న్యాయ వ్యవహారాల్లోనూ సాంకేతికత

– అందిపుచ్చుకుని ముందుకు సాగాలి
– లాఫెస్ట్ ‌కార్యాక్రమం ప్రారంభించిన మంత్రి వివేక్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13:‌న్యాయరంగంలో సాంకేతికత విపరీతంగా పెరిగిందని.. ఇప్పుడు టెక్నాలజీ వాడి న్యాయపరమైన పత్రాలు రాయొచ్చు, అనాలిసిస్‌ ‌చేయొచ్చని మంత్రి వివేక్‌ అన్నారు. టెక్నాలజీ తో పాటు  హ్యుమానిటీ ఉండాలని.. ఎందుకంటే హ్యుమానిటీ లేకపోతే దీర్ఘకాలం ఏ రంగంలో నిలబడలేమని అన్నారు.బాగ్‌ ‌లింగంపల్లిలోని అంబేద్కర్‌ ‌లా కాలేజీలో విద్వత 2025 లా ఫెస్ట్ ‌కి ముఖ్య అతిధిగా మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి హాజరయ్యారు. అక్టోబర్‌ 13 ‌నుంచి 16వ తేదీ వరకు జరగనున్న లా ఫెస్టివల్‌ను  మంత్రి వివేక్‌ ‌ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 1990లలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు 2020లలో పూర్తిగా మారిపోయాయని… న్యాయరంగంలో కూడా న్యాయమూర్తుల దృక్పథం, న్యాయవాదుల వైఖరి మారుతోందని అన్నారు. మనం కూడా వాటికి అనుగుణంగా మారాలని అన్నారు.  నేను స్వయంగా ఒక ఇండస్టియ్రలిస్ట్ ‌ని.. 5 లక్షల పెట్టుబడితో ప్రారంభించి, 2 వేల కోట్ల వ్యాపారం వరకు తీసుకువచ్చానని అన్నారు. ఇది సాధ్యమైంది కేవలం కష్టపడి, నిజాయితీగా పనిచేయడం వల్లే అని అన్నారు మంత్రి వివేక్‌. ‌నేను మెడిసిన్‌ ‌డాక్టర్‌, ఇం‌డస్టీ గురించి ఏ తెలియదు.. అయినా కానీ కామన్‌ ‌సెన్స్, ‌కష్టపడి పనిచేయాలనే ఆసక్తి వల్లే సాధించ గలిగానని అన్నారు.. ఏ రంగంలోనైనా విజయం కావాలంటే కష్టపడాలని, నిజాయితీగా ఉండాలని, మనుషుల సమస్యలు అర్థం చేసుకోవాలని అన్నారు. అంబేద్కర్‌ ‌కళాశాల ఈ సారి దేశవ్యాప్తంగా విద్యార్థులను ఆహ్వానిస్తూ ఇలాంటి ఉత్సవం నిర్వహించడం గొప్ప విషయమని… కాకా కేవలం 10వ తరగతి చదివినవారు అయినా, పేదలకు విద్య అందించాలి, అవకాశాలు కల్పించాలి అన్న దృక్పథంతో ఉన్నారని అన్నారు. ఆ దృష్టిని ముందుకు తీసుకెళ్లడం మన బాధ్యత అని అన్నారు మంత్రి వివేక్‌.ఈ ‌కళాశాల 80 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం ఒక గొప్ప ఆలోచన అని… ఇది పోటీని, కృషిని పెంచుతుందని అన్నారు మంత్రి వివేక్‌. ‌మా కుటుంబం కార్మిక ఉద్యమం నేపథ్యంతో ఉందని… నేను కార్మిక శాఖ మంత్రిగా కొత్త చట్టాలపై పనిచేశానని… ముఖ్యంగా గిగ్‌ ‌వర్కర్లకు చట్టబద్ధమైన రక్షణ ఉండేలా ఒక చట్టం రాబోతోందని అన్నారు. అలాగే పదేళ్లుగా పెరగని కనీస వేతనాల వ్యవస్థను సరిచేయడం కూడా జరుగుతోందని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page