హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మరణించిన, ఇతరులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న ఘటనపై డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్, గౌరవ చైర్‌పర్సన్ నేతృత్వంలోని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్‌ఆర్‌సీ) సుమోటోగా కేసు(హెచ్‌ఆర్‌సీ నెం.7141/2025) నమోదు చేసుకుంది. వార్తా కథనాల్లో ఆరోపించబడిన రోడ్డు భద్రతా లోపాలు, అధిక వేగం, హైవే విస్తరణ ఆలస్యం, అధికారుల నిర్లక్ష్యంపై కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈమేరకు రవాణా, హోం, గనులు, భూగర్భ శాస్త్రం, ఎన్‌హెచ్‌ఏఐ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్టీసీ శాఖల నుండి సమగ్ర నివేదికలు కోరింది. వాటిని డిసెంబర్ 15వ తేదీ ఉదయం 11 గంటల లోపు సమర్పించాలని ఆదేశించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





