- డిజిటల్ వసతులతో బోధన సులభం
- చదువుల విప్లవం డిజిటల్ టెక్నాలజీ తో సాధ్యం..!
కాలం మారుతుంది, కాలానికి అను కూలంగా విద్యలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి. రోజు రోజుకు విద్యార్థుల్లో కూడా కాంపెటీషన్ పెరుగుతుంది. దాన్ని అధిగమి ంచడా నికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియో గిస్తు న్నారు అధ్యాపకులు. ఇలా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలు మొదలుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలకు కూడా డిజిటల్ తరగతులతో బోధన చేపట్టి, విద్యార్థుల్లో నైపుణ్యాలను అలవరుస్తున్నారు. కొరోనా సమయంలో కూడా ఈ డిజిటల్ తరగతుల కీలకంగా పని చేశాయి.గూగుల్, జూమ్ యాప్ ద్వారా ఇంటి దగ్గర ఉన్నటువంటి పిల్లలకు సైతం పాఠాలు బోధించారు.ఈ విధంగా ఆన్లైన్ క్లాసులకు ఆజ్యం పోయడం జరిగింది.ఇలా పాఠశాల,కళాశాల విద్యార్థులకు ఇంట్లోనే పాటలు వినేటువంటి పరిస్థితి కలిగింది.ప్రైవేటు పాఠశాలలే కాకుండా ప్రభుత్వ, ప్రాథమికోన్నత,ఉన్నత పాఠశా లలో కూడా విద్యార్థులకు సులభతరంగా విద్యా బోధనలు అందించడానికి పలు రకాలుగా పాఠాలను బోధిస్తున్నారు.
అందులో సులభతరంగా విద్యాబోధన చేయడానికి ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్ బోర్డులు ఏర్పాటు చేయడంతో ప్రభుత్వ పాఠశాల తరగతి గదుల్లో డిజిటల్ విప్లవం వచ్చింది అనడంలో అతిశయోక్తి లేదు.విద్యార్థులకు సులభతరంగా పాఠ్యాం శాలు బోధించడానికి ఎంతగానో ఉపయోగ పడుతుంది. విద్యలో సాంకేతిక పురోగతి కోసం పాఠ శాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఐక్యంగా నిలబడి, అధ్యాపకులు సైతం అండగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది.అందుకోసం అధ్యా పకులకు నూతన టెక్నాలజీని కూడా బోధిస్తు న్నారు.సాంకేతిక విప్లవం ఇంకా వెనుకబడి ఉన్న అనేక పాఠశాలలు,కళాశాలలు,విశ్వవిద్యాలయాలలో ప్రధాన సవాళ్లు ఉన్నాయి.ఉపాధ్యాయులు తరగతి గదిలో ఆధునిక విద్యా సాధనాలను ఉపయోగించడానికి వెనకాడతారు. అలా వెనకాడకుండా ఉండడానికి , సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించడానికి, వారికి సరైన శిక్షణ ఇస్తున్నారు. గతంలో వనరులు, మౌలిక సదుపాయాలు మరియు కనెక్టివిటీ లేకపోవడం వల్ల తరగతి గదులకు ఇంత సుసంపన్నమైన సాంకేతికత అందుబాటులో లేకుండా పోయింది.కానీ ప్రస్తుతం అలాంటి ఇబ్బంది ఏమీ లేదు.
భారతదేశం డిజిటల్ మయమైంది.వేగవంతమైన సాంకేతిక పురోగతి యుగంలో మన పట్టణ కేంద్రాలు అభివృద్ధి చెందుతున్నందున,మన నగరాలు మరియు గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న విస్తారమైన విద్యా అంతరాన్ని తగ్గించడంపై మనం దృష్టి పెట్టవలసిన సమయం ఆసన్నమైంది.ప్రపంచీకరణ ద్వారా గుర్తించ బడిన యుగంలో, ఏ బిడ్డ అయినా, వారి భౌగోళిక అక్షాంశాలతో సంబంధం లేకుండా, నాణ్యమైన విద్యకు దూరంగా ఉండకూడదనే ఉద్దేశం తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య పై ఎక్కువ నిధులు కేటాయిస్తూ, అందులో చదువుతున్నటువంటి విద్యార్థు లకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి విద్యను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ తరగతి గదుల పరిచయం ఆశాకిరణంగా ఉద్భవి ంచింది.ఈ వినూత్న సెటప్‌లు మన దేశంలోని మారు మూల ప్రాంతాలలోని విద్యార్థులకు సాధికారతను కల్పిస్తాయి. దృశ్య అభ్యాస అనుభవాలు మరియు ఇంట రాక్టివ్ వాతావరణాల ద్వారా మెరుగైన అవగా హనను అందిస్తాయి.గ్రామీణ విద్యలో సాంకేతికతను సమగ్రపరిచే మార్గంలో సవాళ్లు లేకుండా లేవు. పరిమిత మౌలిక సదుపాయాలు మరియు అనియత విద్యుత్ సరఫరా నుండి డిజిటల్ అక్షరాస్యత అడ్డం కులు వరకు,అడ్డంకులు అనేకం ఉన్నాయి.
అన్నింటిని అధిగమిస్తూ విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, బ్యాగులు ఇలా అన్ని సమకూర్చుతూ మరోపక్క బోధన పద్ధతుల్లో కూడా వినూత్న పద్ధతులు పాటించేలా అనేక విద్యా ప్రమాణాలను పాటిస్తూ, గురుకులాలలో విద్యార్థుల సంఖ్యను పెంచుతుంది.కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చి దిద్దడం జరిగింది. కంప్యూటర్ ల్యాబ్ తో పాటు, ట్యాబు ద్వారా, బై జ్యూస్ కంటెంట్ విద్యార్థులకు బోధించేం దుకు ప్రతి తరగతి గదిలో ఐ ఎఫ్ ప్యానల్, స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేసి విద్యను అందిస్తున్నారు. ప్రొజెక్టర్ ద్వారా లైవ్ క్లాస్ లను కూడా అందుబాటులోకి తేవడం జరిగింది.విద్యార్థికి ఏదైనా అర్థం కానప్పుడు అడిగే విధంగా కూడా ఉండి, వారికి వచ్చిన డౌటును క్లారిఫై చేసుకోవడం జరుగుతుంది. విద్యార్థుల ఆదరణ సైతం డిజిటల్ పద్ధతుల ద్వారానే తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా పాఠశాల విద్యార్థుల్లో మెరుగైన ర్యాంకులు రావడం, కళాశాల విద్యార్థులు నీట్, ఐఐటి వంటి పోటీ పరీక్షలలో మంచి ర్యాంకులు సాధించడం, విశ్వవిద్యాలయాలలో చదువు కునేటువంటి డిగ్రీ, పిజి,పిహెచ్ డి విద్యార్థులు సైతం వారికి తెలియని విషయాలను సైతం తెలుసు కుంటూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుం టున్నారు.ఈ విధంగా కొరోనా సమయంలో ఇంట్లోనే ఉండి విద్యను నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో సైతం ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు బోధిస్తున్నారు.
20వ శతాబ్దపు 3వ పారిశ్రామిక విప్లవం ఇంటర్నెట్ మరియు ఆటోమేషన్ టెక్నా లజీలను తీసుకువచ్చింది. డిజి టల్ టెక్నాలజీల విస్తృత విని యోగం కారణంగా, దీనిని డిజిటల్ విప్లవం అని కూడా పిలు స్తారు. కొత్త డిజిటల్ టెక్నా లజీల సహా యంతో ప్రస్తుత వ్యాపార ప్రక్రియలను మెరు గుపరిచే ప్రక్రియను డిజి టలైజేషన్ అంటారు. 20వ శతాబ్దంలో కంప్యూటర్లు విస్తృతంగా వాడుకలోకి వచ్చిన తర్వాత ఇది ప్రారంభమైంది. ఇంతకుముందు భారత్ లో ఎంతో మంది విద్యార్థులు పలు రకాల కారణాలతో అర్దాంత రంగా చదువుకు దూరం అయ్యేవారు. వారికోసం వారు చదువు కొనసాగించడానికి విశ్వవిద్యాలయంలో ఈ డిజిటల్ ఆన్లైన్ తరగతులు ఎంతగానో తోడ్పడుతుంది. ఇవే కాకుండా సీట్లు పొందినటువంటి విద్యార్థులు డిజిటల్ ద్వారా తమకు నచ్చిన విశ్వవిద్యాలయంలో గాని, విద్యాలయాలలో గాని, సంక్షేమ గురుకులాల్లో సీట్లు పొందుతున్నారు. ఈ విధంగా విద్యార్థులకు ఆన్లైన్ కోర్సులు విస్తృతంగా అందుబాటులోకి రావడం, ఆన్లైన్ కోర్సులను అందిం చడానికి కేంద్రం ఆధ్వర్యంలో 2016లో మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ వేదిక ఏర్పాటు చేశారు.
రాబోయే రోజులలో అంతర్జాతీయ విద్యా సంస్థలతో డిజిటల్ పాఠాలను అందించినట్లయితే ఎంతగానో ఉపయో గపడుతుంది. అటువంటి పరిస్థితిని కొరోనా సమ యంలో చూసాం.ఇప్పుడు మళ్లీ వాడడం జరుగు తుంది. ఏది ఏమైనాప్పటికీ డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఇలా ఇంటర్నెట్ సౌకర్యం కలిగి ఉండి, విద్యార్థులకు మెరుగైన సేవలు అందిస్తున్నటువంటి గురుకులాలు, పాఠశాలలు ఉన్నత ప్రమాణాలు పాటించడమే కాకుండా వారిని సమాజంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతున్నారు అధ్యాపకులు. వివిధ రంగాలలో ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే కాకుండా,అణగారిన వర్గాలను ఉన్నతీకరించడానికి మరియు వివిధ సామాజిక వర్గాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం పై దృష్టి సారించాయి. ఈ విధంగా విద్యార్థులు,అధ్యాపకులు, డిజిటల్ వ్యవస్థలను ఉపయోగించి, వాటితో బోధించి, ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శప్రాయులుగా నిలుస్తు న్నారు.
డా. మోటె చిరంజీవి
సామాజికవేత్త విశ్లేషకులు
9949194327