అనర్హతపై స్పీకర్‌దే తుది నిర్ణయం

తగిన సమయంలో నిర్ణయం తీసుకునే అధికారం
ఐదేళ్ల అసెంబ్లీ కాలం దృష్టిలో పెట్టుకోవాలని సూచన
నాలుగు వారాల గడువు పెడుతూ ఇచ్చిన తీర్పు కొట్టివేత
అనర్హత పిటిషన్‌పై హైకోర్టు సిజె ధర్మాసనం సంచలన  తీర్పు

హైదరాబాద్‌, ‌నవంబర్‌ 22 (ఆర్‌ఎన్‌ఏ): ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై షెడ్యూలు ఖరారు చేయాలంటూ సింగిల్‌ ‌జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సీజే ధర్మాసనం కొట్టేసింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించింది. నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌దేనని కూడా స్పష్టం చేసింది. 10వ షెడ్యూల్‌ ‌ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, ఐదేళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో ఉంచుకొని స్పీకర్‌ ‌నిర్ణయం తీసుకోవాలని సూచించింది. బీఆర్‌ఎస్‌ ‌తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్‌ ‌కాంగ్రెస్‌లో చేరడంతో వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్‌  ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కె.పి.వివేకానంద్‌లు పిటిషన్లు దాఖలు చేశారు. వీటితోపాటు దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మరో పిటిషన్‌ ‌దాఖలు చేశారు.

అనర్హత పిటిషన్‌లను స్పీకర్‌ ‌స్వీకరించకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబరు 9న దీన్ని విచారించిన సింగిల్‌ ‌జడ్జి.. 4 వారాల్లో అనర్హత పిటిషన్‌లపై షెడ్యూలు ఖరారు చేయాలని తీర్పు వెలువరించారు. సింగిల్‌ ‌జడ్జి తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అసెంబ్లీ కార్యదర్శి వి. నరసింహాచార్యులు దాఖలు చేసిన అప్పీళ్లపై ఇటీవల వాదనలు ముగియగా తీర్పును వాయిదా వేసింది. తాజాగా స్పీకర్‌ ‌తీసుకోవాలంటూ శుక్రవారం ఉన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. దీంతో జంపింగ్‌ ‌జంపాగ్‌లకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ‌చర్యలు తీసుకునేలా అదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ ‌నేతలు పిటిషన్‌ ‌వేశారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లోగా టైం ఫ్రెమ్‌ ‌ఫిక్స్ ‌చేయాలని అసెంబ్లీ స్పీకర్‌ ‌గడ్డం వినోద్‌ ‌కుమార్‌కు సింగిల్‌ ‌బెంచ్‌ ఆదేశించింది. సింగిల్‌ ‌బెంచ్‌ ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టు డివిజన్‌ ‌బెంచ్‌లో అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్‌ ‌చేశారు. అసెంబ్లీ కార్యదర్శి రిట్‌ అప్పీల్‌పై హైకోర్టు తీర్పు ప్రకటించింది. స్పీకర్‌ ‌తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు డివిజన్‌ ‌బెంజ్‌ ‌స్పష్టం చేసింది. స్పీకర్‌కు ఎలాంటి నిర్ధిష్ట సమయం అంటూ లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. తగిన  స్పీకర్‌ ‌నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. సింగిల్‌ ‌బెంచ్‌ ‌తీర్పును హైకోర్టు కొట్టేవేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 10వ షెడ్యూల్‌ ‌ప్రకారం నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌కు సీజే ధర్మాసనం సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page