– వడ్డెపల్లి ఫిల్టర్ బెడ్స్ పరిధిలో 30ఎకరాల భూమి అప్పగింత
హనుమకొండ, ప్రజాతంత్ర, జూలై 7 : కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(‘కుడా’) ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ప్రక్రియలో భాగంగా వరంగల్, హనుమకొండ నగరాల పరిధిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హనుమకొండ వడ్డెపల్లి ఫిల్టర్ బెడ్స్ పరిసర ప్రాంతాల్లోని భూములను అభివృద్ధి చేసేందుకు భూ యజమానులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. వడ్డెపల్లి ఫిల్టర్ బెడ్స్ భూ యజమానుల కమిటీ సభ్యులు, ప్రతినిధులైన బూర విద్యాసాగర్, ఎం.విజయ్ కుమార్, డి.స్వరాజ్యలక్ష్మి, బూర అశోక్ కుమార్, బల్లెం వెంకటయ్య, రాజేష్, తిరుపతి రెడ్డిలు సంయుక్తంగా ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అజిత్ రెడ్డిలను మంగళవారం కలిసి వడ్డెపల్లి ఫిల్టర్ బెడ్స్ పరిధిలోని సుమారు 30ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనల ప్రకారం ‘కుడా’ ఆధ్వర్యంలో లేఅవుట్ అభివృద్ధికి యజమానులు సంపూర్ణ అంగీకారం తెలిపారు. ఇందుకు సంబంధించిన అధికారిక అప్లికేషన్లు, భూమి హక్కుల పత్రాలు, అవసరమైన అన్ని డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలను అధికారికంగా సమర్పించారు. చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ నగర సుందరీకరణ, క్రమబద్ధమైన పట్టణాభివృద్ధికి ల్యాండ్ పూలింగ్ ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు రాబోయే నాలుగు రోజుల్లో ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





