‘‘కైండ్‌నెస్ వాల్’’ అనే సామా జిక కార్యక్రమాన్ని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ప్రారం భించింది. ఇక్కడ ఎవరైనా దాతలు ఉంచిన వస్తువులను అవసరం ఉన్నవారు ఉచితంగా తీసుకెళ్లవచ్చు. అలాగే ఇతరులు తమ వద్ద అదనంగా ఉన్న వస్తువులను విరాళంగా ఇవ్వొచ్చు. ఖమ్మం నగర ప్రజల ందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వారి సహకారాన్ని అందించాలని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కోరింది. ఈ చొరవ మరింత అభివృద్ధి చెందుతుందని, సమాజంలో దయ, పరస్పర సహకారాన్ని ప్రోత్సహించడానికి ఈ కొత్త చొరవ దోహదపడుతుందని ఆశిద్దాం..
-ప్రజాతంత్ర
దయా గుణాన్ని ప్రోత్సహించే ‘‘వాల్ ఆఫ్ కైండ్ నెస్’’
