– మెడికోపై అత్యాచార ఘటన వ‌్యవహారంలో
– బెంగాల్ సిఎం వ్యాఖ్యలపై ఒడిషా మహిళా కమిషన్ ఆగ్రహం
భువనేశ్వర్, అక్టోబర్13: ఒడిషా వైద్యవిద్యార్థినిపై బెంగాల్లో అత్యాచార ఘటనపై సిఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై మహిళలు, మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఒడిశాకు చెందిన వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనిపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆ బాధ ఆమెకు ఏం అర్థమవుతోందని ఒడిశాకు చెందిన మహిళా నేతలు మండిపడ్డారు. మహిళల భద్రతకు భరోసా ఇవ్వకుండా రాత్రి బయటకు వెళ్లొదంటూ మమత చేసిన వ్యాఖ్యలు సరికాదని ఒడిశా మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ శోవ్నా మోహంతీ విమర్శించారు. దీదీగా పేరుపొందిన ఒక మహిళా నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం షాక్‌కు గురిచేసిందన్నారు. బెంగాల్ లోని మహిళలకు ఇది అవమానం అని ఒడిశా డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా తీవ్రంగా స్పందించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోకుండా.. లింగ ఆధారిత అసమానత్వాన్ని తీసుకువస్తూ, బాలికల హక్కులు ప్రశ్నించడం ఏమాత్రం సరికాదన్నారు. ఆ విద్యార్థినిపై ఎలాంటి కనికరం లేకపోతే.. ఆ విషయాన్ని ఒడిశా ప్రభుత్వానికి రాతపూర్వకంగా తెలియ జేయండని అసహనం వ్యక్తంచేశారు. బాధితురాలు ప్రైవేటు మెడికల్ కాలేజీలో చదువుతోంది. అర్ధరాత్రి 12.30కి అమ్మాయి బయటకు ఎలా వొచ్చింది? నాకు తెలిసినంతవరకు ఈ ఘటన అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆ సమయంలో ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే ఘటన. ఇటువంటి వాటిని తమ ప్రభుత్వం సహించదు. దోషులను కఠినంగా శిక్షిస్తాం అని మమత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె బయటకు వెళ్లింది రాత్రి ఎనిమిది గంటలకు అని బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఒడిశా లోని బాలేశ్వర్ జిల్లాకు చెందిన యువతి(23) పశ్చిమబెంగాల్ దుర్గాపుర్‌లోని ఓ ప్రైవేటు వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం రాత్రి ఆమె ఫ్రెండ్‌తో కలిసి బయటకు వెళ్లగా, పలువురు దుండగులు వారిని వెంబడించారు. ఆ ఫ్రెండ్‌ను తరిమేసి.. ఆ విద్యార్థినిని సప అడవిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో తాజాగా నాలుగో నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు. దీనిపై బెంగాల్లోనూ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. గతంలోనూ ఓ మెడికోపై అత్యాచారం చేసి హతమార్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





