– మీ సేవ వాట్సాప్ ద్వారా ఫలితాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28: తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు వెల్లడించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడించింది. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. మార్చి 14 నుంచి ప్రారంభమైన ప్రధాన పరీక్షలు ఈ నెల 13న పూర్తయ్యాయి. సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ నెల 23వ తేదీతో జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది. మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేస్తామని ముందు నుంచి చెబుతున్నా తాజాగా ఈనెల 29న విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం పరీక్షల విభాగం అన్ని ఏర్పాట్లు చేసింది.
2. వాట్సాప్ ఓపెన్ చేసి హాయ్ (Hi) అని మెసేజ్ పంపండి.
3. ఎస్సెస్సీ రిజల్ట్స్ అని టైప్ చేయండి.
4. మెనులో ఓపెన్ సర్వీస్ ఎంపికపై క్లిక్ చేయండి.
5. మీ హాల్ టికెట్ నంబర్ నమోదు చేయండి.
6. వివరాలు సమర్పించిన వెంటనే మీ మార్కుల మెమో వాట్సాప్‌లో అందుతుంది.
ఫలితాలను వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పేపర్‌లెస్, ఎలాంటి క్యూలు లేకుండా, సులభమైన సేవలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అందించడంలో ముఖ్యమైన మైలురాయి. ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నాయకత్వంలో ప్రజల కోసం మీ సేవ మరింత సౌలభ్యం, పారదర్శకతతో సేవలు అందిస్తూ విస్తరిస్తోంది.
ప్రారంభం నుండి విశేష స్పందన
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





