– న్యాయపరమైన చిక్కులు లేకుండా నిర్వహణ
– అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25: మూసీ ప్రాజెక్ట్ కోసం భూ సేకరణను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అద్ది కారులను ఆదేశించారు. ల్యాండ్ పూలింగ్ పైన స్పష్టమైన విధానం రూపొందిం చుకోవాలన్నారు. మూసీ ప్రాజెక్ట్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఎస్టీఎల్, బఫర్ జోన్, అసైన్డ్ భూముల సేకరణ కోసం స్పష్టమైన విధానం తయారు చేసుకోవాలని సూచించారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా చూడాలన్నారు. మూసీ ప్రాజెక్టు ఫేజ్ 2కి వీలైనంత త్వరగా టెండర్లను పిల వాలని తెలిపారు. ప్రాజెక్ట్లకు అతి తక్కువ వడ్డీకి వచ్చే రుణాలపైన మునిసిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని సీఎం తెలిపారు. టీడీఆర్పై ప్రతి వారం సమీక్ష జరగాలని చెప్పారు. మంచిరేవుల ఓంకారేశ్వరస్వామి ఆలయం టెండర్లు తక్షణం పిలవాలని అదే శించారు. కొత్వాల్ గూడా బర్డస్ పార్కు మరింత ప్రచారం కల్పించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. త్వరగా పనులు జరిగేలా చూడాలన్నారు. పనుల్లో ఆలస్యం తగదని, నిర్ణీత సమయంలోగా ప్రాజెక్టుల పూర్తికి ముందుకు సాగాలని అన్నారు. హెచ్ఎర్తో బోధి. పెవిలియన్లో జరిగిన ఈ సమావేశానికి సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, హెచ్ఎండిఎ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి.కర్జన్, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సృజన, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఈ.వి.నరసింహ రెడ్డి, ఎంఆర్డీసీఎల్ జేఎండీ గౌతమి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




