ఎర్రవల్లి పరిధిలో 388 ఎకరాల్లో సర్వే ముమ్మరం

– నాలుగు బృందాలుగా రంగంలోకి సర్వేయర్లు
– 325 సర్వే నంబర్ లో హద్దుల పరిశీలన
– ఎర్రవల్లి 325 సర్వే నంబర్ భూములపై ఉత్కంఠ

మర్కుక్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 18: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ పరిధిలోని భూములపై రెవెన్యూ అధికారులు సర్వేను ముమ్మరం చేశారు.మర్కుక్ మండలం 325 సర్వే నంబర్ పరిధిలోని 388 ఎకరాల భూమిలో బుధవారం సర్వేయర్లు నాలుగు బృందాలుగా జిల్లా సర్వేయర్ అనిల్, శంకర్, డివిజన్ సర్వేయర్ వంశీ, మండల సర్వేయర్ ప్రజ్వల సర్వే చేపట్టారు. ఫీల్డ్ లో సర్వే చేస్తుండగా మర్కుక్ తహసీల్దార్ కార్యాలయంలో మరికొందరు సర్వేయర్లు ఉంటూ ఫీల్డ్ లో ఉన్న బృందాలకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ సమాచారం సేకరించారు.ఈ సర్వేలో ప్రభుత్వ ఉన్నతాధికారులు నేరుగా పాల్గొనలేదు.325 సర్వే నంబర్ లో మొత్తం 388ఎకరాల భూమి ఉంది.ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన రైతులు మాట్లాడుతూ 325 సర్వే నంబర్ లో కేసీఆర్ పేరు మీద గానీ, ఆయన కబ్జా చేసింది గానీ ఇంచు కూడా లేదు అని,అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పు అని  చెప్పారు. మరికొందరు రైతులు 325 సర్వే నంబర్ పరిధిలో దాదాపు 80 నుండి 90 ఎకరాల్లో చెరువు తవ్వించి దానికి పాండురంగ డ్యాం అని నామకరణం చేశారని, ఆ చెరువు కింద భూములు కోల్పోయిన తమకు ఇంకోచోట భూమి ఇప్పిస్తానని చెప్పి ఇప్పటివరకు ఇప్పించలేదని ఆరోపించారు. 325 సర్వే నంబర్ లోని లావ‌ణి పట్టా భూములు 388 ఎకరాలను తమ పేరు మీద శాశ్వతంగా పట్టా చేయాలని, తమ ఆధీనంలో ఉన్న భూముల జోలికి రావద్దని రైతులు సర్వే బృందాలకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సర్వే అధికారులు సేవ్య నాయక్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ 325 సర్వే నంబర్ లో ప్రభుత్వ భూమి పూర్తి విస్తీర్ణం 388.5 గుంటల భూమి ఇది మూడు గ్రామాల శివారులను శివార్ వెంకటాపూర్,వరదరాజపూర్ ఎర్రవల్లి ఆనుకొని ఉన్నదని,ఎర్రవల్లి భూమిని సర్వే చేయమని అధికారులు ఆదేశించారని తెలిపారు. ఈ సందర్భంగా సర్వే బృందాలు ఇక్కడికి చేరుకొని నాలుగు బృందాలుగా ఏర్పడి డిజిపిఎస్ రోవర్తో సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం రి సర్వే చేయమని చెప్పడంతో డీజిపిఎస్ టెక్నాలజీతోనే నిర్వహిస్తున్నామని, ప్రతిది క్షుణ్ణంగా శాటిలైట్ ద్వారా పాయింట్లు తీసుకోవడం జరిగింది. దీని పూర్తి మ్యాపు తయారు చేసిన తర్వాత దీంట్లో వచ్చిన చెరువు,కెనాల్ సాగుకు ఉపయోగపడని భూమి, ఉపయోగపడే భూమి ఎంత ఉన్నది అనేది దాని మీద పూర్తి సమాచారం కొరకు ఈ సర్వే నిర్వహిస్తున్నాం అని,రైతులు ఎలాంటి ఇబ్బందులు పెట్ట‌కుండా సర్వేకు సహకరిస్తున్నారని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *