‘తెలంగాణ రైజింగ్‌’ సర్వేకు విశేష స్పందన

– రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం
– 2047 నాటికి రాష్ట్రం ఎలా ఉండాలనే దానిపై అభిప్రాయ సేకరణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనలో ప్రతి పౌరుడి స్వరాన్ని ప్రతిబింబించే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్‌ విజన్‌ 2047 సిటిజన్‌ సర్వేను ప్రభుత్వం ప్రారంభించింది. ప్రజల ఆలోచనలు, కలలు, ప్రాధాన్యతలను సేకరించి రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధికి పునాదులు వేయాలన్న సంకల్పంతో ఈ సర్వేను రూపొందించారు. గత వారం ప్రారంభమైన ఈ సర్వేకు రాష్ట్రవ్యాప్తంగా విశేషమైన స్పందన లభిస్తోంది. వేలాదిమంది ఇప్పటికే తమ అభిప్రాయాలు, సూచనలు పంచుకుని భారత స్వాతంత్య్రానికి వంద సంవత్సరాలు పూర్తికానున్న 2047 నాటికి తెలంగాణ ఎలా ఉండాలి అన్న దానిపై తమ దృష్టిని తెలియజేశారు.

కార్యక్రమం ప్రధాన లక్ష్యం

ప్రతి గ్రామం, పట్టణం, నగరంలోని ప్రజల ఆశయాలను ప్రతిబింబించేలా ఒక ప్రగతిశీల, సుస్థిర, సమానత్వ తెలంగాణ కోసం సమగ్ర మార్గపటాన్ని రూపొందించడం. సర్వే ద్వారా ప్రజలు విద్య, ఉపాధి, ఆవిష్కరణ, మహిళా సాధికారత, ఆరోగ్యం, పచ్చదనం, జీవన ప్రమాణాలు వంటి కీలక రంగాలపై తమ ఆలోచనలు పంచుకుంటున్నారు.

అధికారుల నివేదన

ఇది కేవలం పాలసీ ప్రణాళిక మాత్రమే కాదు.. తెలంగాణ భవిష్యత్తును ప్రజలే ఊహించి నిర్మించుకునే ఉద్యమం. ఇప్పటికే పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంకా పాల్గొనని పౌరులు తప్పక తమ ఆలోచనలు, సూచనలు పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సర్వే రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సులభంగా అందుబాటులో ఉంది. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు, మెట్రో స్టేషన్లు, విద్యాసంస్థలు, పౌర ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేసి లేదా షషష.్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ/్‌వశ్రీaఅస్త్రaఅaతీఱంఱఅస్త్ర వెబ్‌సైట్‌ను సందర్శించి పాల్గొనవచ్చు. సర్వేలో పాల్గొనడానికి గడువు నవంబర్‌ 1 వరకు పొడిగించారు. మీ ఆలోచన, మీ స్వరం తెలంగాణ-2047 దిశను నిర్ణయించగల శక్తి మీ చేతుల్లోనే ఉంది. ఈరోజే పాల్గొని భవిష్యత్తు తెలంగాణ నిర్మాణంలో మీ ముద్ర వేయండి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page