సంక్షేమం లేదు.. అంతా సంక్షోభమే

– దండుపాళ్యం బ్యాచ్‌ ‌రాష్ట్రాన్ని దోచుకుంటోంది
– జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధి సున్నా
– ‘సర్‌’పై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాల్సిందే
– పాలేరు నియోజకవరన్గ బూత్‌ ‌కార్యకర్తల భేటీలో కేటీఆర్‌ 

ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్‌ 17: ‌రాష్ట్రంలో సంక్షేమం లేదు.. ఎక్కడ చూసినా కూల్చివేతలే అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు. దండుపాళ్యం ముఠాకు అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అయితే ఇక్కడ మంత్రులు ఆయనను మించిపోయారంటూ దుయ్యబట్టారు. రెవెన్యూ మంత్రి అవినీతికి హద్దు లేకుండా పోయిందని ఆరోపించారు. పాలేరు నియోజకవర్గం వెంకటగిరిలో బూత్‌లెవల్‌  ‌కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ‌మాట్లాడుతూ కేసీఆర్‌ ‌మళ్లీ రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వచ్చేది బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వమేనని, కేసీఆర్‌ ‌సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయం సంక్షోభంలో ఉంటే పట్టించుకున్న దిక్కు లేదని విమర్శించారు. ఆర్థిక మంత్రి కమీషన్లకు, అక్రమాలకు అంతు లేదన్నారు. రాష్ట్రంలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, వారికి కనీసం యూరియా ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. కేసీఆర్‌ ‌అప్పు  చేసింది కాళేశ్వరం, భక్తరామదాసు, తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసమమేన‌ని స్పష్టం చేశారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. దాచుకోవడం దోచుకోవడం తప్ప జిల్లా అభివృద్ధికి వారు పాటుపడింది లేదని, స్వార్థ ప్రయోజనాల కోసమే పాలన కొనసాగిస్తున్నారర‌ని ఆరోపించారు. ఒక మంత్రి భూముల కబ్జాలకు పాల్పడుతుంటే, మరో మంత్రి వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టారన్నారు. ఇక ఆర్థిక మంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేశారని విమర్శించారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రెండున్నర ఏళ్లలో లక్షల కోట్లు అప్పుచేసి ఏమి అభివృద్ధి చేసిందో రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారన్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి భూ దందాలకు పాల్పడుతూ అనేక అక్రమాలకు ఊతమిస్తున్నారన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలను వేదికపై ప్రదర్శించారు.

మనం జాగ్రత్తగా ఉండాలి

బూత్‌ల వారీగా బలమైన కార్యకర్తల నిర్మాణం జరగాలని కేటీఆర్‌ అన్నారు. ఈనెల 25 నుంచి వచ్చే నెల25 వరకూ ‘సర్‌’ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రతి బూత్‌లో బీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు ప్రతి ఒక్క అంశాన్ని ప్రస్తావించాలని సూచించారు. ఇది చాలా కీలకమైన సమయమని, ఒక్క వోటు కూడా పోకుండా చూసుకోవాలన్నారు. నిజాయతీగా ఎన్నికలు జరిగితే కేసీఆర్‌ ఈరోజు 100 సీట్లతో గెలుస్తారు.. నిజాయతీగా గెలవాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి అంటూ కార్యకర్తలకు కేటీఆర్‌ ‌సూచించారు. ప్రతి బిఎల్‌ఎ అ‌ప్రమత్తంగా ఉండాలన్నారు. అర్హత గల వ్యక్తుల ఓటర్లు తొలగించకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో దిశా నిర్దేశం చేశారు. డిజిటల్‌ ‌సభ్యత్వ నమోదులో యువత క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. కేటీఆర్‌ ‌కు హెలీప్యాడ్  ‌వద్ద, సభా ప్రాంగణం వద్ద కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌ ‌కుమార్‌, ఎం‌పీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తక్కలపల్లి రవీందర్రావు, తాతా మధుసూదన్‌, ‌మాజీ ఎమ్మెల్యేలు మెచ్చ నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, డోర్నకల్‌ ‌మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌, ‌జిల్లా పరిషత్‌ ‌మాజీ అధ్యక్షుడు లింగాల కమల్‌ ‌రాజ్‌, ‌రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్‌ ‌రెడ్డి, దిండిగాల రాజేందర్‌, ‌మరికంటి ధనలక్ష్మి, నియోజకవర్గంలోని నాలుగు మండలాల పార్టీ మాజీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్‌, ‌భాషపోయిన వీరన్న, పున్నం బ్రహ్మయ్య, వేముల వీరయ్య పాల్గొన్నారు


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *