు జరిగిన జాతీయ ఉద్యమంలో కీలక పాత్ర పోషిం చారని, 1942 నుంచి 45 వరకు జైలు జీవితం అనుభవించాడని గుర్తు చేశారు. మౌలానా హస్రత్‌ ‌మోహాని ఇచ్చిన ఇంక్విలాబ్‌ ‌జిందాబాద్‌ అనే నినాదం భగత్‌ ‌సింగ్‌ ‌ని ప్రభావితం చేసి పార్లమెంటులో బాంబు వేసి దాకా తీసుకువెళ్లిందని వివరించారు. క్విట్‌ ఇం• •యా, డుఆర్‌డై నినాదాన్ని సోషలిస్టు రచయిత యూసుఫ్‌ ‌మెహర్తి ఇచ్చారని చెప్పారు. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా ఉజ్వల భవిష్యత్తుకు ప్రణాళికలు వేసిన మౌలానా అబుల్‌ ‌కలాం ఆజాద్‌, ‌మౌలానా అలీ అహ్మద్‌, ‌మౌలానా షౌకత్‌ అలీ, జాకీర్‌ ‌హుస్సేన్‌ ‌వంటి మహనీయులు దేశ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నా రని తెలిపారు.

అదేవిధంగా తెలంగాణలో జరిగిన నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించిన షోయబుల్లాఖాన్‌, ‌షేక్‌ ‌బందగీల త్యాగం దాచేస్తే దాగని సత్యం అన్నారు. దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన వారిది ఏ కులమైనా, ఏ మతమైనా వారిని పూజించాలి, ఆరాధించాలని అన్నారు. కుంచిత భావంతో ఆలోచిస్తూ, దేశాన్ని విభజించి పరిపాలన చేయాలని చరిత్రలో భాగస్వామ్యం లేని వారు నేడు చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టడానికి కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ ‌వరకు రాహుల్‌ ‌గాంధీ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు.అందరికీ సమాన అవకాశాలు హక్కులు కల్పించిన భారత రాజ్యాంగాన్ని మార్చాలని కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తోం దని దీనికి వ్యతిరే కంగా రాహుల్‌ ‌గాంధీ నిర్విరామంగా పోరాటం చేస్తున్నారని పేర్కొ న్నారు. రాహుల్‌ ‌గాంధీ చేస్తున్న పోరా టానికి అందరం అండగా ఉండి మద్దతు పలుకు దామన్నారు. రాష్ట్రంలో కూల గణన నిర్వహిస్తున్నదని, ఇందులో ముస్లిం మైనార్టీలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. కులగణన సర్వే ద్వారా వొచ్చిన నివేదికల ప్రకారం ప్రజా ప్రభుత్వం భవిష్యత్తులో రాజకీయ ఆర్థిక సమాన అవకాశాలు కల్పించడానికి నిర్ణయాలు తీసుకోబోతుందని వెల్లడిం చారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ ‌బోర్డ్ ‌చైర్మన్‌ ‌సయ్యద్‌ అస్మతుల్లా హుసేని, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ‌రియాజ్‌, ‌మైనార్టీ కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ఒబేదుల్లా కోత్వాల్‌, ఆర్గనైజింగ్‌ ‌కమిటీ కన్వీనర్‌ ఎం.‌డి జావీద్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page