-11మందిని అరెస్ట్ చేసిన టాస్క్‌ఫోర్స్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25: హైదరాబాద్ నగరంలో నకిలీ వైద్యుల ముఠాపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు విరుచుకుపడ్డారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ జోన్ల పరిధిలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఏకంగా 11 మంది నకిలీ డాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతర రాష్టాల్ల్రోని ప్రముఖ విశ్వవిద్యాలయాల పేరుతో సృష్టించిన నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లను అడ్డుపెట్టుకుని, వీరు నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో ఏకంగా క్లినిక్‌లు తెరిచి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎటువంటి అర్హత లేకపోయినా రోగులకు అల్లోపతి వైద్యం అందిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వీరు నగరంలో ఎక్కడెక్కడ క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు? ఏయేవిశ్వవిద్యాలయాల నుంచి నకిలీ సర్టిఫికెట్లు పొందుపరిచారు? రోగులకు ఎలాంటి వైద్యం, మందులు అందిస్తున్నారు? అనే కీలక అంశాలపై పోలీసులు ప్రస్తుతం లోతుగా విచారణ జరుపుతున్నారు. అర్హత లేని నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నకిలీ ధ్రువపత్రాలతో వీరంతా వైద్యులుగా చలామణి అవుతున్నారు. ఇలా 11 మందిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ జోన్లలో ప్రత్యేక ఆపరేషన్ పేరిట పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అర్హత లేకున్నా క్లినిక్‌లు ఏర్పాటు చేసి ప్రజలకు సెలైన్లు, ఇంజక్షన్లు, మందులు ఇస్తున్నట్లు గుర్తించినట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. పారామెడికల్ కోర్సు చేసిన ఓ మహిళ అనుమతులు లేకుండా నాలుగేళ్లుగా క్లినిక్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. పట్టుబడిన 11 మంది నకిలీ వైద్యులను అదుపులోకి తీసుకుని మందులను స్వాధీనం చేసుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




