కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

•మహిళా సంఘాలకు ఏడాదికి రెండు ఖరీదైన చీరలు
•అన్ని రంగాల్లో మహిళలకు ప్రోత్సాహం
•శుభవార్త చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి
•నారాయణపేట జిల్లాలో  మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో తొలి పెట్రోల్‌ ‌బంక్‌ ‌ప్రారంభం

మహబూబ్‌ ‌నగర్‌, ‌ప్రజాతంత్ర  ఫిబ్రవరి 21 :అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహిం చడమే తమప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వంలో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. తమ పాలనలోనే మహిళలు ఆత్మగౌరవంతో బతుకుతారని ప్రగాఢంగా నమ్ముతున్నా మన్నారు. బీపీసీఎల్‌ ‌కంపెనీ సహకారంతో నారాయణపేటలో శుక్రవారం మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నడిచే పెట్రోల్‌ ‌బంక్‌ను సీఎం రేవంత్‌ ‌రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ..  దేశంలోనే తొలిసారి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్‌ ‌బంక్‌ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. తమ సర్కారు మొదటి ప్రయారిటీ మహిళలే అన్నారు. వారు ఆత్మగౌరవంతో ఉండటమే తమకు కావాల న్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా స్వయం సహాయక సంఘాలను పునరుద్ధరించామని, తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయ డమే తమ  లక్ష్యమని స్పష్టం చేశారు.

అన్ని రంగాల్లో మహిళలలకు ప్రభుత్వం ప్రోత్స హం అందిస్తోందని, 600 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశాం. వెయ్యి మెగావాట్ల సోలార్‌ ‌ప్లాంట్లు ఏర్పాటు చేసేలా మహి ళలకు అవకాశాలు కల్పిస్తున్నాం.  గమహి ళా స్వయం సహాయక ఉత్పత్తులను మార్కె టింగ్‌ ‌చేసుకోవడానికి శిల్పారామం వద్ద స్టాల్స్ ఏర్పాటు చేసి ఇచ్చాం. త్వరలోనే మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి రెండు చీరలు కానుకగా ఇవ్వనున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ప్రకటించారు. సొంత ఆడ బిడ్డలకు అందించినట్లు నాణ్య మైన చీరలను అందిస్తామని, రూరల్‌, అర్బన్‌ అనే తేడా లేదు.. తెలం గాణలో మహిళలంతా ఒక్క టే.. అవసరమైతే కేంద్రం నుంచి నిధులు తెచ్చు కుందా మన్నా రు.

ఎంపీ డీకే అరుణ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు సహక రించాలని సీఎం రేవంత్‌ ‌కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళల అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని, పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నిధులు మేం ఇస్తాం.. నిర్వహణ మీరు చేయండి అని అన్నారు.గుడిలా బడిని పవిత్రంగా చూసుకోవాలి గుడిని ఎంత పవిత్రంగా నిర్వహిం చుకుంటామో బడిని కూడా అలాగే నిర్వహించుకోవాలని సీఎం రేవంత్‌ ‌రెడ్డి సూచించారు. నారాయణపేట జిల్లా అప్పక్‌ ‌పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి శంకుస్థాపన చేశారు.

అప్పక్‌ ‌పల్లిలో లబ్ధిదారు బంగలి దేవమ్మకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, సిఎం సలహాదారు వెం నరేందర్‌ ‌రెడ్డి, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు తదితరులు హాజరయ్యారు.నారాయణ పేట మెడికల్‌ ‌కాలేజీ లో విద్యార్థులతో ముఖాముఖినారాయణ పేట మెడికల్‌ ‌కాలేజీ లో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పాల్గొన్నారు. మారుమూల ప్రాంతంలో ఒక మెడికల్‌, ‌పారామెడికల్‌, ‌నర్సింగ్‌ ‌కాలేజీ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గతంలో కేంద్రం తిరస్కరించినా.. తమ మంత్రి, అధికారులు తీవ్రంగా ప్రయంత్నించి ఎనిమిది మెడికల్‌ ‌కాలేజీలకు అనుమతి తీసుకొచ్చారని తెలిపారు. మా ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.

కాలేజీలో పూర్తి స్థాయి మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. వీటిని మీరు సద్వినియోగం చేసుకోవాలి. నిజమైన పేదవాడికి సంక్షేమం చేరినప్పుడే అభివృద్ధి జరిగినట్లు అని బాబా సాహెబ్‌ అం‌బేద్కర్‌ ‌చెప్పారు. మీ అవసరాలపై అవగాహన ఉన్నవారే మీ ఎమ్మెల్యేగా ఉన్నారు పేదలకు విద్య అందుబాటులోకి తీసుకరావడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. డాక్టర్‌ ‌వృత్తి ఒక ఉద్యోగం కాదు%•% ఒక బాధ్యత మీరంతా గొప్ప డాక్టర్లుగా రాణిస్తే రాష్ట్రానికి మంచి సేవలు అందించగలరు. యాభై ఏళ్లు ఇక్కడి ప్రజలకు సేవలందించిన చిట్టెం నర్సిరెడ్డి పేరు ఈ కాలేజీకి పెట్టడం సముచితం అని తాను భావిస్తున్నానని సీఎం రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు.

శంకుస్థాపనల వివరాలు
నారాయణ పేట మెడికల్‌ ‌కాలేజీ లో వివిధ భవనాల నిర్మాణాలకు, పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.   రూ.130 కోట్లతో నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాల, హాస్టల్‌ ‌నిర్మాణం, రూ.200 కోట్లతో యంగ్‌ ఇం‌డియా ఇంటిగ్రేటెడ్‌ ‌రెసిడెన్షియల్‌ ‌స్కూల్స్ ‌కాంప్లెక్స్, ‌రూ.26 కోట్లతో ప్రభుత్వ నర్సింగ్‌ ‌కళాశాల, రూ.40 కోట్లతో 100 పడకల యూనిట్‌ ‌కు రూ.296 కోట్లతో తుంకిమెట్ల నారాయణపేట రోడ్‌, ‌కొత్తకొండ మద్దూర్‌ ‌రోడ్‌ అభివృద్ధి పనులకు, అప్పకపల్లి గుండామల్‌ ‌రోడ్‌, ‌మద్దూర్‌ ‌లింగాల్‌ ‌చెడ్‌ ‌రోడ్‌ ‌లలో హై లెవెల్‌ ‌బ్రిడ్జిల నిర్మాణానికి
సీఎం రేవంత్‌ ‌రెడ్డి  శంకుస్థాపనలు చేశారు. అలాగే రూ.193 కోట్లతో గుల్బర్గా కొడంగల్‌, ‌రావులపల్లి మద్దూరు, కోస్గి దౌలతాబాద్‌ ‌రోడ్ల అభివృద్ధి పనులకు, రూ.12.70 కోట్లతో నారాయణపేట నియోజకవర్గంలో సిఆర్‌ఆర్‌ ‌రోడ్లకు సీఎం శంకుస్థాపనలు చేశారు.

ప్రారంభోత్సవాలు..
రూ.56 కోట్లతో నిర్మించిన మెడికల్‌ ‌కళాశాల అకడమిక్‌ ‌బ్లాకులను ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ప్రారంభించారు. అలాగే  రూ.5.58 కోట్లతో నిర్మించిన ధన్వాడ, నారాయణపేట రూరల్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌భవనాలను,  రూ.1.23 కోట్లతో జిల్లా మహిళా సమాఖ్య నిర్వహించే పెట్రోల్‌ ‌బంక్‌ ‌ను,  రూ.7 కోట్లతో మరికల్‌ ‌మండల పరిషత్‌ ఆఫీస్‌ ‌కాంప్లెక్స్ ‌భవనాన్ని సీఎం రేవంత్‌ ‌రెడ్డి ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page