దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పును హర్షణీయం..  

12 ఏళ్లుగా నిరీక్షిస్తున్న బాధిత కుటుంబాలకు సరైన న్యాయం
ఉగ్రవాదంపై జీరో టోలరెన్స్ విధానంతో మోదీ ప్రభుత్వం
కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి

దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటనపై తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, . మారణహోమాన్ని సృష్టించిన ఉగ్రవాదులకు ఉరే సరైన శిక్ష అని తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం పేర్కొనడం ప్రజాస్వామ్యంలో హింస, ఉగ్రవాదానికి చోటు లేదని మరోసారి స్పష్టమైందని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటనపై తెలంగాణ హైకోర్టు తీర్పుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో స్పందించారు. 12 ఏళ్లుగా ఓ పీడ కలలా వెంటాడుతున్న బాధితుల కుటుంబాలకు సరైన న్యాయం జరిగిందని భావిస్తున్నామని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని,  ఎన్‌ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు సమర్థించడం పట్ల బీజేపీ పార్టీ పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు జీరో టోలరెన్స్ విధానంతో మోదీ ప్రభుత్వం పని చేస్తోందని, గత11 ఏళ్ల బీజేపీ పాలనలో ఇలాంటి ఘటనలకు తావు లేదు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత  దేశ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యమిచ్చింది. ఉగ్రవాదాన్ని సంపూర్ణంగా నిర్మూలించే దిశగా మోదీ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది. ప్రజాస్వామ్యంలో బుజ్జగింపు రాజకీయాలు ఏ మాత్రం ప్రోత్సహించకూడదు. దీన్ని అన్ని రాజకీయపార్టీలు దీన్ని గుర్తుంచుకోవాలన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ సమగ్ర విచారణ చేసి, నిందితులను శిక్షించడంలో కీలకపాత్ర వహించిందని కొనియాడారు.  .ఈ పేలుళ్ళ సంఘటన దర్యాప్తు చేసిన పోలీస్ సిబ్బందికి మంత్రి కిషన్ రెడ్డి అభినందనలు తెలిపారు. దేశ భద్రత కోసం అత్యంత ప్రాధాన్యతనిస్తూ మరింత కఠిన చర్యలు ప్రభుత్వాలు అవలంబించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page