‌కృష్ణా నీటి వివాదంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి

మూసి నడితో పాటు పెండింగ్‌ ‌ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి

నీటిపారుదల శాఖ మంత్రి మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి

రాజస్థాన్‌ ఉదయ్‌ ‌పూర్‌లో అఖిల భారత నీటిపారుదల శాఖ మంత్రుల సదస్సు..హాజరైన మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి

ఉదయ్‌ ‌పూర్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : కృష్ణా నది నీటి వివాదంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ఇప్పటికైనా కేంద్రం రంగంలోకి దిగి సర్దుబాటు చర్యలకు పూనుకోవాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు రాజస్థాన్‌ ‌రాష్ట్రంలోనీ ఉదయ్‌ ‌పూర్‌ ‌లో మంగళవారం, బుధవారం జరుగుతున్న అఖిల భారత నీటిపారుదల శాఖ మంత్రుల సదస్సులో ఆయన పాల్గొన్నారు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సులో మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం ఆనకట్ట నుండి,నాగార్జునసాగర్‌ ‌కుడి కాలువ పరిధి నుంచి అక్రమంగా ఆంద్రప్రదేశ్‌ ‌కు కృష్ణా జలాలను తరలించడాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరారు. కృష్ణా నది నీటి వినియోగాన్ని పర్యవేక్షించేందుకు టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేయాలని, తెలంగాణ హక్కులను కాపాడేందుకు కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్‌ ‌కేసును త్వరగా పరిష్కరించాలని కోరారు. తెలంగాణలోని భారీ, చిన్ననీటి తరహా ప్రాజెక్టుల డీసిల్టింగ్‌, ‌డీ-సెడిమెంటేషన్‌ ‌ఖర్చును పూర్తిగా కేంద్రం భరించాలని, ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన ప్రాజెక్టులకు మాదిరిగా తెలంగాణకు కూడా కేంద్రం ఆర్థిక సహకారం అందించాలని మంత్రి కోరారు. అంతేకాకుండా మేడిగడ్డ ప్రాజెక్టు విచారణను త్వరగా పూర్తి చేయాలని, దానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ స్పష్టమైన సిఫార్సులను తెలపాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విధానాన్ని అనుసరించి, తెలంగాణ ప్రభుత్వం భారీ,మధ్య,చిన్ననీటి తరహా సాగు ప్రాజెక్టుల డీసిల్టింగ్‌, ‌డీ-సెడిమెంటేషన్‌ ‌పనులను ప్రారంభించిందని, ఈ పనులకు కేంద్రం ఆర్థిక సహాయం అందించాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు.

మేడిగడ్డ ప్రాజెక్టు విచారణ చాలా నెలలుగా పెండింగ్‌లో ఉందని, దాన్ని వేగంగా పూర్తి చేయించి తెలంగాణ ప్రభుత్వం ముందుకు ఎలా వెళ్లాలనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలను అందించాలని జలశక్తి మంత్రిత్వ శాఖను అయం కోరారు. హైదరాబాద్‌ ‌పరిధిలో 55 కిలోమీటర్ల మేర ముసీ నదిని అభివృద్ధి చేసే ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసిందని, గంగా, యమునా నదుల పునరుద్ధరణకు అందించిన మద్దతు మాదిరిగానే ముసీ రివర్‌‌ఫ్రంట్‌ అభివృద్ధి ప్రాజెక్టుకు కూడా కేంద్రం పూర్తి సహాయాన్ని అందించాలని ఆయన కోరారు. ఈ ప్రాజెక్టు ద్వారా నది పునరుజ్జీవం, మురుగు నిర్వహణ మెరుగుదల, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, అలాగే హైదరాబాద్‌లో నీటి వినియోగ అనుసంధానం వంటి లక్ష్యాలను సాధించవచ్చని ఆయన చెప్పారు. ముసీ నది వెంట ట్రంక్‌, ఇం‌టర్‌సెప్టర్‌ ‌మురుగునీటి పైప్‌లైన్‌లు ఏర్పాటు చేసేందుకు రూ.4,000 కోట్లు, గోదావరి నదిని ఉస్మాన్‌ ‌సాగర్‌, ‌హిమాయత్‌ ‌సాగర్‌ ‌రిజర్వాయర్లతో అనుసంధానం చేయడానికి అదనంగా రూ.6,000 కోట్లు కేటాయించాలని ఆయన కోరారు. ఈ ప్రణాళిక ద్వారా హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా నిర్ధారణ అవుతుందని, అలాగే ముసీ నది పునరుద్ధరణ సాధ్యమవుతుందని మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి వివరించారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టు, సమక్క-సారక్క ప్రాజెక్టు, సీతారామ సాగర్‌ ‌ప్రాజెక్టులకు తక్షణ నీటి కేటాయింపును వేగవంతం చేయాలని, అలాగే తెలంగాణలో సాగు ప్రాజెక్టుల కోసం తక్కువ వడ్డీతో, దీర్ఘకాలిక రుణాలను అందించాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. ‘‘ఇండియా ఏ 2047 %-% నీటి పరంగా భద్రత కలిగిన దేశం’’ అనే ప్రధాన భావనతో నిర్వహించిన అఖిల భారత జలశక్తి మంత్రుల సదస్సులో, తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనలు కృష్ణా నది నీటి పంపిణీ, ప్రధాన సాగు ప్రాజెక్టులకు నిధులు, ముసీ నది పునరుద్ధరణ వంటి అత్యవసర అంశాలపై దృష్టి సారించాయని ఆయన తెలిపారు. ఇవన్నీ రాష్ట్ర నీటి భద్రత, అభివృద్ధికి కీలకమైనవిగా మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page