తొలి దశ తెలంగాణ ఉద్యమకారుడు కొమ్మిడి మృతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7 : భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నర్సింహారెడ్డి తుదిశ్వాస వరకు నీతినిజాయతీతో జీవించారన్నారు. గోదావరి జలాల సాధన, మూసీ పరిరక్షణ ఉద్యమాలను నిర్వహించి నిత్యం ప్రజల పక్షాన నిలిచారని గుర్తుచేశారు. భూదానోద్యమానికి తన 300 ఎకరాల భూమిని దానం చేసిన గొప్ప మానవతావాది అని స్మరించుకున్నారు. 1978, 1983 సంవత్సరాల్లో రెండుసార్లు భువనగిరి నుంచి శాసనసభకు ప్రాతినిథ్యం వహించారన్నారు. నిరాడంబర జీవితాన్ని గడుపుతూ అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాడిన నర్సింహారెడ్డి నేటి తరానికి ఆదర్శప్రాయుడని కొనియాడారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *