మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, మే 16: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఓ దుర్మార్గుడి ప్రేమకు యువతి బలి అయింది. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. జడ్చర్లలో ప్రైవేటు స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న యువతిని కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్న ప్రేమోన్మాది శనివారం బస్సు దిగి వెళ్తున్న సమయంలో ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన యువతిని హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. తన ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతోనే నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. దీంతో అతడిని స్థానికులు పట్టుకుని చితకబాదారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


