– సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28: మైనారిటీ, మెజారిటీ మధ్యనే కాదు.. హిందూ ముస్లింలు కలిసి ఉండే ఒక మంచి వాతావరణాన్ని జమాయత్ ఉలామా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ హఫీజ్ పీర్ షబ్బీర్ తీసుకొచ్చారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఇటీవల ఆయన చనిపోగా ముఖ్యమంత్రి ఫాహీన్‌నగర్‌లోని వారి ఇంటికి మంగళవారం వెళ్లి వారి కుటుంబీకులను పరామర్శించారు. ఆరు దశాబ్దాలుగా సామాజిక సేవలో ఉన్న వారి మరణం ముస్లిం సోదరులకే కాదు.. తెలంగాణ, ఏపీలకు తీరని లోటని అన్నారు. రాష్ట్రంలో వారు చేసిన సేవలు మరువలేనివన్నారు. ఆయన లేకపోవడం బాధాకరమంటూ అందుకే వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చానని తెలిపారు. మైనారిటీ సమస్యలను పరిష్కరించేందుకు ఆయన ఎంతో కృషి చేశారన్నారు. వారి సేవలను శాశ్వతంగా గుర్తించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని, వారి ఆశయాలకు అనుగుణంగా మైనారిటీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




