– ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ఆగ్రహం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17: గురుకుల పాఠశాలల టెండర్లలో రూ.2,000 కోట్ల భారీ కుంభకోణం జరిగిందంటూ బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. సంక్షేమ శాఖల్లో మొత్తం టెండర్ల విలువే రూ.2 వేల కోట్లు లేనప్పుడు అంత మొత్తంలో స్కాం జరిగిందని ఎలా అంటారని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా బలహీనవర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తున్న శాఖలపై విమర్శలు చేయడం సరికాదన్నారు. హరీశ్‌రావు వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, వాటిని నిరూపిస్తే ప్రభుత్వం దేనికైనా సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. రాజకీయ లబ్ది కోసం నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. బలహీనవర్గాల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, అలాంటి వర్గాలను మాటలతో కించపరచే ప్రయత్నాలు చేయొద్దని హితవు పలికారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఆరోపణలు చేస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని పొన్నం హెచ్చరించారు. కాగా, బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగించే లక్ష్యంతోనే ‘సర్’ పక్రియను తీసుకొచ్చినట్లు వ్యాఖ్యానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.