నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి
మక్క కంకులు, మామిడి పిందెలతో బిజెపి ఆందోళన
హైదరాబాద్: అసెంబ్లీకి బిజెపి సభ్యులు మక్క, జొన్న కంకులతో ర్యాలీగా వొచ్చారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అకాలవర్షాలతో నష్టపోయని రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని పలు జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు భారీగా పంట నష్టం వాటిల్లిందని, రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా వడగండ్లు ,ఈదురు గాలుల కారణంగా వరి, మామిడి, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షాల, వడగండ్ల కారణంగా కరీంనగర్, నిజామాబాద్ నష్టం వాట్టిందని ఆరోపించారు. అయితే వరి, మక్క కంకులతో రావడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బిజెపి సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
సాగునీటి కష్టాలను అధిగమించి పంటలను కాపాడుకున్న రైతులను అకాల వర్షాలు తీవ్రంగా దెబ్బ కొట్టాయి. చేతికొచ్చిన పంట ఎటూ కాకుండా పోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు…వడగండ్లు, ఈదురుగాలుల వంటి ప్రకృతి వైపరిత్యం రైతన్నలకు గుండెకోతను మిగిల్చింది. గత రెండు రోజులుగా ఈదురుగాలులు, అకాల వర్షాలు, వడగళ్ల వానలకు అనేక జిల్లాల్లో విపరీతంగా పంట నష్టం వాటిల్లింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈదురుగాలులకు విద్యుత్ ల్కెన్లు నేతలకొరిగాయి. మరికొద్ది రోజుల్లో కోతలకు వచ్చే వరిపంట దెబ్బతింది. మామిడి పిందెలు,కాయలు నేలరాలాయి. మొక్కజొన్న, కర్బూజ పంటలకు నష్టం వాటిల్లినట్లు- తెలిపారు. జిల్లాల్లో పంటలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న రైతులకు అకాల వర్షాలకు కనీటిపర్యంతం అవుతున్నారు. జరిగిన పంటనష్టాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయ, రెవెన్యూ, విద్యుత్ యంత్రంగం రంగంలోకి దిగింది. ప్రధానంగా మామిడి, వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లుగా గుర్తించారు.